కళ్ళు
తెరిచేసరికి ఓ షెడ్ లో చెక్క కుర్చీలో ఉన్నా. తాళ్ల తో కట్టేసాడు నన్ను. నా నోటికి
టేప్ అంటించారు. అయోమయంగా పరిసరాలను పరికించి, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఒక్కో
విషయం మెల్లగా గుర్తుకు రాసాగింది. రాత్రి ఎనిమిది గంటలకు ఆల్ నైట్ క్లబ్ లో డ్రింక్స్
కి ఆర్డర్ ఇచ్చాను. ఓ యువతి నాకు కంపెనీ ఇచ్చింది. అందం కంటే ఆకర్షణే ఎక్కువ
ఆమెలో. చికెన్ పకోడీను తినిపించుకుంటూ డ్రింక్స్ పూర్తిచేశాం. ఆరోజు కాస్త ఎక్కువే
తాగాను నేను. సెల్ ఫోన్ మోగడంతో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిందామె. నేను బిల్
చెల్లించి తూలుకుంటూ బయటకు నడిచాను. పార్కింగ్ లో ఉన్న నా బైకుని తీయబోతుాంటే,
వెనుక నుంచి వచ్చి నా చెయ్యి పట్టుకుందామె. 'మీకు డోస్ ఎక్కువయింది. ఈ స్థితిలో
బైక్ రైడ్ సేఫ్ కాదు. ఈ పక్కనే నా రూమ్ ఉంది. ఈ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారాక
వెళ్దురుగాని' అంది. ఆమెను చూశాక ఎందుకు మారు మాట్లాడకుండా ఆమె వెంట నడిచాను.
తల
గట్టిగా విదిలించి మళ్లీ కళ్ళుతెరిచాను ఇక్కడికి ఎలా వచ్చాను? నన్ను ఇలా
కట్టేసిందెవరు??...' ఓ వ్యక్తి బకెట్ లో నీళ్ళు తెచ్చి నా నెత్తిమీద గుమ్మరించాడు.
నా మత్తు పూర్తిగా దిగిపోయింది. అలా కలా కాదు, కల్లా కాదు- పచ్చి వాస్తవం! నా ఎదుట
కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూసి ఉలిక్కి పడ్డాను. అతను- సిటీలో పేరుమోసిన డాన్!
'భాయ్' అని పిలుస్తారంతా. అతని వెనుక అనుచరులు కొందరు నిల్చున్నారు. పక్కనే ఉన్న
స్టూల్ మీద కొన్ని ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, బ్లో టార్చ్, ప్లేయర్స్,
హక్సా బ్లేడ్, క్లా హేమర్, పెన్ నైఫ్ వగైరాలు ఉన్నాయి. అవన్నీ నావే. నేను, నా
క్రైమ్ పార్ట్ నర్ రాబర్ట్ దోచుకోచ్చిన్నవి. భాయ్ కి ఆగ్రహం తెప్పించే పని నేను ఏం
చేశానో బోధపడలేదు నాకు. ఆ విషయమే అడుగుదామంటే, నోటికి టేప్. "
బ్రహ్మాజీ!" బాయ్ పిలుపుతో చుట్టూ చూశాను. కానీ, అక్కడ పిలిచింది నన్నే అని
గ్రహించి విస్తుపోయాను. జేబులోంచి ఒక పాత ఐడి కార్డు తీశాడు బాయ్. " నీ
జేబులోంచి తీసిన ఐడి కార్డ్ ఇది. ఇదే నిన్ను పట్టించింది. ఈ పదేళ్లలో కార్డుని
మార్చ లేదనుకుంటాను నువ్వు. మసకబారిన ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని తీసేసి కలర్
ఫోటోని పెట్టుకోవాలనిపించలేదా నీకు. ఇప్పుడు అనిపించిన ప్రయోజనం లేదులే. ఎందుకంటే
ఇకపైన దీని అవసరం నీకు ఉండదు కదా!" అన్నాడతను. " నీ పేరు బ్రహ్మాజీ.
కోల్ కతాలో ఒక చెప్పుల కంపెనీ ఉంది నీకు. బిజినెస్ పనిమీద ఈ ఊరికి వచ్చావు. వారం
క్రితం తప్పతాగి కారు నడుపుతూ యువతిని ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయావు.." ఆ
యువతి భాయ్ చిన్న పెళ్ళాం జాస్మిన్ అట. ఆ రాత్రి రోడ్డు క్రాస్ చేస్తుండగా ఆ
ప్రమాదం జరిగిందట. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలిందట. అదిరిపడ్డాను నేను.
అసలు ఈ
బ్రహ్మాజీ ఎవరు నేను ఎరుగను. నాపేరు సిద్ధూ. ఓ క్రిమినల్ నీ. బ్రహ్మాజీ అన్న వ్యక్తి
ఐడి కార్డ్ నా జేబులోకి ఎలా వచ్చిందో కూడా తెలియదు. 'మిస్టేకెన్ ఐడెంటిటీ' అని
ఎలుగెత్తి చాటాలనుకున్నాను. టేప్ అడ్డు వచ్చింది. తల అడ్డుగా తిప్పాను. "
ప్రమాదం జరిగే సమయంలో అటు వైపు వెళ్తున్న ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని తన సెల్ ఫోన్లో
వీడియో తీశారు. కారు నెంబర్ ఆధారంగా నిన్ను ట్రేస్ చేయడం జరిగింది." చెప్తాడు
భాయ్. ఆ హంతకుడు నేను కానని చెప్పడానికి కళ్ళతో, తలతో గింజుకున్నాను. టేప్ ని
తొలగించవలసిందిగా సైగలు చేశాను. " ప్రాణానికి ప్రాణమైన నా జాస్మిన్ ప్రాణాలను
గాలిలో కలిపేసిన వాడు బ్రతికి ఉండకూడదు వాణ్ణి పంపి నా జాస్మిన్ ఆత్మకు శాంతి
చేకూర్చుతానని శపథం చేశా. నా శపథం నెరవేరబోతుంది ఇప్పుడు.." అంటూ అనుచరులకు
సైగచేశాడు భాయ్. నిశ్శబ్దంగా అతని పక్కకు వచ్చి నిలుచున్న వ్యక్తిని చూసి
తెల్లబోయాను నేను. రాబర్ట్! నా క్రైమ్ పార్టనర్! గత పదేళ్లుగా రాబర్ట్, నేను కలిసి
నేరాలు చేస్తున్నాము. అతను ఇతరుల క్రెడిట్ కార్డులు ఏటీఎం కార్డులను దొంగిలించి
తెచ్చి నాకు అమ్ముతాడు. నేను వాటికి ఫెక్ పిన్ నెంబర్లు సృష్టించి క్యాష్
చేసుకుంటాను. జాస్మిన్ కి యాక్సిడెంట్ జరిగినట్లు చెప్తున్నా రోజు నేను ముంబైలో
ఉన్నాను అన్న విషయం రాబర్ట్ కి తెలుసు.'
రాబర్ట్! ప్లీజ్! నేను బ్రహ్మాజీ ని కానని, నీ ఫ్రెండ్ సిద్ధుానని, యాక్సిడెంట్
రోజున నేను ఈ ఊర్లోనే లేనని భాయ్ తో నిజం చెప్పు,' అర్థింపుగా అతని వంక చూశాడు.
చూపులు మరల్చుకున్నాడు. 3 రోజుల క్రితం మౌనిక హటాత్తుగా నా మదిలో మెదిలాయి-
'సిద్ధూ! నీ ఫ్రెండ్ ఓవర్ స్మార్ట్. తన పెళ్ళాంతో సంబంధం పెట్టుకున్నావని తెలిస్తే
చంపేస్తాడు నిన్ను.
నేనంటే పిచ్చి కనుక, కోపంతో నాలుగు దెబ్బలు వేసి
ఊరుకుంటాడంతే'. ఏడాది క్రితం మౌనికను ఎలాగో ట్రాక్ చేసి పెళ్లి చేసుకున్నాడు
రాబర్ట్. ఆమె అంటే పిచ్చి ప్రేమ. కానీ, ఆమె నాపైన మనసు పారేసుకుంది. మా వ్యవహారం
రాబర్ట్ కి తెలిసిపోయిందని, అందుకే జాస్మిన్ యాక్సిడెంట్ కేసులో నన్ను తెలివిగా
ఇరికించారని గ్రహించడం కష్టం కాలేదు నాకు. నేను నోరు విప్పితే బాయ్ కి నిజం
తెలుస్తుందనే నా నోటికి టేప్ కూడా వేయించాడని బోధపడింది. " బ్రహ్మాజీ! నీ
అంతిమ ప్రార్థన చేసుకో" అన్న భాయ్ హెచ్చరికతో ఉలిక్కిపడి ఆలోచనలోంచి
తేరుకున్నాను. అతని చేతిలోని రివాల్వర్ మెల్లిగా పైకి లేస్తుంటే, నేరజీవితం
సరిగ్గా ఎక్కడ ముగుస్తుందో తెలుస్తున్నట్టనిపించింది.
క్రిమినల్
Reviewed by Smartbyte group
on
August 29, 2018
Rating:

No comments: