తెలివితక్కువ పిల్లులు

                  క అడవిలో రెండు పిల్లులుండేవి. అవి రెండూ స్నేహితులు. ఓరోజు రెంటికీ ఓ చోట రొట్టె ఒకటి కనిపించింది. దాన్ని ఆ రెండూ ఎలా పంచుకోవాలా అని ఆలోచించాయి. తనకు పెద్దముక్క కావాలంటే తనకు కావాలని దెబ్బలాడుకోసాగాయి. ఇంతలో అటుగా వెళ్తున్న కోతి ఒకటి వాటికి కనిపించింది. దాన్ని పిలిచి జరిగిన విషయాన్ని చెప్పాయి. 'ఓస్‌... దీనికేనా. మీకెందుకు నాకు విడిచిపెట్టండి అని చెప్పి రొట్టెను తన చేతుల్లోకి తీసుకుంది కోతి. ఎక్కడి నుంచో ఒక త్రాసు తెచ్చింది. రొట్టెను రెండు ముక్కలు చేసి త్రాసులో రెండువైపులా పెట్టింది. త్రాసు కుడివైపు మొగ్గడంతో 'ఈ ముక్క పెద్దదయినట్టుందే' అని కుడివైపునున్న ముక్కను కాస్త తినేసింది. ఈసారి ఎడమవైపు ఉన్న ముక్కవైపు చూసి 'ఇప్పుడు ఇది పెద్దదయిపోయింది'
             
         ని దానిలో కొంత భాగం తినేసింది. ఇలా ఒక్కో ముక్కా కొంచెం కొంచెం తినేస్తూనే వాటికి రొట్టెను పంచుతున్నట్లు
నాటకమాడింది. కోతి తినేస్తుంటే బాదగా ఉన్నా తమకు సమానమైన ముక్కలు వస్తాయని పుల్లులు మాత్రం ఆశగా చూడసాగాయి. చివరికి కోతి రొట్టె మొత్తం తినేసి ఎంచక్కా తన దారిన తాను వెళ్ళిపోయింది. అప్పటికి గానీ పిల్లులకు తాము చేసిన తప్పు అర్ధంకాలేదు. 'స్నేహితులమై ఉండి కూడా చిన్న రొట్టె కోసం తగవులాడుకున్నాం. ఎలాగోలా పంచేసుకుని ఉంటే అది మన మధ్యే ఉండేది. ఇద్దరమూ తినక, మొత్తం రొట్టెను కోతికి పిలిచి మరీ ఇచ్చినట్లయింది' అని తమను తామే నిందించుకున్నాయి.
తెలివితక్కువ పిల్లులు తెలివితక్కువ పిల్లులు Reviewed by Smartbyte group on July 13, 2016 Rating: 5

No comments: