హంతకుడెవరు... (Crime story)

                 గష్టు పదిహేను,2011... కాకినాడ. సమయం ఆరున్నర కావస్తుంది. తన కజిన్‌ రిసెప్షన్‌కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు ఇన్‌స్పెక్టర్‌ రవి. అంతలో అతని ఫోన్‌ రింగయ్యింది. చూస్తే కానిస్టేబుల్‌ అజయ్‌."ఏం అజయ్‌... లీవ్‌ రోజున కూడా వదిలిపెట్టవా... ఏం జరిగింది?"... నవ్వుతూ అన్నాడు ఫోన్‌ తీసి."సర్‌...మీరు త్వరగా రావాలి. వాకలపూడి లో మర్డర్‌ జరిగిందని తెలిసింది" అన్నాడు అజయ్‌  కంగారుగా. "ఎవరు చెప్పారు?" అన్నాడు రవి అలర్ట్‌ అవుతూ. "శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి చెప్పాడు సర్‌.చనిపోయినతని కొడుకట. "సరే మీరు వెళ్ళండి. నేను ఇట్నుంచిటే వచ్చేస్తాను" అని ఫోన్‌ పెట్టేసి హుటాహుటిన బయలుదేరాడు రవి.
                  తుడి ఇంట్లో దృశ్యం చూస్తూనే మతిపోయింది పోలీసులకి. చాలా దారుణంగా చంపేశారతన్ని.ఒంటినిండా కత్తిపోట్లు ఉన్నాయి. మెడ తెగి వేళ్ళాడుతుంది. గదంతా రక్తమే. వెంటనే బాడీని పోస్ట్ మార్టమ్‌ కి పంపించి ఎంక్వయిరీ మొదలుపెట్టాడు రవి.ఇంట్లోవాళ్ళ మాటల్ని బట్టి పెద్దాయన రోజూ భోజనం చేసి రెండు గంటలకు పడుకుంటాడు.నాలుగున్నరకి లేస్తాడు. ఐదు గంటలకి మెల్లగా నడుచుకుంటూ దగ్గర్లో ఉన్న పార్కుకి వెళ్తాడు. గంటా రెండు గంటలు అక్కడే గడిపి ఇంటికొస్తాడు. ఈరోజు మాత్రం నాలుగున్నర దాటినా ఆయన లేవలేదు. కోడలికి అనుమానం వచ్చి ఐదింటికి తలుపు కొట్టింది. లోపల్నుంచి సమాధానం రాకపోవడంతో కిటికీలోంచి చూసింది. రక్తపు మడుగులో పడివున్న మామగార్ని చూసి షాకై భర్తకి ఫోన్‌ చేసింది. అతడొచ్చి చూసి పోలీసులకి ఫోన్‌ చేశాడు.
                   "మీరు చెప్పినదాన్నిబట్టి  చూస్తే హత్య రెండు నుంచి నాలుగ్గంటల మధ్యలో జరిగింది" అన్నాడు రవి. శ్రీనివాస్‌ మాట్లాడలేదు. ఇంత దారుణంగా పొడిచి పొడిచి చంపారు. ఆయన కచ్చితంగా కేకలు పెట్టేవుంటాడు. ఎవ్వరికీ వినిపించలేదా?అన్నాడు శ్రీనివాస్‌ వైపు చూస్తూ. "నేనసలు ఇంట్లోనే లేను సర్‌. వయసు మీద పడటంతో నాన్న బిజినెస్‌ చూడలేకపోతున్నారు. నేనే చూసుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్ కి కూడా రాను. ఉదయం వెళ్తే మళ్ళీ రాత్రికే."అతని మాటల్లో ఎక్కడా తడబాటు లేదు. "సరే. మొత్తం ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరినీ పిలవండి"అన్నాడు రవి.క్షణాల్లో అతని ముందు అందరూ హాజరయ్యారు. "హత్య జరిగిన సమయంలో ఎవరు ఎక్కడున్నారో నాకు తెలియాలి" అన్నాడు తేరిపారా చూస్తూ.
                    "నేను మా షాప్‌లో ఉన్నాను" అన్నాడు శ్రీనివాస్‌. "నేనసలు రెండు రోజులుగా ఊళ్ళోనే లేను సార్‌. మా అమ్మకి ఒంట్లో బాలేదంటే చూడ్డానికి మా ఊరెళ్ళాను. ఇందాకే వచ్చాను. వచ్చేసరికి అయ్యగారు.."...చెప్పాడు వాచ్‌మేన్‌. "నేను కూడా ఆ సమయానికి ఇంట్లో లేనయ్యా. అయ్యగారు పడుకునేముందు చెక్‌ ఇచ్చారు... బ్యాంక్‌లో వేసి రమ్మని. ఆ పనిమీదే వెళ్ళాను" అన్నాడు డ్రైవర్‌.పెద్దాయన కోడలివైపు చూశాడు రవి.


"నాకు కూడా మధ్యాహ్నం పడుకోవడం అలవాటు సర్‌. మావయ్యగారు పడుకున్నాక నేనూ పడుకున్నాను. నాకే కేకలూ వినిపించలేదు"అందామె. "పక్క గదిలోనే ఉన్నా వినిపించలేదా కేకలు" అన్నాడు రవి అనుమానంగా.ఆమె ముఖంలో రంగులు మారాయి. "నిజం సార్‌ నాకేమీ వినిపించలేదు. వింటే వెంటనే

లేచేదాన్ని కదా" అంది భయపడుతూ. " అంత భయపడాల్సిన అవసరం లేదులెండి.

          త్య చేసిందెవరో నాకు తెలిసిపోయింది" అంటూ బేడీలు అందుకున్నాడు రవి. తిన్నగా వెళ్ళి డ్రైవర్‌ చేతికి సంకెళ్ళు వేశాడు. అందరూ విస్తుపోయారు. అతడే హంతకుడని ఇన్‌స్పెక్టర్‌ ఎలా కనిపెట్టాడో ఎవ్వరికీ అర్ధం కాలేదు.
               "యజమాని ఇచ్చిన చెక్కును బ్యాంకులో  వేయడానికి వెళ్ళానని చెప్పాడు డ్రైవర్‌. ఆ సమాధానమే అతణ్ణి పట్టించింది. ఎందుకంటే ఈ రోజు ఆగష్టు పదిహేను. బ్యాంకులు పని చేయవు" అని చెప్పాడు ఇన్‌స్పెక్టర్‌ రవి.



హంతకుడెవరు... (Crime story) హంతకుడెవరు... (Crime story) Reviewed by Smartbyte group on July 13, 2016 Rating: 5

2 comments: