వెనుకే ఉంది


                   "... అండ్, మీట్ మిస్టర్ దీపక్ మిశ్రా.. దెయ్యాల స్పెషలిస్ట్!" 'హోటల్ చోళా ఇంటర్నేషనల్' కాన్ఫరెన్స్ హాల్ బయట లాంజ్ లో రాత్రి బాగా పొద్దు పోయాక జరిగింది ఈ పరిచయం. దీపక్ మిశ్రా ను భగవాన్ కి పరిచయం చేయడానికి ముందు, భగవాన్ ని దీపక్ మిశ్రా కు పరిచయం చేశాడు దేవన్.." హి ఈజ్ భగవాన్, హెడ్ ఆఫ్..' నో గాడ్, నో ఫేుాస్ట్. దేవన్ జర్నలిస్ట్. చెన్నైలోని ఒక ఆంధ్ర దినపత్రికలొ సీనియర్ రిపోర్టర్. చోళా ఇంటర్నేషనల్ లో దెయ్యాలపై ఆ మర్నాటి నుంచి మూడు రోజులపాటు డీప్ డిబేట్ జరుగుతుంది. మిశ్రాది ఢిల్లీ. డిబేట్ కోసం చెన్నై వచ్చి చోళా ఇంటర్నేషనల్ లో దిగాడు. భగవాన్ ది హైదరాబాద్. డిబేట్ లో మిశ్రాను ఢీకొట్టడం కోసం చెన్నై వచ్చి అదే హోటల్లో తనకు కేటాయించిన గదిలో చేరుకున్నాడు. లో 'చోళా'తో దేవన్ కి మంచి సంబంధాలున్నాయి

                                ప్రముఖుల ఎవరొచ్చినా, వెంటనే దేవన్ కు ఫోన్ వెళుతుంది. " వెల్, మిస్టర్ భగవాన్.. మీరు నో గాడ్, నో ఫేుాస్ట్ అంటున్నారు. నుదిటిపై పెద్ద బొట్టు తో కనిపిస్తున్నారు.?!".. అడిగాడు మిశ్రా. భగవాన్ పెద్దగా నవ్వాడు. " అది దేవుడికి, దెయ్యానికి సంబంధం లేని బొట్టు. నా కూతురు తనకి ఏమీ తోచకపోతే, ఒక్కోసారి నాకు జడేసి, రబ్బర్ బ్యాండ్ పెడుతుంది. అలాగే వచ్చేస్తాను బయటకి. ఇవాళ పెద్ద బొట్టు పెట్టింది".. చెప్పాడు భగవాన్. " మరి భగవాన్ అనే పేరు ఏమిటి?" " దేవుడిని నమ్మని వాళ్లకు భగవాన్ అని దెయ్యాల్ని నమ్మేవాళ్ళకిి దీపక్ అని పేరు ఉండకూడదనేముంది?" అలా.. కొంత టాపిక్ నడిచాక..' రేపు డిబేట్ లో కలుద్దాం.' అని చెప్పి, దేవన్ వెళ్లిపోయాడు. దీపక్, భగవాన్ మిగిలారు. " సో.. రేపు మీరు దెయ్యాలు లేవని నాతో వాదించ బోతున్నారు.. నవ్వాడు దీపక్. " లేవని వాదించబోవడంలేదు మిస్టర్ మిశ్రా. ఉంటే చూపించండి అని వాదించబోతున్నాను" అన్నాడు భగవాన్ తను నవ్వుతూ. " ఇప్పుడు చూపిస్తాను, మీకేమైనా అభ్యంతరమా?" అన్నాడు మిశ్రా సడన్ గా. దెయ్యాల్ని నమ్మేవాళ్ళకి, దెయ్యాలు ఉన్నాయని వాదించే వాళ్ళకు భగవాన్ విలువ ఇవ్వడు. ఇవ్వకపోగా, ఒక్కోసారి తేలిగ్గా తీసిపారేస్తాడు. " చూపించినక్కర్లేదు. మిమ్మల్ని చూస్తున్నాను కదా" అన్నాడు! మిశ్రా హర్ట్ కాలేదు. " దేవుని నమ్మేవాళ్ళకి దేవుడు కనిపించినట్లుగా, దెయ్యాలను నమ్మేవాళ్ళకు దెయ్యాలు కనిపించకుండా ఉండవు. మిస్టర్ భగవాన్" అందామనుకున్నాను కానీ, భగవాన్.. దేవుడిని కూడా నమ్మడు

                               అందుకే దేవుడి ప్రస్తావన లేకుండా.." దెయ్యాలు.. మనుషులకు కావలసినప్పుడు కనిపించవు. దెయ్యాలకు మనుషులు కావలసినప్పుడు కనిపిస్తాయి." అని మాత్రమే అన్నాను." మరి ఇందాక చూపిస్తానన్నారు!" అడిగాడు భగవాన్. " అవునవును. కానీ మీరు నాలో దెయ్యాన్ని చూశాక, నేను చూపించే దెయ్యం లో మీకేం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి?" " అవుననుకోండి, మనుషులకు కావలసినప్పుడు దెయ్యాలు కనిపించవని అన్నారు కదా, దాంతో నాకు ఇంట్రస్ట్ పెరిగింది. మీరు ఎలా చూపిస్తారో చూద్దామని" అన్నాడు భగవాన్. " చూడదలచుకున్నారా.. చెప్పండి" అడిగాడు మిశ్రా. " చూశాక, అది దెయ్యం కాదంటే, మీరు ఒప్పుకుంటారా?" అన్నాడు భగవాన్. " దెయ్యం అవునో కాదో మీ మనసుకు తెలిసినప్పుడు నా ఒప్పుకోలు తో ఇక పనేముంటుంది?" " మీరు దెయ్యం అని నాకు చూపించిన దాన్ని, నేను దెయ్యం కాదు అంటే మీరు ఒప్పుకోవాలి కదా!" " అదే అంటున్నా... మిస్టర్ భగవాన్. దెయ్యాన్ని చూపించడం వరకే నా పని. అది దెయ్యమా కాదా అన్నది మీ మనసుకు అనిపించినదాన్ని బట్టి ఉంటుంది." " అలాంటప్పుడు అది దెయ్యం ఎలా అవుతుంది మిస్టర్ మిశ్రా

                       మీరు దెయ్యాన్ని చూపించినప్పుడు, అది దెయ్యాన్ని నేను కూడా చూడగలిగితేనే కదా అది దెయ్యం అవుతుంది." " రైట్. మిస్టర్ భగవాన్. మీ వెనుక నేను ఇప్పుడు దెయ్యాన్ని చేస్తున్నాను. ఈ క్షణంలో చూస్తున్నాను. ఆ దెయ్యాన్ని మీరు చూడాలనుకుంటున్నారా?"  " అనుకోవడం లేదు. ఎందుకంటే నా వెనుక ఏ దెయ్యముా ఉండదని, ఏ దేవుడు ఉండడని నాకు తెలుసు" " ఓకే దెన్. మీరు మీ మాట మీద నిలబడగలరా?" అడిగాడు మిశ్రా. "ఎస్" అన్నాడు భగవాన్.  " అయితే ఈ క్షణంలో మీరు.. మీరు ఒక్కరే వాష్ రూమ్ లోకి వెళ్లి రాగలరా?"               " వెళ్లి?" " అద్దం లో మీ ముఖం చూసుకొని రండి."  " చూసుకుంటే?!" " మీ వెనుక.. ఎవరన్నారు మీకు కనిపిస్తుంది." " కనిపించకపోతే?" " కనిపించకపోతే.. నా దగ్గరికి వచ్చి చెప్పండి" అన్నాడు మిశ్రా. భగవాన్ లేచి వాష్ రూమ్ లోకి వెళ్ళాడు. తిరిగొచ్చి చూస్తే.. అక్కడ మిశ్రా లేడు! లాంజ్ లో లైట్స్ ఆఫ్ ఉన్నాయి. డిమ్ లైట్ లో.." మిస్టర్ మిశ్రా.. మిస్టర్ మిశ్రా " వెతుక్కుంటున్నాడు భగవాన్. " నేను కనిపించలేదు సరే, దెయ్యం కనిపించిందా?" అడిగాడు మిశ్రా. " చూశాను. కనిపించలేదు".. అబద్ధం చెప్తాడు భగవాన్. " ఏం కనిపించలేదు?" " దెయ్యం" మిశ్రా నవ్వుకున్నాడు. డిబేట్ హాల్ లో భగవాన్ వెనుక మిశ్రాకు స్పష్టంగా దెయ్యం కనిపిస్తుంది. భయం అనే దెయ్యం! భయం ఉందంటే దెయ్యం ఉందనే. లేనిది మాత్రం.. వాష్ రూమ్ లో అద్దం.

వెనుకే ఉంది వెనుకే ఉంది Reviewed by Smartbyte group on August 22, 2018 Rating: 5

No comments: