సాయంకాలం
ఆరు గంటలైంది. చలికాలం కావడంతో అప్పుడు చీకటి పడింది. సంజీవ్ హాల్లోని సోఫాలో
కూర్చుని టివి ఆన్ చేసి న్యూస్ వాచ్ చేస్తున్నాడు. కాలింగ్ బెల్ మోగింది.
'పనిమనిషి ఇప్పుడే గదా వెళ్ళింది. మళ్లీ వెనక్కి వచ్చిందా ఏం? లేకపోతే ఎవరిచ్చారు?'
అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. గేటు దగ్గర ఎవరో యువత నిలబడి ఉంది. భుజానికి
హ్యాండ్ బ్యాక్ తగిలించుకుని, లగేజీ బ్యాక్ పట్టుకుని కనిపించింది. వరండాలో లైట్లు
వేసి గేటు దగ్గరికి వెళ్లాడు. ఆమె అతణ్ని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమెను ఎక్కడా
చూసిన జ్ఞాపకం రావడం లేదు. " ఎవరండీ?" అడిగాడు సంజీవ్. " హరిత
ఫ్రెండ్ ని. తనని పిలవండి" అన్నది. " సారీ అండీ! వదిన లేదు" "
వాట్? నన్ను రమ్మని తను ఎక్కడికి వెళ్ళింది?" " మార్నింగ్
నాగార్జునసాగర్ వెళ్లారండీ" " నైట్ కి వచ్చేస్తారా?" " ఊహూ..
రారండీ. నాగార్జునసాగర్ నుంచి లాంచీలో శ్రీశైలం వెళ్తారు. ఈ నైట్ అక్కడే ఉంటారు.
రేపు మార్నింగ్ అక్కడ దైవదర్శనం చేసుకొని బయలుదేరుతారు. లాంచీ లోనే తిరిగి
ప్రయాణం. నాగార్జునసాగర్ వచ్చి హైదరాబాద్ వస్తారు. రేపు నైట్ కి ఇంటికి
వస్తారు." చెప్పాడు సంజీవ్. " నన్ను గేట్ దగ్గర నిలబెట్టి మాట్లాడుతున్నారు.
ఇంట్లోకి రానివ్వరా" నిష్టూరంగా అన్నది ఆమె. " సారీ.. వెరీ వెరీ
సారీ.." అంటూ వెళ్లి గేటుకు వేసిన తాళం తీశాడు. ఆమె లోపలికి వస్తూ.. " ఐ
యామ్ శాలిని" అన్నది చేతిని ముందుకు చాచి. " సంజీవ్. నందీశ్వర్ కజిన్
బ్రదర్ నీ..!" అంటూ కరచాలనం చేశాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. ఆమె సోఫాలో
కూర్చుంది. " నన్ను రమ్మని తన టూర్ వెళ్ళిందన్న మాట హరిత. బాగుంది. కాల్
చేస్తుంటే లైన్ కలవడం లేదు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. సిటీలో ఉందా? లేదా
అని. ఇంటికి లాక్ చేసుంటే చచ్చేదాన్ని. మీరు ఉన్నారు కాబట్టి బతికి పోయాను.
లేకపోతే ఏదైనా హోటలుకి వెళ్లాల్సి వచ్చేది. ఒంటరిగా లాడ్జిలో ఉండాలంటే భయంగా
ఉంటుంది కదండీ. అసలే రోజులు బాగాలేవు. ఒంటరిగా ఫారిన్ గర్ల్స్ వస్తారు పాపం.
వాళ్లని రేప్ చేసి మర్డర్ చేశారని చదివితే అడిగి పోతాను. ఇండిపెండెంట్స్ వచ్చి
సెవంటీ ఇయర్స్ అయినా ఆడవాళ్లకు సేఫ్టీ లేదండీ మన దగ్గర..!" శాలిని టీవీ
యాంకర్ లా లొడాలొడా వాగుతుంది. " ఒౌనండి..ఒౌను..!" అన్నాడు ఆమె వైపు
విచిత్రంగా చూస్తూ. ఆమె సెల్ ఫోన్ తీసి డయల్ చేసింది. విసుగ్గా ముఖం పెట్టింది.
" హరిత నెంబర్ కలవడం లేదు. వాయించాలి దాన్ని. నన్ను రమ్మని తను టూర్ ఎందుకు వెళ్ళిందో?
ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. లైన్ కలుస్తుందేమో?" అతణ్ని రిక్వెస్ట్ చేస్తూ
అన్నది. కూడా సెల్ ఫోన్ తీసి ట్రై చేశాడు. " లేదండీ.. అన్నయ్య ఫోన్ కూడా
కలవడం లేదు.
నాగార్జునసాగర్, శ్రీశైలం అంతా ఫారెస్ట్ ఏరియా కదండీ. టవర్స్ ప్రాబ్లం
అనుకుంటాను" అన్నాడు. " అంతే అయ్యుంటుంది లెండి. ఈ నైట్ ఇక్కడ స్టే
చెయ్యొచ్చుగా నేను. ప్రాబ్లమ్ ఏమీ లేదుగా..!" శాలిని ఓరగా చూస్తూ గోముగా
అన్నది. " పర్వాలేదండీ.. ఉండండి. మా వదిన ఫ్రెండ్ మీరు..." అన్నాడు.
" రేపు హైటెక్స్ లో మ్యారేజ్ కి వెళ్ళాలి. మీరు నాతో పాటు రావాలి"
అన్నది శాలిని. " నేనేందుకండీ..?" " భలేవారే! ఒంటరిగా వెళ్తే అదోలా
ఉంటుంది. హరిత ఉంటే వచ్చేది" " సరేలెండీ.." అన్నాడు సంజీవ్
ఇబ్బందిగా చూస్తూ. " ఓకే. నేను ఫ్రెష్ అవుతాను." అంటూ లేచి వళ్లు
విరుచుకుంది శాలిని. సంజీవ్ కన్నార్పకుండా నిండైన ఆమె శరీరాన్ని చూస్తున్నాడు. ఏకాంతం.
పాతికేళ్ల పరువంలో ఉన్న బ్యూటీ శాలిని. సెక్సీగా కనిపిస్తుంటే ఒంట్లో అలజడి
చెలరేగింది అతనికి. ఆమె ఫ్రెష్ అయి వచ్చింది. " ఆకలి దంచేస్తుంది. నాకు ఏం
మర్యాద చేస్తారు?" అన్నది." మర్యాదా?" " ఒౌను. హరిత ఉంట రెడ్
వైన్ తోే పేరడైజ్ బిర్యాని తో మరియు చేస్తుంది." గోముగా అన్నది. "
షుార్..." అన్నాడు. సంజీవ్ ఫ్రిజ్ దగ్గరికి వెళ్లి రెడ్ వైన్ బాటిల్ తీశాడు.
నందీశ్వరి
ఇంటికి ఉదయం ఏడింటికి పని మనిషి రజిని వచ్చింది. గేట్ తీసుకుని వెళ్ళింది. మెయిన్
డోర్ నెట్టగానే తెలుసుకుంది. " సంజీవ్ బాబుా..!" అని పిలిచింది. అతను
పలకలేదు. మాస్టర్ బెడ్ రూమ్ తలుపు నెట్టింది. బెడ్ మీద విగతజీవిగా కనిపించాడు
సంజీవ్. కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. నోరు తెరుచుకుని నాలిక బయటకు ఉంది. రజిని
కెవ్వున కేక పెట్టి బయటికి పరిగెత్తింది. గేటు దగ్గర నిలబడి ఏడుస్తుంటే
ఇరుగుపొరుగు వాళ్ళు వచ్చారు. ఎదురింటి ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానిక
పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ నాగిరెడ్డి, ఎస్సై శ్రీనివాస్, కొందరు
కానిస్టేబుళ్లు వచ్చారు. క్లుాస్ టీం రంగంలోకి దిగింది. ఫోటోగ్రాఫర్ సంజీవ్ బాడిని
ఫోటోలు తిస్తుంటే, ఫింగర్ ప్రింట్ ఎక్స్ పర్ట్ వాటిని సేకరించే పనిలో పడ్డాడు.
పనిమనిషి రజిని ఏడుస్తూ వరండాలో కూలబడి ఉంది. ఆమెను ఎస్సై శ్రీనివాస్
విచారిస్తున్నాడు. ఇంటి యజమాని నందీశ్వర్, అతని భార్య హరిత, పిల్లలు నాగార్జున
సాగర్ టూర్ వెళ్లారని, ఇంట్లో నందీశ్వర్ బాబాయ్ కొడుకు ఒంటరిగా ఉన్నాడని, తను
నిన్న సాయంకాలం ఆరింటివరకు ఇంట్లో ఉండి పనిచేసి వెళ్లానని, ఉదయం వచ్చి చూస్తే
తలుపు తీసే ఉన్నాయని, సంజీవ్ చచ్చిపోయి కనిపించాడు అని చెప్పింది రజిని. మాస్టర్
బెడ్ రూమ్ చిందరవందరగా ఉంది. బీరువాలోని దుస్తులన్నీ కింద పడి ఉన్నాయి. దొంగతనం
జరిగిందని.. డబ్బు, బంగారం పోలి ఉంటుందని పోలీసులు ఊహించారు. సంజీవ్ శవాన్ని
పోస్టుమార్టం రిపోర్ట్ కోసం ప్రభుత్వ ఆసుపత్రి పంపారు. రెండు ప్లేట్లు, రెండు గాజు
గ్లాసులున్నాయి. ఆ రాత్రి సంజీవ్ తోపాటు ఎవరో ఉన్నారని, వాళ్లే అతన్ని హత్య చేసి
డబ్బు, నగలు దోచుకెళ్లారని అర్థమైంది. అతనితో గడిపింది ఎవరో తెలియాల్సి ఉంది.
పోస్టుమార్టం రిపోర్ట్ లో అతని గొంతు పిసికి చంపారని, రాత్రి పన్నేండు గంటలకు
చనిపోయాడని, ఒక స్త్రీతో గడిపినట్లుగా నిర్ధారణ అయింది. నందీశ్వర్ కుటుంబం ఇల్లు
చేరుకునేటప్పటికి రాత్రి పది గంటలు అయింది.
అతను విపరీతంగా బాధపడుతుంటే, అతని
భార్య హరిత ఏడవసాగింది. " రాత్రి మీ తమ్ముడు ఎవరో స్త్రీతో గడిపాడని రిపోర్ట్లో
ఉండండి! అతనికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒంటరిగా ఉన్నానని ఆమెను
పిలిపించుకున్నాడా?" పని ఇన్ స్పెక్టర్ ప్రశ్నించాడు. " లేదండీ! వాడు
ఇంజనీరింగ్ ఫైనలియర్ లో ఉన్నాడు. వాడికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్లు మా దృష్టికి
రాలేదు." అన్నాడు నందీశ్వర్. " మీ వాడికి కాల్ గర్ల్స్ తిరిగే అలవాటు
ఏమైనా ఉందా?" " అబ్బే లేదండి.. అటువంటి అలవాట్లు లేవు" " మరి
అతను గడిపింది ఎవరితో?" " అదే అర్థం కావటం లేదు" " దొంగతనం
జరిగిందనేది తెలిసిపోతుా ఉంది. ఏమేం పోయాయో చెప్పండి" హరిత చెప్పబోతుంటే
వారించాడు నందీశ్వర్." క్యాష్ లక్ష రూపాయల వరకు ఉండండీ. మా ఆవిడకు
ముఫ్ఫైతులాల నగలు ఉన్నాయి. అవన్నీ లేవు" చెప్పాడు నందీశ్వర్. నందీశ్వర్
బాబాయి, పిన్ని, ఇతర బంధుమిత్రులతో ఇల్లంతా నిండిపోయింది. అంతా సంజీవ్
అన్యాయమపోయ్యాడని విచారిస్తున్నారు. తల్లి గోడుగోడున ఏడుస్తుంది. " వాడి
హాస్టల్ లో ఉంటున్నాడు. ఇంట్లో ఒక్క రాత్రి ఉండరా అని నేను పిలిచిను. వాడి చావుకు
నేనే కారణం" అని దఃఖించాడు నందీశ్వర్.
ఆ కాలనీ
చౌరస్తా లోనే ఉంది నందీశ్వర్ ఉన్న డూప్లెక్స్ హౌస్. ఒక పోల్ కి వారం క్రితమే
సిసికెమెరా ఫిక్స్ చేశారు. ఆ సంగతి చాలా మందికి తెలియదు. ఇన్ స్పెక్టర్ నాగిరెడ్డి
రికార్డయిన ఫుటేజ్ పరిశీలిస్తుంటే నందీశ్వర్ ఇంటి వైపు వెళ్తున్న యువతి
కనిపించింది. భుజానికి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని, లగేజ్ ట్రాలీ లాక్కుంటూ
వెళ్ళింది. ఆ ఫుటేజ్ ని వాట్సాప్ లో సిటీ లోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించాడు.
బంజారాహిల్స్ లో ఇందిరానగర్ కాలనీలో ఉంటున్న మాలినిగా పోలీసులు ఆచూకీ దొరికింది.
మాలిని సిని/ టీవీ రంగాల్లో జూనియర్ ఆర్టిస్ట్. పోలీసులు మాలినిని తనదైన శైలిలో
విచారిస్తే, ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. నందీశ్వర్ మున్సిపాలిటీ టౌన్
ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు. కట్టలకట్టలు డబ్బు
తెస్తున్నాడు. హరిత అప్పుడప్పుడు నగరంలోని జూలరీ షాప్ కు వెళ్లి నగలు కొంటూ
ఉంటుంది. పనిమనిషి రజనీని తోడు తీసుకెళ్తూ ఉంటుంది. దాంతో రజినీకి డబ్బు, బంగారం
పై కన్నుపడింది. రజనీకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతని పేరు మునీర్. క్యాబ్
డ్రైవర్. బాగుపడాలంటే నందీశ్వర్ ఇంట్లో దొంగతనం చేయడమే మార్గం అనుకున్నారిద్దరు.
సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మునీర్ కు మాలినితో కూడా సంబంధం ఉంది. నందీశ్వర
కుటుంబం టూర్ వెళ్తున్నట్లు, ఆ రాత్రి సంజీవ్ ఒంటరిగా ఉంటాడని రజనీ పసికట్టింది.
ముగ్గురు తోడు దొంగలు కలిసి స్కెచ్ వేశారు. మాలిని ఇంట్లో డబ్బు, నగలు దొరికాయి.
దాదాపు కోటి రూపాయలు క్యాష్, కిలో బంగారు నగలు లెక్కలోకి వచ్చాయి. అంతా అక్రమార్జన
కాబట్టి నందీశ్వర్ చెప్పలేకపోయాడు. ఇప్పుడు పాపం పండి బయటపడింది. దొంగతనం,
హత్యకేసులో రజనీ, మాలిని, మునీర్ జైలు పాలైతే.. అక్రమార్జన కేసులో ఇరుక్కొని
నందీశ్వర్ సస్పెండ్ అయ్యాడు. 'అధికారులను తన పిశాచం పట్టుకుంది. అడ్డగోలు సంపాదన.
మని పట్టుకున్నా కొద్ది కట్టలపాములు, కిలోల కొద్ది బంగారు నగలు, వందలకొద్ది
ప్లాట్లు, ప్లాట్లు బయటపడుతున్నాయి. వీరి సంపాదన చూసి కన్ను పుట్టినవాళ్ళు
నేరస్తులవుతున్నారు. దేశం ఇంకేం బాగుపడుతుంది?' అని పత్రికలు వ్యాఖ్యానించాయి.
ధన పిశాచం
Reviewed by Smartbyte group
on
August 29, 2018
Rating:

No comments: