నిజమైన వీరుడు

               రాజు విక్రమవర్మ జన్మదినోత్సవం సందర్భంగా కుస్తీ పోటీలను నిర్వహించారు. ఆ పోటీల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ బలమైన యువకులందరూ వచ్చారు. ఎంతోమంది పోటీకి వచ్చినా అందరూ మల్లన్నే గెలుస్తాడని ఊహించారు. ఎందుకంటే మల్లన్న గతంలో ఎన్నో బహుమతులు పొందాడు. చివరికి మల్లన్న, రంగన్న అనే ఇద్దరు మాత్రమే బరిలో మిగిలారు. ఈ పోటీలను చూడ్డానికి
రంగయ్య ఎంతో దూరం నుంచి వచ్చాడు. అతడు తన స్నేహితులతో కలిసి ముందు వరుసలో కూర్చొనిపోటీలను  ఆసక్తిగా చూస్తున్నాడు.
            ఇంతలో ప్రేక్షకులు కూర్చున్న డేరాలకు నిప్పంటుకుంది. దీన్ని గమనించిన రంగయ్య పరుగెత్తుకుంటూ వెళ్ళి ప్రాణాలకు తెగించి మంటల్లోకి దూకి ఎంతోమందిని రక్షించాడు. ఈలోగా మల్లన్న ప్రత్యర్ధిని మట్టి కరిపించి విజేతగా నిలిచాడు. వేదిక మీదకు మల్లన్నను పిలుస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ, వేదిక మీదకు వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రంగయ్యను ఆహ్వానించాడుమంత్రి. పోటీలో పాల్గొనని రంగయ్య విజేత ఎలా అయ్యాడో తెలియక అందరూ ఆశ్చర్యపోయారు. ఆ
విషయాన్ని గమనించిన రాజు విక్రమవర్మ...'కండలు పెంచి పదిమందిని పడగొట్టేవాడు మాత్రమే వీరుడు కాదు. పదిమందినీ కాపాడేవాడే అసలైన వీరుడు. ఇక్కడ ఇంతమంది బలశాలులు ఉన్నాఒక్కరు కూడా ఆపదలో ఉన్న వారిని కాపాడటానికి ముందుకు రాలేదు. ఆ పని రంగయ్య మాత్రమే చేశాడు. అతడే నిజమైనవీరుడు' అంటూ రంగయ్యను పిలిచి పోటీలో ఇచ్చే దానికన్నా రెట్టింపు మొత్తాన్ని ఇచ్చి ఘనంగా సత్కరించాడు రాజు.
నిజమైన వీరుడు నిజమైన వీరుడు Reviewed by Smartbyte group on July 13, 2016 Rating: 5

No comments: