వరాలిచ్చిన సాధువు


    శివన్న, గోపన్న గోపవరం నుండి బయలుదేరారు బస్తీకి. శివన్న దూరపు బంధువులు తాము పెట్టిన అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేయడానికి ముగ్గురు యువకులు కావాలి కనుక మరో ఇద్దరు నమ్మకస్తులను తోడ్కొని రమ్మనడంతో శివన్న తన ప్రాణమిత్రులు రామన్న, గోపన్నలతో కదిలాడు. ముగ్గురూ దారిలోని అడవిలో అడుగు పెట్టేసరికి సూర్యుడు నడినెత్తిమీదికి వచ్చాడు. ముగ్గురికీ ఆకలేసింది. "ఈ అడవిలో ఎప్పుడైనా సరే కాయో, పండో కనిపించేది, ఈ రోజు ఏదీ దొరకలేదు" అన్నాడు శివన్న. "నిజమే, మన అదృష్టం బాగాలేనప్పుడు అంతే" అన్నాడు రామన్న. "ఒరే, ఆ కుంటలో నీరు తాగి కాసేపు ఈ చెట్టుక్రింద విశ్రమిస్తే ఉపశమనం పొందవచ్చు" అన్నాడు గోపన్న.
                ముగ్గురూ చెట్టుకింద కూర్చున్నారు."అరే ఏమిటి, ఈ కమండలం? పాతచింతపండుతో, బహుశా ఇది ఏమునీశ్వరునిదో అయ్యింటుంది" అన్నాడు శివన్న. దానిని చేతుల్లోకి తీసుకుని మురిసిపోతూ, " అరెరే, ఈపులి చర్మం చూశారా? నల్లని చారలతో  కనీ వినీ ఎరుగని అందాన్ని ఒలకబోస్తుంది, ఏసాధువుదో ఈపులి తోలు" అన్నాడు రామన్న.
                 "అరెరే, ఈదండం చూడండి,సన్నగా, నున్నగా నిగనిగలాడుతుంది, ఆరెండు వస్తువులతో బాటు ఈ దండం కూడా ఆయతీశ్వరునిదేమో, ఆమునివర్యుడెవరో, ఎక్కడికెళ్ళాడో" అన్నాడు గోపన్న. ఆ చెట్టుపక్కనే మరో చెట్టు చాటున పడుకున్న ఇద్దరు దొంగలు ఆవస్తువులను చూసి ఎవరో సన్యాసి ఏ కృరమృగం అరుపో విని కంగారులో
వాటినిక్కడే వదలి పారిపోయుంటాడనుకున్నారు.
                  "రామన్నా, గోపన్నా ఇక వెడదాం,బస్తీ చేరితే మావాళ్ళు తినటానికేమైనా ఇస్తారు, నాకు తెగ ఆకలేస్తుంది"అన్నాడు శివన్న. వెంటనే కమండలం నుండి లడ్డూలు, జిలేబీ, గారెలు, బూరెలు, పకోడీలు, చేగోడీలు, బొబ్బట్లు,కుప్పలు తెప్పలుగా పడ్డాయి. ముగ్గురూ ఆశ్చర్యపోయారు. కడుపునిండా తిన్నారు, వాటి రుచే రుచి అని మెచ్చుకున్నారు.అది చూసిన దొంగలు అబ్బురపడ్డారు.నోళ్ళు మెదపకుండా పరస్పరం ఏవో సైగలు చేసుకున్నారు. రామన్న "శివన్నా,తినటమైంది, ఆకమండల మిటివ్వు, కుంటలో నీరు తాగటానికి మీకు నీరు తెస్తాను" అని కమండలం అందుకున్నాడు.
అంతే అతను కూర్చున్న పులి చర్మం కదలి అతణ్ణి కుంట వద్దకు చేర్చింది. రామన్న లిప్తకాలంలో నీటితో చర్మం మీద తిరిగొచ్చాడు. ముగ్గురూ నివ్వెరపోయారు. ఈ మారు ఇది గమనించిన దొంగలు శివన్నను, రామన్నను చితకబాది కమండలాన్ని, పులిచర్మాన్ని లాక్కొని పరుగు లంకించుకున్నారు."దొంగలు దొంగలు" అంటూ వారు పెట్టిన కేకలు
అరణ్యరోదనఅయ్యాయి.
                   గోపన్న ఆగ్రహోదగ్రుడై తన చేతనున్న దండాన్ని వారిపైపు విసిరాడు. ముగ్గురూ ఊహించని విధంగాదండం ఆ దొంగలను తరిమి తరిమి కొట్టి కొట్టి బాధించింది. దాని దాడికి దడ పుట్టిన దొంగలు కమండలాన్ని, పులి చర్మాన్ని వదిలి వెళ్ళారు. వస్తువులు చేజారనందుకు నేస్తగాళ్ళు నిండుగా నవ్వుకున్నారు. అంతలోనే ఉరుము ఉరిమినట్టు ముని బిగ్గరగా అరుస్తూ వచ్చి" నీచులారా, నేను పూజకు పువ్వులు కోసుకురావటానికి వెళితే పవిత్రమైన నా తపోసామాగ్రిని తస్కరిస్తారా? మిమ్మల్నేం చేస్తానో చూడండి" అని ఒక దర్భపుల్లను తీసి కళ్ళవద్ద పెట్టుకున్నాడు.
                     "స్వామీ, మేము ఏపాపమూ ఎరుగము, మమ్మల్ని క్షమించండి"  అని జరిగింది విన్నవించుకుని పదాలపై పడ్డారు. మునిశాంతించాడు, ముగ్గురినీ మన్నించాడు. "మీకు తలా ఓవరం అనుగ్రహిస్తున్నాను, మీకు అవసరమనప్పుడు 'సత్యానందా సంరక్షించు' అని నా పేరు స్మరిస్తే చాలు మీరనుకున్నది నెరవేరుతుంది, వెళ్ళండి"అన్నాడు. హస్తి దాడికి స్వస్తి చెప్పి కనుమరుగైంది. ముగ్గురూ బస్తీ చేరేసరికి ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినందున బంధువులు కంటతడిపెట్టడంతో శివన్న మనస్సు వికలమైంది. అది చూసిన రామన్న  శివా! విచారించకు అంటూ "సత్యానందా సంరక్షించు" అన్నాడు మింటికెగసిన మంటలు తృటిలో మటుమాయమయ్యాయి.
                  బంధువులు "శివా! ముహూర్తం బాగాలేనందున ఈ అనర్ధం చోటు చేసుకుంది, మళ్ళీ కబురుపెట్టగానే మీ ముగ్గురూ రండి" అన్నారు. వారు తిరుగు ముఖం పట్టారు. అప్పటికే చీకటి ముసిరింది అడవి వద్దకొచ్చే సరికి పులిగాండ్రింపులు, భల్లూకం గుర్రుకలు, నక్క ఊళలు, గుడ్లగూబల కేకలు వినిపించసాగాయి. ముగ్గురూ భయంతో
కంపించారు.
                   పిరుంటే ఉప్పమ్ముకొని బతకవచ్చని, గోపన్న "సత్యానందా సంరక్షించు" అన్నాడు. మిత్రత్రయం సురక్షితంగా ఊరు చేరింది. కన్నతల్లి, పుట్టిన నేల స్వర్గం కన్న మిన్న అన్న సూక్తిని గుర్తుకు తెచ్చుకున్నారు.ముగ్గురూ బస్తీమాట మరచి ఉపాధికోసం ఉన్న ఊళ్ళోనే ఒళ్ళు వంచి పొలం పనులను చేసుకుంటూ సొంత ఊరికే
అంకితమయ్యారు.


వరాలిచ్చిన సాధువు వరాలిచ్చిన సాధువు Reviewed by Smartbyte group on July 13, 2016 Rating: 5

No comments: