మీర్జాపురాన్ని విజయుడు పాలిస్తూ ఉండేవాడు. అతడు సమర్ధుడైన పాలకుడే కానీ 'నాకంటే తెలివైన వారెవరైనా ఉంటారా?' అని మంత్రిని తరచూ ప్రశ్నించేవాడు. మంత్రి మొహమాటానికి రాజు కంటే తెలివైన వారు లేరంటూ చెప్పేవాడు.
ఓరోజు దర్బారులో మళ్ళీ తన గురించి గొప్పలు చెప్పడం మెదలుపెట్టాడు విజయుడు. ఆయన్ని ఎలాగైనా ఈ అలవాటు నుంచి బయటపడేటట్టు చేయాలనుకున్నాడుమంత్రి. 'మన సరిహద్దుల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట. మీరు ఆ ఊరి వారి కంటే తెలివైన వారిగా తేలిపోతే...మీ గొప్పతనం మరింతమందికి తెలుస్తుంది. వారెవరూ మీ తెలివికి సరితూగరు' అన్నాడు మంత్రి. దాంతో విజయుడు గోపాలపురం బయలుదేరాడు.
ఆ ఊరి పొలిమేరల్లో పశువుల కాపరి కనిపించాడు రాజుకి. 'నా తెలివితో ముందు
వీడిని ఓడిస్తా...'అనుకుంటూ అతడి దగ్గరికి వెళ్ళాడు. 'నేను మూడు ప్రశ్నలు అడుగుతా జవాబు
చెబుతావా?' అడిగాడు పశువుల కాపరిని. దానికి అతడు సరేనన్నాడు.
'ఈ సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?'
'గాలి' చెప్పాడు పశువుల కాపరి.
'అన్నిటికంటే ఉత్తమమైన జలం?'
'గంగాజలం'
'అన్నింటిలోకీ ఉన్నతమైన పాంపు?'
'ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే'
'భలేభలే నా మనసులోనూ ఇవే జవాబులున్నయి' అన్నాడు విజయుడు .
ఆ మాటలకు 'హ్హ హ్హ హ్హ ' అని పగలబడి నవ్వాడు పశువుల కాపరి. 'ఎందుకు నవ్వుతున్నావు'
అడిగాడు విజయుడు. 'తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవంటూ మెచ్చుకుంటేనూ...' అన్నాడు
పశువుల కాపరి.
మరి సరైన జవాబులేమిటో చెబుతావా? సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మెదడు,
ఎడారుల్లో దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాంపు అమ్మఒడి...చెప్పాడు పశువుల కాపరి, ఆ
మాటల్లోని సత్యం అర్ధం చేసుకున్నాడు విజయుడు. పశువుల కాపరే ఇంత తెలివిగా ఉంటే మిగతావాళ్ళు
మరెంత తెలివిగా ఉంటారో అనిపించింది.ఊళ్ళోకి వెళితే ఇంకెన్ని పరాభవాలు ఎదుర్కొనాల్సి వస్తుందోనని
కోటకి వెనుదిరిగాడు. అప్పట్నుంచి తన తెలివి గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు.

తెలివి
Reviewed by Smartbyte group
on
July 08, 2016
Rating:
Reviewed by Smartbyte group
on
July 08, 2016
Rating:

No comments: