రామాపురంలో ఒకరోజు రాత్రి ఒక దొంగ పరిగెత్తుకుంటూ
వచ్చి షావుకారు దుకాణంలో దూరి... 'షావుకారు గారు నన్ను రక్షించండి.నా ప్రాణం కాపాడండి. జమీందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా రాజ భటుల కంటబడ్డాను. భటులు ఈ తోవనే వస్తున్నారు. నన్ను వారి నుంచి రక్షిస్తే నేను దొంగిలించిన డబ్బులో సగం మీకు ఇస్తాను' అని చెప్పాడు.
డబ్బుపై ఆశతో షావుకారు దొంగను రక్షించేందుకు ఒప్పుకున్నాడు.తలుపు చాటున దాక్కోమని దొంగకు సూచించాడు. ఆ తోవన వచ్చిన రాజభటులు 'దొంగ ఇటువైపు గానీ వచ్చాడా' అని షావుకారుని ఆరా తీశారు. ఎవరూ రాలేదని అబద్ధం చెప్పాడు షావుకారు. దాంతో భటులు దొంగను వెతుక్కుంటూ ఆ తోవన ముందుకు వెళ్ళిపోయారు.
భటులు వెళ్ళిపోయాక...దొంగని తన వాటా ఇమ్మంటూ అడిగాడు షావుకారు. 'ఇదిగో నీ వాటా తీస్తున్నా' అని సంచిలోంచి కత్తి,తాడు తీశాడు దొంగ.
షావుకారి మెడపైన కత్తిపెట్టి...'నీకు బతకాలని ఆశ ఉంటే కేకలు వేయకు' అని బెదిరించి అతడిని కుర్చీకి కట్టేసి దుకాణంలోని డబ్బుని కూడా సంచిలో వేసుకుని
వెళ్ళిపోయాడు. దొంగకు ఆశ్రయం కల్పించడం వల్ల తన డబ్బు పోయిందని లబోదిబో
మన్నాడు. తాను నష్టపోయిన సొమ్మి గురించి రాజు గారికి ఫిర్యాదు చేస్తే దొంగకు
సాయం చేసినందుకు తానే మళ్ళీ చిక్కుల్లో పడాల్సి వస్తుందేమోనన్న భయంతో
బయటకు చెప్పకుండా ఉండిపోయాడు. మరెప్పుడూ దుష్టులకి సాయం చేయకూడదని
తప్పు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడకూడదనీ బుద్ధితెచ్చుకున్నాడు.
వచ్చి షావుకారు దుకాణంలో దూరి... 'షావుకారు గారు నన్ను రక్షించండి.నా ప్రాణం కాపాడండి. జమీందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా రాజ భటుల కంటబడ్డాను. భటులు ఈ తోవనే వస్తున్నారు. నన్ను వారి నుంచి రక్షిస్తే నేను దొంగిలించిన డబ్బులో సగం మీకు ఇస్తాను' అని చెప్పాడు.

భటులు వెళ్ళిపోయాక...దొంగని తన వాటా ఇమ్మంటూ అడిగాడు షావుకారు. 'ఇదిగో నీ వాటా తీస్తున్నా' అని సంచిలోంచి కత్తి,తాడు తీశాడు దొంగ.
షావుకారి మెడపైన కత్తిపెట్టి...'నీకు బతకాలని ఆశ ఉంటే కేకలు వేయకు' అని బెదిరించి అతడిని కుర్చీకి కట్టేసి దుకాణంలోని డబ్బుని కూడా సంచిలో వేసుకుని
వెళ్ళిపోయాడు. దొంగకు ఆశ్రయం కల్పించడం వల్ల తన డబ్బు పోయిందని లబోదిబో
మన్నాడు. తాను నష్టపోయిన సొమ్మి గురించి రాజు గారికి ఫిర్యాదు చేస్తే దొంగకు
సాయం చేసినందుకు తానే మళ్ళీ చిక్కుల్లో పడాల్సి వస్తుందేమోనన్న భయంతో
బయటకు చెప్పకుండా ఉండిపోయాడు. మరెప్పుడూ దుష్టులకి సాయం చేయకూడదని
తప్పు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడకూడదనీ బుద్ధితెచ్చుకున్నాడు.
దొంగ - షావుకారు
Reviewed by Smartbyte group
on
July 13, 2016
Rating:

No comments: