రామయ్య అనే ఒక వడ్రంగి ఉండేవాడు. ఓరోజు అతను ఒక పెద్ద దుంగను నిలువుగా రెండు ముక్కలు చేయాలనుకున్నాడు. అందుకోసం రంపంతో దుంగను కోయసాగాడు.
రామయ్యకు సమీపంలోనే చెట్టుపై ఒక కోతి ఉంది. రామయ్య చేసే పనిని అది గమనించసాగింది.
దుంగను మధ్యదాకా కోసేసరికి మధ్యాహ్నం అయింది. రామయ్యకు బాగా ఆకలివేయడంతో పని ఆపుచేసి
భోజనానికి వెళ్ళాడు. వెళుతూ వెళుతూ దుంగ ఎక్కడివరకూ కోశాడో గుర్తుకోసం దాని మధ్యలో ఓ కర్రముక్క
పెట్టాడు.
రామయ్య అలా వెళ్ళగానే కోతి చెట్టు దిగి దుంగ వద్దకు వచ్చింది. దాని చుట్టూ తిరిగి పరిశీలించింది. దుంగ మధ్యలో ఉన్న కర్రముక్క దాన్ని ఆకర్షించింది. దాన్ని ఎలాగయినా తీయాలనుకుంది. అటూ ఇటూ కాళ్ళువేసి దుంగమీద కూర్చుని చెక్కముక్కను రెండు చేతులతో బలంగా లాగింది. కాసేపటికి చెక్కముక్క ఊడివచ్చింది. కోసిన రెండు సగాలు కలిసిపోయాయి. దాంతో దుంగమీద వేలాడుతున్న దాని తోక అందులో చిక్కుకుంది. బాధతో కోతి గట్టిగా అరిచింది. తన తోకను లాగాలని బలంగా ప్రయత్నించేసరికి తోక తెగిపోయింది.
నీతి : తెలియని వస్తువులతో ఆటలాడితే ఆపదలు కొనితెచ్చుకున్నట్టే!

తోక తెగిన కోతి
Reviewed by Smartbyte group
on
July 13, 2016
Rating:

No comments: