పిఠాపురంలో రంగాచారి అనే స్వర్ణకారుడు ఉండేవాడు. అతను ఆ ఊరి జమీందారు కుటుంబానికి కావాల్సిన ఆభరణాలు తయారు చేసేవాడు. రంగాచారి వయసు మీరడంతో అతడి కొడుకు గోపాలాచారికి ఆ బాధ్యత వచ్చింది. గోపాలాచారి తండ్రిలా నైపుణ్యం ఉన్నవాడే కానీ పనిపట్ల శ్రధ్ధ తక్కువ. తండ్రి సంపాదించిన డబ్బు ఖర్చు చేస్తూ రోజూ స్నేహితులతో సరదాలూ కబుర్లలో మునిగిపోయేవాడు.
జమీందారు ఓరోజు గోపాలాచారికి కొంత బంగారం ఇచ్చి వడ్డాణం, గొలుసు తయారు చేయమన్నాడు.
గోపాలాచారి ఆ బంగారం తీసుకుని రెండు వందల రూపాయలిచ్చి వేరే కంసాలిచేత ఆభరణాలు చేయించాడు. ఈ విషయం జమీందారుకి తెలిసి గోపలాచారి ఆభరణాలు పట్టుకొని ఇంటికి వచ్చినపుడు తయారీ ఖర్చుగా వంద రూపాయలు ఇచ్చాడు. మరో మాటలేకుండా వెళ్ళిపోయాడు గోపాలాచారి. అతడు వేరేవారి చేత నగలు చేయించిన ప్రతిసారీ తయారీ
ఖర్చులో సగం మాత్రమే జమీందారు ఇచ్చేవాడు. కానీ గోపలాచారి ఎప్పుడూ ఆ విషయమై అభ్యంతరం చెప్పలేదు. ఇలా చేస్తుండడంతో కొన్నాళ్ళకు తండ్రి సంపాదించిన డబ్బు పూర్తిగా అయిపోయింది.
తర్వాత ఓరోజు జమీందారు పిలిచి నగలు చేయమని చెప్పాడు. గోపాలాచారి వారం రోజులు కూర్చొని కష్టపడి ఆభరణాలు తయారుచేశాడు. వాటిని పట్టుకుని జమీందారు ఇంటికి వెళ్తే ఎప్పటిలానే డబ్బు తక్కువచేసి ఇచ్చాడు.
'మీకు శ్రమవిలువ తెలిసినట్టులేదు. వారం రోజులు కష్టపడితే ఇచ్చే ప్రతిఫలం వంద రూపాయలేనా' అని కోపగించుకున్నాడు గోపాలాచారి. 'నీకు శ్రమ విలువ తెలియజేయాలని ఇన్నాళ్ళూ తక్కువ డబ్బు ఇచ్చాను. ఇప్పుడు నీలో మార్పు వచ్చింది. నువ్వు ఆర్ధికంగా ఇబ్బంది పడినపుడు ఆ డబ్బు ఇద్దామని దాచి పక్కనపెట్టాను. ఇదిగో ఆ డబ్బు.ఇక నుంచి నువ్వే కష్టపడి పనిచేయి. ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకో' అని చెప్పాడు జమీందారు. తన పొరపాటును గ్రహించిన గోపలాచారి అప్పట్నుంచి కష్టపడి పని చేయడం అలవాటు చేసుకున్నాడు.
జమీందారు ఓరోజు గోపాలాచారికి కొంత బంగారం ఇచ్చి వడ్డాణం, గొలుసు తయారు చేయమన్నాడు.
గోపాలాచారి ఆ బంగారం తీసుకుని రెండు వందల రూపాయలిచ్చి వేరే కంసాలిచేత ఆభరణాలు చేయించాడు. ఈ విషయం జమీందారుకి తెలిసి గోపలాచారి ఆభరణాలు పట్టుకొని ఇంటికి వచ్చినపుడు తయారీ ఖర్చుగా వంద రూపాయలు ఇచ్చాడు. మరో మాటలేకుండా వెళ్ళిపోయాడు గోపాలాచారి. అతడు వేరేవారి చేత నగలు చేయించిన ప్రతిసారీ తయారీఖర్చులో సగం మాత్రమే జమీందారు ఇచ్చేవాడు. కానీ గోపలాచారి ఎప్పుడూ ఆ విషయమై అభ్యంతరం చెప్పలేదు. ఇలా చేస్తుండడంతో కొన్నాళ్ళకు తండ్రి సంపాదించిన డబ్బు పూర్తిగా అయిపోయింది.
తర్వాత ఓరోజు జమీందారు పిలిచి నగలు చేయమని చెప్పాడు. గోపాలాచారి వారం రోజులు కూర్చొని కష్టపడి ఆభరణాలు తయారుచేశాడు. వాటిని పట్టుకుని జమీందారు ఇంటికి వెళ్తే ఎప్పటిలానే డబ్బు తక్కువచేసి ఇచ్చాడు.
'మీకు శ్రమవిలువ తెలిసినట్టులేదు. వారం రోజులు కష్టపడితే ఇచ్చే ప్రతిఫలం వంద రూపాయలేనా' అని కోపగించుకున్నాడు గోపాలాచారి. 'నీకు శ్రమ విలువ తెలియజేయాలని ఇన్నాళ్ళూ తక్కువ డబ్బు ఇచ్చాను. ఇప్పుడు నీలో మార్పు వచ్చింది. నువ్వు ఆర్ధికంగా ఇబ్బంది పడినపుడు ఆ డబ్బు ఇద్దామని దాచి పక్కనపెట్టాను. ఇదిగో ఆ డబ్బు.ఇక నుంచి నువ్వే కష్టపడి పనిచేయి. ఎంత డబ్బు కావాలో అడిగి తీసుకో' అని చెప్పాడు జమీందారు. తన పొరపాటును గ్రహించిన గోపలాచారి అప్పట్నుంచి కష్టపడి పని చేయడం అలవాటు చేసుకున్నాడు.
శ్రమవిలువ
Reviewed by Smartbyte group
on
July 13, 2016
Rating:
Reviewed by Smartbyte group
on
July 13, 2016
Rating:

No comments: