ఫకీర్ భాషా

            అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నంకొట్టిన సమాధిపై నిమ్మకాయ నుంచి, ఆల్రెడీ సమాధిపై ఉన్న నిమ్మకాయలను తీసుకొస్తాడు. నాకోంత డబ్బు ఇప్పిస్తావా?" అన్నాడు మిల్టన్.. అవధానితో.. ఎండకు వగరుస్తూ వచ్చి.

                    ఆ మాటకు అవధాని, మిల్టన్ వైపు చూడకుండా తన పక్కనే ఉన్న ఫకీర్ భాష వైపు చూసాడు. ఫకీర్ భాషా ఒక్కక్షణం మిల్టన్ వైపు చూసి, వెంటనే అవధానిని చూశాడు. ఆ చూడ్డంలో..' వీడెవడు..వింత మనిషి' అనే అర్థం ఉంది. అది ఫకీర్ భాషా ఇల్లు.మిల్టన్ మొదట అవధాని ఇంట్లోకి వెళ్లి.. అవధాని ఇంట్లో లేడు, ఫకీర్ భాష ఇంటికెళ్ళాడని తెలుసుకుని, ఫకీర్ భాషా ఎవరో, అతడి ఇల్లేక్కడుందో కూడా తెలుసుకొని నేరుగా అక్కడికే వెళ్లాడు. అంతగా అతనికి అవధాని అవసరం ఏదో పడినట్లు ఉంది. అవధాని,మిల్టన్ స్నేహితులు. తనకు తెలియకుండా అవధానికి పకీర్ భాషా అనే మనిషితో పరిచయం ఉందంటే.. ఆ పరిచయం ఏదో ఈమధ్యే అయివుంటుందని మిల్టన్ ఊహించాడు. ' వీడెవడు.. వింతమనిషి' అన్నట్లుగానే. 'ఇతనెవరో దెయ్యాల్ని పట్టే మనిషిలా ఉన్నాడే..' అనుకున్నాడు మిల్టన్.. ఫకీర్ భాషాను చూసి. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు నచ్చలేదని అవధానికి అర్థమైంది. " వీడు నా చిన్ననాటి ఫ్రెండ్. మిల్టన్" అన్నాడు అవధాని పకీర్ భాషాతో. " రేయ్..మిల్టన్, ఇతను పకీర్ భాషా. ఇద్దరం కలిసి ఓ వెంచర్ చేస్తున్నాం. ఫైనల్ అయ్యాక నీకు చెబుదామనుకున్నాను." అన్నాడు అవధాని. చెప్పకపోయినా హార్ట్ అయ్యే మనిషి కాదు మిల్టన్. అతని లోకంలో ఈ వెంచర్ లు అడ్వెంచర్ లు ఉండవు. చిన్న ప్రాణి. అయినా మిల్టన్ కు ఏది చెప్పకుండా ఉండడు అవధాని. కాస్త ముందో, వెనకో చెబుతుంటాడు. ఆ ఇద్దరి చిన్ననాటి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది." ఎందుకురా అంత డబ్బు?" అన్నాడు అవధాని మిల్టన్ తో. మిల్టన్ ఎప్పుడుా ఎంత చెప్పడు. అవసరం ఎంతటిదో చెప్తాడు. ఇప్పుడు అలాగే చెప్పాడు

               అర్ధరాత్రి, స్మశానం, తెల్ల సున్నం, సమాధి, నిమ్మకాయ.. అన్నారంటే.. అతడేదో చచ్చేంత అవసరంలో ఉన్నాడని. మిల్టన్ మితంగా బతికే మనిషి. చెయ్యి చాచాడుా అంటే.. బతుకు ఆమాత్రం మితంగా కూడా అతన్ని ఉండనివ్వడం లేదనే అనుకోవాలి.మిల్టన్ బతుకులో మిల్టన్, అతడి భార్యా పిల్లలు మాత్రమే లేరు. మరికొందరికి కోసం కూడా అతడు రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన బాంధవ్యాలు ఉన్నాయి. ఆ బాంధవ్యాల గురించి బయటేక్కడా చెప్పుకోడు. పుట్టుకతో చేయ్యిా, కాలు ఉన్నట్లే తన బాధ్యతల్ని కూడా దేహవయవాలే అనుకుంటాడు. కాలు, చెయ్యి తమకు కాలుందనీ, చెయ్యుందని చెప్పుకుంటారా?! అలాగే తనకు బాధ్యతలు ఉన్నాయని మిల్టన్ చెప్పుకోడు. అలాంటి మిల్టన్ అకస్మాత్తుగా కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఎంత డబ్బో అతను చెప్పలేదు. కొంత అన్నాడు. ఆ కొంత ఒక కోటి అయినా, చిన్న నోటే అయినా.. అతను మళ్ళీ తీర్చలేడు. తీర్చడానికి అసలు అతను అప్పుగా అని అడగడు. పని చేసి పెడతా నంటాడు. పని చేశాకే చెయ్యి చెబుతాడు. " సరే చూద్దాం లేరా..? అని మిల్టన్ చెప్పి పంపాక,మిల్టన్ గురించి ఫకీర్ భాషాకు ఈ విషయాలన్నీ చెప్పాడు అవధాని. " ఎంత అడుగుతున్నాడని ఇప్పుడు మనం అనుకోవాలి?" అన్నాడు ఫకీర్ భాషా ఆశ్చర్యంగా. " ఎంతైనా అవ్వచ్చు" " తెలిస్తేనే కదా ఇవ్వగలం" " వాడికి తెలియదు. పని తీసుకుంటాడు. చేశాక ఇచ్చింది తీసుకుంటాడు." " ముందైతే డబ్బు తీసుకో. పనేదైనా ఉన్నప్పుడు వచ్చి చేసుకో అంటే?" " పండించ కుండా తిండి తినే హక్కు తనకు లేదంటాడు" 'వింత మనిషే' అనుకున్నాడు ఫకీర్ భాషా. " సరే.. చెప్పు. నా దగ్గర పడిందని నీ ఫ్రెండ్ కి చెప్పు" అన్నాడు. " ఏ పని?" అన్నాడు అవధాని. " 
                                  అర్ధరాత్రి స్మశానం లోకి వెళ్లి, అక్కడ తెల్లగా సున్నంకొట్టిన సమాధిపై నిమ్మకాయ నుంచి, ఆల్రెడీ ఆ సమాధిపై ఉన్న నిమ్మకాయలను తీసుకురావాలి" అన్నాడు ఫకీర్ భాషా. పెద్దగా నవ్వాడు మిల్టన్. " ఫకీర్ భాషా గారు .. మా అవధాని మీకు చెప్పే ఉంటాడు. డబ్బు నాకు ఎంత అవసరమో చెప్పడానికి 'స్మశానంలోకయినా వెళ్ళొస్తానని' నేను అంటుంటానే కానీ, నిజానికి నాకదేం పెద్ద పని కాదు. అది మీకు పనికొచ్చే పని అయితే నాకు సంతోషంగా ఉంటుంది. నా సంతోషం కోసం మీరు ఒక పని  సృష్టించడం నాకేమాత్రం ఆనందాన్నివ్వదు." అన్నాడు మిల్టన్. ఆ మాట నిజం. మిల్టన్ ఏమిటో తెలియక, అతడికి ఏదో ఒక విధంగా డబ్బు సాయం చేయాలని మాత్రమే ఫకీర్ భాషా అనుకున్నాడు. అలా అని మిల్టన్ తోనుా అనలేదు, అవధానికి చెప్పలేదు. " నీ ధైర్య సాహసాలతో నాకు పనిలేదు మిల్టన్. పని కావాలనుకుంటున్నావు కాబట్టి నా దగ్గర ఉన్న పనేమిటో చెబుతున్నాను. నిమ్మ మొదలుపెడుతున్న వెంచర్లు లో ఒక సమాధి ఉంది. అదొక సమాధే అక్కడెందుకు ఉందోతెలీదు. అయితే అక్కడ రాత్రుళ్లు దెయ్యం తిరుగుతోందని, ఎవరు ప్లాట్లు కొనేందుకు రారని ప్రచారం జరుగుతోంది. నువ్వు ఒక్కసారి వెళ్ళొస్తే, అక్కడేం లేదని జనానికి తెలిస్తే మంచిదే కదా" అన్నాడు పకీర్ భాషా. ఆ రాత్రి ఒక్కడే.. వెంచర్లో సమాధి ఉందని ఫకీర్ భాషా చెప్పిన చోటికి వెళ్ళి వచ్చాడు మిల్టన్. ఆ ఉదయాన్నే మంచం పట్టాడు! అక్కడ ఏం జరిగింది అతను ఎవరికీ చెప్పలేదు. అసలు అక్కడికి వెళ్ళిన సంగతి కూడా ఎవరికీ చెప్పలేదు. ఫకీర్ భాషా ఇంటికి వచ్చి మరీ మిల్టన్ కు డబ్బు ఇచ్చి వెళ్ళాడు. అతడు వెళ్తుంటే వెనక్కి పిలిచి మెల్లగా చెప్పాడు..మిల్టన్. " నిజమే. ఉంది" అన్నాడు. " ఎలా తెలిసింది?".. అడిగాడు పకీర్ భాషా. " ఆ దెయ్యం నాకు సమాధి కూడా కనిపించకుండా చేసింది. " అన్నాడు మిల్టన్ సన్నగా మూలుగుతూ. ఫకీర్ భాషా బయటకు వస్తూ చిన్నగా నవ్వుకున్నాడు.

ఫకీర్ భాషా ఫకీర్ భాషా Reviewed by Smartbyte group on August 22, 2018 Rating: 5

No comments: