
'ఏమిటో చెప్పు' అన్నాడు ముని.
'స్వర్గం, నరకం నిజంగా ఉంటాయా? అవి ఉన్నట్టే అయితే ఎవరూ చూసినట్టు చెప్పరే!' అని
అడిగాడు సైనికాధికారి.
'నీ సమస్యకు పరిష్కారం నే తీర్చుతా. నువ్వెక్కడ పనిచేస్తున్నావో చెప్పు' అని ప్రశ్నించాడు
ముని. 'నేను ఈ రాజ్యానికి ముఖ్య సైనికాధికారిని' చెప్పాడా వ్యక్తి. ' నీలాంటి తెలివితక్కువవాణ్ణి సైనికాధికారిగా ఎవరు నియమించారు? అన్నాడు ముని. ఆ మాటకు పట్టరాని కోపంతో కత్తి తీశాడు సైనికాధికారి. 'ఇప్పుడే నీలో నరకద్వారాలు తెరుచుకుంటున్నాయి' అన్నాడు ముని నవ్వుతూ. ఆ మాటలకు సేనాధిపతి ఆలోచనలో పడి...'క్షమించండి, ఏదో ఆవేశంలో...' అన్నాడు చేతులు జోడించి. 'ఇప్పుడు నీలో స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. మనలో చెలరేగే కోపం, లోభం, మోహం మొదలైన దుర్గుణాలే నరక కూపాలు. అందరికీ సుఖసంతోషాలు సమకూర్చే శాంతం, కరుణ, దయ, ఓర్పు.... వంటి సద్గుణాలు ఉన్న
మనసే స్వర్గం. నరకం, స్వర్గం మన మంసుల్లోనే ఉన్నాయి!' అన్నాడు ముని. 'అర్ధమైంది, మునివర్యా!కృతజ్ణ్తలు' అంటూ మునికి మనస్ఫూర్తిగా నమస్కరించి అక్కణ్నుంచి సంతోషంగా కదిలాడు సైనికాధికారి.
నరకం-స్వర్గం
Reviewed by Smartbyte group
on
July 13, 2016
Rating:

No comments: