ట్రూత్ బంగళా


                   పాతబడిన బంగళాలు దెయ్యాలకు సౌకర్యంగా ఉంటాయి. ఒనర్ అనే వాడు ఉండడు. అది మొదటి సౌకర్యం. రోజూ ఉదయాన్నే లేచి, గదులన్నీ శుభ్రం చేసే పని ఉండదు. అది రెండో సౌకర్యం. బెడ్ రూమ్ లోనే పడుకోవాలనేం లేదు. ఇంట్లోనే దూలాలకు ఎక్కడబడితే అక్కడ, ఎలా పడితే అలా, వేలాడుతూ నిద్రపోవచ్చు. ఇది మూడో సౌకర్యం. ఇలాంటి లైఫ్ మనుషులకు చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది. బాగా డబ్బున్న ఎన్నారైలు ఎవరైనా ఫర్నిచర్ తో పాటు బంగళాను అద్దెకు ఇచ్చేసి, ఏళ్లతరబడి ఇండియా రాకుండా ఎక్కడ ఉండిపోతూ. ఇక్కడ ఆ బంగళాలో అద్దెకున్నవారి జీవితం.. పాడుబడిన బంగళాలో దెయ్యాలకు ఉన్నంత సౌకర్యంగా ఉంటుంది. అయితే.. కొన్నిసార్లు సౌకర్యం కూడా విసుగు పుట్టిస్తుంది. మనుషులకైనా, దెయ్యాలకైనా! " లోపల ఉండి ఉండి విసుగొస్తుంది. అలా బయటికి వెళ్లొద్దామా?" " నాకు అదే అనిపిస్తుంది. షిట్.. మనది ఒక లైఫేనా?" " నోర్ముయ్.. జీవితాన్ని తిట్టకు నువ్వు సరిగ్గా జీవించలేకపోతే.. నువ్వు షిట్ అవుతావు కానీ, జీవితం షిట్ అవుతుందా?" మూడో దెయ్యం మౌనంగా ఉంది. ఊరికి దూరంగా ఉన్న ఆ పాడుపడిన బంగళాలో ఏళ్లుగా ఆ  ముాడు దెయ్యాలు ఉంటున్నాయి. ఒకప్పుడు ఆ బంగళా ఊరికి మధ్యలో ఉండేది. 

                             లోపలినుంచి ఏవో అరుపులు, ఏడుపులు వినిపిస్తున్నాయని ఎవరో అనడంతో.. ఊరే బంగళాకు దూరంగా ఉంటుంది. అప్పుడోచ్చిచేరాయి  ఎక్కణ్ణించో ఈ మూడు దెయ్యాలు. అయితే మొదటి దెయ్యం రెండోది అని అంత సరిగ్గా బంగళాలోకి రానివ్వడం లేదు. " నువ్వెవరు? నీ బయోగ్రఫీ ఏంటి?" అని అడిగింది. చిన్న గొడవ తర్వాత మాత్రమే అవి రెండూ కలిసిపోయాయి. మూడో దెయ్యం వాటి మధ్య కు వచ్చినప్పుడు ఇంత గొడవ జరగలేదు. 'మీరు ఉండనిస్తే ఉంటాను. వెళ్లిపొమ్మంటే వెళ్ళిపోతాను. ఈ బంగళా కాకపోతే మరో బంగళా. ఈ ఊరు కాకపోతే మరో ఊరు' అంది మూడవ దెయ్యం. దాని ఫిలాసఫీ ఆశ్చర్యంగా అనిపించింది ముందు ఇచ్చిన ఈ రెండు దెయ్యాలకు. 'సరే.. రా. మాతోనే ఉండిపో' అన్నాయి. " ఏంటి.. నువ్వు ఏమీ మాట్లాడవు? అది షిట్ అనడం కరెక్టేనా.. లైఫ్ ని ?!".. సీనియర్ డిజన్ అడిగింది మూడో దయ్యాన్ని. మూడు దెయ్యం తాత్వికంగా నవ్వింది. " మనుషులకు ఎంత దూరంగా ఉన్నా మనిషి భాష వచ్చేస్తుంది మనకు. నువ్వు ఒకటి రెండుసార్లు..' గాడ్' అనడం విన్నాను నేను. పాపం దాని తప్పేముంది. షిట్ అని ఎక్కడో విన్నట్లుంది. మనిషికి ఈమధ్య షిట్ కు వెళ్లడం కన్నా,'షిట్' అనడం ఎక్కువైపోయింది." అంది రెండో దెయ్యాన్ని సమర్థిస్తూ. సీనియర్ దెయ్యం వదల్లేదు. " నా కంప్లైంట్ అది కాదు. మన లైఫ్ మరి 'షిట్' అనుకునేంత దరిద్రంగా ఏం లేదు కదా. అలాంటప్పుడు షిట్ అనడం ఎందుకుా.." అంది. " విసుకునే అది 'షిట్' అని ఉంటుంది. 

                              విసుగు లోనే నువ్వు అప్పుడప్పుడు 'గాడ్' అంటావు. మీరిద్దరూ అంటున్నది లైఫ్ను కాదు. లైఫ్ లోని ఒక విసుగును" అంది తాత్విక దెయ్యం. " సరే సరే.. మాటల్లోనే తెల్లారేటట్లుంది. అలా బయటకు వెళ్ళోద్దాం." అంది రెండు దెయ్యం. కిటికీలోంచి బయటకు చూసింది తాత్విక దెయ్యం. దూరంగా పెద్ద మంట కనిపిస్తుంది. " అక్కడేదో మంట ఉన్నట్లుంది" అంది. " ఏం మంట? చితి మంటా? కొత్తగా ఏముంటుంది" అంది సీనియర్ దెయ్యం. " చితి మంట కాదు. చలిమంటలా ఉంది. కాసేపక్కడ కూర్చుని వచ్చేద్దాం. మంచు లో ఎక్కువ సేపు బయట తినడం కూడా మంచిది కాదు." అంది తాత్విక దెయ్యం. మూడు దెయ్యాలు గాల్లో పైకి లేచాయి. అవి అలా లేస్తుంటే.. బంగాళా బయట అలవాటుగా తిరుగుతుంది కుక్క ఒకటి మూరేత్తి వాటి వంక చూసింది. దెయ్యాలు మంట చుట్టూ కూర్చున్నాయి. కొంత సమయం గడిచింది. దూరంనుంచి ఎవరో మనిషి వస్తూ కనిపించారు. " మన వైపే చూస్తున్నాడు" అంది రెండో దెయ్యం. " రానివ్వు. మనకేంటి. వాడికి ఎంతుంటుందో మనకు అంతుంటుంది." అంది సీనియర్ దెయ్యం. ఆ మనిషిని సరాసరి చలిమంట దగ్గరికి వచ్చి నిలుచున్నాడు. అతడి చేతుల్లో ఎండు పుల్లలు ఉన్నాయి. " ఎవరు మీరు.. ఎప్పుడోచ్చారు? ఇంతక్రితం కనిపించలేదే" అన్నాడు అనుమానంగా. సీనియర్ దెయ్యం, రెండో దెయ్యం నవ్వాయి. " ఓ.. నువ్వు వేసుకుని వెళ్లిన చలిమంటేనా ఇది! రా.. వచ్చి కూర్చో. భయపడకు మేమేం దెయ్యాలం కాదులే" అంది రెండో దయ్యం. ఆ ఎండుపుల్లల మనిషికి భయం వేసింది. అక్కడున్నది దెయ్యాలు కాదంటే అతడికి నమ్మబుద్ది కావడం లేదు. " మరి నువ్వేమిటి? మాలాగే మనిషివేనా? దెయ్యనివా?" అని అడిగింది సీనియర్ దెయ్యం. ఎండు పుల్లల మనిషి ఆలోచనలో పడ్డాడు. ఎందుకు అవి దెయ్యాలే నని అతడి మనసుకు గట్టిగా అనిపిస్తుంది. 

                        ప్పుడు తను 'మనిషి' అని తెలిస్తే అవి తనను పీక్కు తినడం ఖాయం. అందుకే తను మనిషి కాదు, దెయ్యం అని చెప్పదలుచుకున్నాడు. చెప్తే.. దెయ్యాలు దెయ్యాలకు హాని చెయ్యవు కాబట్టి బ్రతికి పోతాడు. ఒకవేళ అక్కడున్నది మనుషులైతే తన దెయ్యం కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. " ఏంటి ఆలోచిస్తున్నావ్.. నువ్వు మనిషివా, దెయ్యానివా చెప్పు.." అని అడిగింది సీనియర్ దెయ్యం." దెయ్యాన్ని" అని చెప్పాడు. ఆడపిల్లల మనిషి. తాత్విక దెయ్యం స్పందించలేదు. ఎప్పటిలా తాత్వికంగా ఉండిపోయింది. ఎండు పుల్లలన్ని అయిపోయాక వంట చల్లారిపోయింది. 'ఇక వెళదాం' అని పైకి లేచాయి దెయ్యాలని. అవి బంగళా దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ రాగానే.. దగ్గర కుక్క మెార పైకెత్తి సాలోచనగా చూస్తుంది.. ఈ నాలుగు దెయ్యం ఎక్కడి దెబ్బ అన్నట్లు! " అబద్ధం చెబితే మాత్రం! మనమెవరం శిక్షించడానికి? నువ్వు చెప్పలేదా అబద్ధం..' మేము దెయ్యాలను కాదు, మనుషులం 'అని' అంటుంది తాత్విక దెయ్యం బంగాళా లోపలికి నడుస్తూ. " నేను నిజం చెప్పించడానికి అబద్ధం చెప్పాను. వాడు నిజం దాచడానికి అబద్ధం చెప్పాడు. తేడా లేదా" అంది సీనియర్ దెయ్యం విసుగ్గా. తెల్లవారుజామును అటుగా వెళ్తున్నవాళ్ళేవరో ఆ బంగళా లోంచి అరుపులు, ఏడుపులు విన్నారు.

ట్రూత్ బంగళా ట్రూత్ బంగళా Reviewed by Smartbyte group on August 28, 2018 Rating: 5

No comments: