నిజం - నిప్పు


క్బరు కొలువులో చాలా ఏళ్ళనుంచి ఉంటున్నాడు బీర్బల్‌. అన్ని విషయాల్లోనూ బీర్బల్‌ సలహాలు పాటిస్తుంటాడు అక్బరు. దీంతో ఆ కొలువులోని కొంతమంది ఉద్యోగులు బీర్బల్‌ అంటే అసూయ. వీళ్ళంతా బీర్బల్‌ను
ఎలాగైనాసరే కొలువులో దోషిగా నిలబెట్టాలనుకున్నారు.
వాళ్ళలో ఒకడైన మస్తాన్‌,'నా దగ్గర ఓ పధకం ఉంది' అంటూ ముందుకొచ్చాడు. అందరూ కలసి ఏవో గుసగుసలాడుకున్నారు. '...ఇలా చేద్దాం, దాంతో అవమానం భరించలేక బీర్బల్ ఉద్యోగం వదలి వెళ్ళిపోతాడు'అన్నాడు మస్తాన్‌. అందరూ సరే అన్నారు. మర్నాడు... సభలో అక్బరు, బీర్బల్‌ ఇతర మంత్రులంతా సమావేశమై ఉన్నారు. ఈ
లోగా మస్తాన్‌ పరుగుపరుగున వచ్చి...'జహాపనా... నేనొక ఘోరమైన నేరాన్ని కళ్ళముందు చూశాను' అన్నాడు.
'ఏంటో చెప్పు' అన్నాడు అక్బరు. దాన్ని చేసింది మన కొలువులోని ఓ కీలకవ్యక్తే. చెబితే నా భవిష్యత్తు ఏమౌతుందోనని భయం' అన్నాడు. 'ఫర్వాలేదు ...దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదు'. 'నిన్న రాత్రి మన ఖజానాలోని కొన్ని వజ్రాలను ఓ వ్యక్తి దొంగిలించడం నా కంట పడింది. ఆ వ్యక్తి...మన బీర్బల్‌ గారే'!
భలో అందరూ ఆశ్చర్యపోయారు.'అతడే దొంగ అని నువ్వు నిరూపించగలవా?' అడిగాడు అక్బరు .'చిత్తం...నిజం నిప్పు లాంటిది అంటారు. నిప్పుల్లో ఎర్రగా కాల్చిన ఓ ఇనుప కడ్డీని బీర్బల్‌ చేతిలో పడతాను, చేతులు కాలకుండా ఉంటే ఆయన నిర్దోషి అన్నడు మస్తాన్‌.
'నువ్వేమంటవ్ బీర్బల్‌' అని అడిగాడు అక్బరు.
'నేరారోపణ జరిగింది కాబట్టి మస్తాన్‌ చెప్పినట్టే కానివ్వండి జహాపనా' అన్నాడు బీర్బల్‌.
భటులు వెళ్ళి నిప్పుల్లో ఎర్రగా కాల్చిన కడ్డీని పళ్ళెంలో పెట్టి తెచ్చారు. బీర్బల్‌ ఆ కడ్డీని చేతుల్లోకి తీసుకోబోతూ ఆగాడు. 'మస్తాన్‌గారూ...మీరే ఆ కడ్డీని నా చేతిలో పెట్టండీ అన్నాడు బీర్బల్‌.
'అమ్మో...నిప్పును ముట్టుకోవాలా' అంటూ అరిచాడు మస్తాన్‌. ఆ నిప్పుని ముట్టుకుంటే దోషుల చేతులు మాత్రమే కాలుతాయి కదా!మీకెందుకూ భయం? అన్నాడు బీర్బల్‌. అక్బర్ కూడా బీర్బల్‌నే బలపరిచాడు.దాంతో మస్తాన్‌ భయపడిపోయాడు. తన అసూయ తనకే చేటు తెచ్చిందంటూ బీర్బల్‌ కాళ్ళపైబడి క్షమాపణ కోరాడు.

నిజం - నిప్పు నిజం - నిప్పు Reviewed by Smartbyte group on July 13, 2016 Rating: 5

No comments: