గౌతం
చనిపోయాడన్న కబురు నన్ను కలచివేసింది. గౌతం నా కో-ఎంప్లాయ్. ఎప్పటిలాగే నిన్న
సాయంకాలం ఆఫీస్ వద్ద విడిపోయాం ఎవరి ఇళ్ళకు వాళ్లం బయలుదేరుతూ. తెల్లారేసరికి ఈ
కబురు. అరుణ ఫోన్ చేసి చెప్పండి .గౌతం బార్య అరుణ. తేరుకోని, ప్రస్తుతం నేను
ఒక్కడినే ఉంటున్నను కనుక, ఈజీగా తెములుకోని గౌతం ఇంటికి బయలుదేరాను. నేను
వెళ్లేసరికి అక్కడ చాలా సాదాసీదాగా ఉంది. మెయిన్ డోర్ మూసి ఉంది. దానిని తోసుకోని
లోపలికి వెళ్లను. హాలులో అరచేతుల్లో మొహం పెట్టుకొని ఏడుస్తున్న.. సోఫా మీద అరుణను
గుర్తు ఎరిగాను. అటు వెళ్లి ఆమె పక్క సోఫా చైర్ లో కూర్చున్నారు. 'ఏమిటి అరుణ ఇది
ఏం జరిగింది' అనడగ్గలిగాను. అరుణ్ చేతుల్లోంచి మోహం బయటపెట్టింది. ఆమె కళ్ళు ఉబ్బి
ఉన్నాయి. నన్ను చూస్తూనే,' నాకు ఏమీ బోధపడట్లేదు' అంది అరుణ. 'ఏం జరిగింది' అన్నాను. ఏం అడగాలో, ఎలా అడగాలో
నాకు బోధ పడటం లేదు. అప్పుడే అక్కడకు రోహిత్ వచ్చాడు. గౌతం, అరుణ ల ఏకైక సంతానం
రోహిత్. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 'అంకుల్ వచ్చారా' అంటూ పక్కన
కూర్చున్నాడు. నేనేం అనలేదు. వాడు చెప్పుకొచ్చాడు, 'రాత్రి డిన్నర్ తరువాత మమ్మీ
డాడీ లు హాల్లో టీవీ వద్దకు, నేను నా రూం లోకి వెళ్లాం. ఉదయం మమ్మీ నా రూమ్ తలుపు
కొట్టి చెప్పింది చనిపోయారని'
' టివి
కట్టేసి మేము మా రూమ్ కు వెళ్ళిపోయాం. నేను లేచే సరికి గౌతం పక్కన లేరు. హాల్ లోను
లేరు. మెయిన్ డోర్ లోపల్నుంచి లాక్ వేసినట్లే ఉంది. గౌతం కోసం ప్రాకులాడుతూ
ఉండగా.. తన మా రూమ్ అటాచ్ బాత్రూమ్ లో కనిపించాడు. నేలమీద పడి ఉన్నారు. గమనిస్తే
చనిపోయారు అనిపించింది. ఆ వెంటనే రోహిత్ కు చెప్పాను. తర్వాత మీకు ఫోన్ చేశాను'
అని చెప్పింది అరుణ.
' మమ్మీ చెప్పగానే నేను బయటకు వెళ్లాను గిరి అంకుల్ కోసం ఆయన ఎంతకీ ఫోను
ఎత్తకపోవడంతో. వాళ్లది ల్యాండ్ ఫోన్ వాళ్ళ మొబైల్ ఫోన్లు వాడరు కదా' చెప్పాడు
రోహిత్. 'గిరి అంకుల్ వచ్చారా' అడిగింది అరుణ. 'లేదు మమ్మీ. ఆయన, సునీత ఆంటీ
మార్నింగ్ వాక్ కు వెళ్లారట. వాళ్ల పక్కింటి వాళ్లతో వాళ్ళు రాగానే మన ఇంటికి
అర్జెంట్గా పంపించమని చెప్పు వచ్చేశాను' చెప్పాడు రోహిత్. వెంటనే,' ఆ పక్కింటి
వాళ్ళకి డాడి విషయం చెప్పలేదు కదా' అని అడిగింది అరుణ, రోహిత్ ను. 'లేదు మమ్మీ'
చెప్పాడు రోహిత్. 'మమ్మీ.. డాడీ బాడీని బయటికి చేరుద్దామా' అడిగాడు రోహిత్ అరుణను.
'అన్నట్లు గౌతమ్ బాడీ.. ఇంకా ఆ బాత్రూం లోనే ఉందా' అన్నాను.
' అవునంకుల్. చెప్పే వరకు అది వెళ్ళద్దు అని చెప్పింది మమ్మీ' చెప్పాడు రోహిత్.
'అరే, అదేమిటి..? ఏమిటిది అరుణ' అన్నాను. 'గౌతం వాడిని చూడలేం' చెప్పింది అరుణ.
'అంటే' నాకు అంతా విస్మయంగా ఉంది. 'రక్తంలో తేలినట్లు పడి ఉన్నారు' చెప్పింది
అరుణ. 'జారి పడ్డాడా' అడిగాను. 'లేదు. గౌతం గుండె వైపు లోతుగా కత్తి ఒకటి ఉంది.
అభి నుంచి రక్తం కారినట్లు ఉంది' చెప్పింది అరుణ. 'ఆత్మహత్యా..?' అన్నాను. 'అలానే
ఉంది' అంది అరుణ. 'అరే. అంతగా అఘాయిత్యం ఏమిటి? గౌతం అసలు పిరికివాడే కాదు'
అన్నాను గట్టిగానే. అరుణ ఏమీ అనలేదు. రోహిత్ సడన్ గా, 'హత్య కాదు కదా' అనేసాడు. నేను
గతుక్కుమన్నాను. అరుణ ఏంటో చూస్తోంది. రోహిత్ గింజుకుంటున్నాడు. 'అక్కడకు పదండి
మొదట' అని అటువైపు కదిలాను. గౌతం ఇల్లంతా నాకు బాగా ఎరుకే. ఆ బాత్రూంలోకి వెళ్లి
చూసేసరికి చాలా దారుణం అనిపించింది. 'అయ్యో' అన్నాడు రోహిత్. అరుణ కనిపించలేదు.
బయటే ఉండిపోయింది. రోహిత్ గట్టిగానే ఏడుస్తున్నాడు. గౌతం బాడీ అస్తవ్యస్తంగా ఉంది.
ఆ బాడిని అంటిపెట్టుకుని నేలంతా రక్తం ముద్దు ముద్దుగా ఉంది. ఆ బాడీ గుండె వైపు
కత్తి ఒకటి పిడి వరకు దిగుబడి ఉంది. నేను బయటకు వచ్చేసాను రోహిత్ ను సుమారుగా
లాక్కుంటూనే. ఆ బెడ్ రూంలో అరుణ లేదు. హాల్ లోకి వచ్చాను. అరుణ హాల్ లో సోఫాలొనే
ఉంది. 'ఏం అనుకోవాలి' అన్నాను. ఆ ఇద్దరూ ఏమీ అనడం లేదు. అప్పుడే గిరి, సునీతలు
వచ్చారు. వీళ్ళు గౌతం ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేనే చొరవ తీసుకున్నాను. వాళ్లను తొలుత
ఆ బాత్రూం లోకి తీసుకు వెళ్లి, తిరిగి హాల్ లోనికి తీసుకు వచ్చాను. పిమ్మట
మాట్లాడాను వాళ్ళతో. 'మిస్టరీగా ఉందే' అన్నారు గిరి. అరుణను ఓదారుస్తుంది సునీత.
రోహిత్ ని దగ్గరగా తీసుకున్నారు గిరి.
' ఏం చేద్దాం' నేను అడిగాను. ఎవరూ ఏమీ అనడం లేదు. నేనే, 'పోలీస్ సహకారం తీసుకుందామా'
అనేసాను. 'వద్దు' అంది అరుణ గమ్మున. నేను ఆశ్చర్యపోయాను. 'ఈ సంగతి బయటకుపోతుంది.
మా వాళ్ళ వద్ద ఎగతాళి అవుతుందేమో. వాళ్లు గెలిచేస్తా రేమో' అంది అరుణ గజిబిజిగా.
గౌతం, అరుణ లది లవ్ మ్యారేజ్. ఇరువైపు పెద్దలు సహకరించలేదు. అప్పటినుంచి వీళ్ళు
వాళ్లకు దూరంగానే ఉంటున్నారు. కలపాలనే మా ప్రయత్నాలన్నీ విఫలమై ఐపోయాయి చాన్నాళ్ల కిందటే.
'ఐతే ఎలా. కనీసం విషయం మనకైనా తేలాలి కదా' అన్నాను.
గిరి అన్నారు అరుణతో, 'విషయం నీకే తెలియాలి.
మాకు మీ అన్యోన్యత తప్ప మరోటి తెలియదు' అని. నేను అరుణనే చూస్తున్నాను ఏం
చెబుతుందా అని. అప్పుడే, అరుణను, 'చెప్పు అరు. నీకు ఏమైనా అనుమానం ఉందా' అని
అడిగింది సునీత. 'అబ్బే ఏమీ లేదు. నాకు ఏమీ అర్థం కావడం లేదు సుని' అంది అరుణ,
సునీతతో. నేను, గిరి మొహాలు చూసుకున్నాం. 'మమ్మీ డాడీ లు ఎప్పుడూ కనీసం
కసరుకొన్నట్లు కూడా మాట్లాడుకోలేదు. నాకు తెలుసుగా' చెప్పాడు రోహిత్.
' య య. మాకు తెలుసుగా. అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నాం. ఏమి అనలేకపోతున్నాం'
అన్నాడు గిరి. నేను అదే అన్నట్లు తలాడించాను. అప్పుడే పని మనిషి వచ్చింది. 'గంట
ఆగి రావా' అంది అరుణ ఆమెతో గబుక్కున. 'అదేమిటమ్మా' అంది ఆ పనిమనిషి. 'ఏమీ లేదు.
సాయంకాలం రా' అంది అరుణ చికాగ్గా. పనిమనిషి వెళ్ళిపోయింది.' ఇలా ఎంతసేపు అని. ఏదోటి
తేల్చేసుకోవాలి' అన్నాను. 'నిజమేగా. బాడిని ఎంతసేపని దాయగలం' అన్నారు గిరి. అరుణ
ఏమీ మాట్లాడడం లేదు. అరుణే మాట్లాడాలి ఇక. అందుకే ఆమెపై ఒత్తిడి చేస్తున్నాను.
సునీత కూడా అందుకే తోడ్పడుతుంది. గిరి ఏమీ అనకపోయినా తల పట్టుకుని కూర్చుండిపోయారు
సోఫా కూర్చీలో. నేను అటు ఇటు తచ్చాడుతున్నాను. రోహిత్ ఎప్పుడో మరో సోఫా కూర్చీలో
చేరిపోయాడు. ' కామ్ గా బాడిని దహనపరిచేద్దామా' అన్నాడు రోహిత్. 'ఎటుా తేలకుండానే'
అన్నాను. 'మరే. ఏమీ తీర్చుకోలేక పోతున్నాం. గౌతమ్ ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అలాగే
గౌతం హత్య కాబడడం ఏమిటి? రెండు నమ్మలేం' అన్నారు గిరి. నేను అరుణతో,' మీ మధ్య
రాత్రి జరిగిన విషయాలను కాస్త మాతో షేర్ చేసుకో ఓ మారు. ఏమైనా తేల్చుకోగలమేమెా'
అని అన్నాను. అరుణ,' సాదాగానే మాట్లాడుకున్నాం' అని అంటూనే, 'టీవీ చూస్తుండగా ఏదో
ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ గదిలో ఉంది. గౌతం వెళ్ళి ఫోన్ మాట్లాడి తిరిగి వచ్చాడు.
అది సాధారణమే. ఇలా అప్పుడప్పుడు కాల్స్ వస్తుంటాయి. అంతే. ఆ వెంటనే గౌతమ్ టీవీ ఆఫ్
చేసేశాడు. మేము మా రూమ్ కు వెళ్ళిపోయాం' అంది. నేను, 'సరే సరే. గౌతమ్ ఫోన్ ఎక్కడా'
అని అన్నాను. 'మా బెడ్ రూమ్ లోనే ఉంటుంది' అని చెప్పింది అరుణ. అంతలోనే
లేవబోయింది. నేనే వారించి, అటు వెళ్లాను. ఆ ఫోన్ తో తిరిగి వచ్చాను. స్క్రీన్ లాక్
పేటర్న్ ఇచ్చి ట్రూ కాలర్ యాప్ లోకి వెళ్లాను. మొదటిగా కనిపించిన కాల్ వివరాలు
చూశాను. రాత్రి 9:40 కి వచ్చిందది. కాలర్ రోహిత్. 'లాస్ట్ కాల్ వచ్చింది నీ నుంచే'
అన్నను రోహిత్ తో. 'అవును రాత్రి డాడీకి చేశాను. స్టడీకి వీలుకావడంలేదు టీవీ
వాల్యూమ్ తగ్గించమని చెప్పాను' అన్నాడు రోహిత్. 'ఇది కామనే. వాడు చాలా సార్లు
ఇలానే చేస్తాడు' చెప్పింది అరుణ. 'నిజానికి మమ్మీ, డాడీ తక్కువ వాల్యూమే పెడతారు.
అది నా స్టడీకి ఇబ్బంది కాదు. కానీ 9:30 దాటాక వాళ్లు వెళ్లి నిద్రపోవాలని నేనలా
కాల్ చేస్తుంటాను' చెప్పాడు రోహిత్. అరుణ రోహిత్
వైపు చూస్తోంది. 'అబ్బే కారణం తెలుసుకోవడం మనకు సాధ్యం కాదు' అనేశారు గిరి.
కొద్దిసేపు మౌనం తర్వాత, అరుణ ఉన్నట్లుండి, 'బెబ్బెబ్బే' అంటూ గొణగడం చేపట్టింది.
నేను ఆమెను చూసి, పిమ్మట ఆమె చూస్తున్న వైపు చూసాను. అలా చూస్తూనే, 'అరే గౌతం.
అదేమిటి అలా నడుచుకు వచ్చేస్తున్నాడు' అన్నాడు. గౌతం నవ్వుకుంటూ మా వద్దకు
వచ్చేశాడు. అతడి గుండె వైపు కత్తి అలానే ఉంది. బట్టల మీద రక్తం అలానే ఉంది.
వస్తూనే అతడు, 'ఆల్ ఆర్ ఫూల్స్' అన్నాడు గబగబా నవ్వుతూనే. అవును కదూ, ఈరోజు ఫూల్స్
డే కదుా. 'చాలు చాలు గొప్ప ఘనకార్యం చేశారు. హడలిపోతున్నాం తెలుసా. ఇది మీకు తగదు'
అన్నారు గిరి. అంతా గౌతమ్ చుట్టూ చేరి ఉన్నాం. గౌతం నవ్వుతూనే తన గుండెపైపు
కత్తిని తీశాడు. అది స్ప్రింగ్ బ్యాక్. మేము నవ్వలేక నవ్వేయవలసి వస్తోంది. అప్పుడే
చూశాను అరుణను, ఆమె స్పందన కానరాక. అరుణ ఆ సోఫాలోనే ఉంది. మమ్మల్నే చేస్తోంది.
కానీ ఆమెలో కదలిక లేదు. కుదిపి చూసాను. ఆమె గబుక్కున పక్కకు వాలిపోయింది. అంటే...
అరుణ
గుండె ఆగి చనిపోయిందని, 'ఈ ప్రాక్టికల్ జోక్ మూల్యం ఒక ప్రాణం' అని అనకుండా
ఉండలేకపోయాను.
అతడే హంతకుడు
Reviewed by Smartbyte group
on
August 29, 2018
Rating:

No comments: