అకాల దెయ్యం


                మధ్యాహ్నం ఒక్కసారిగా మారిపోయింది. మంచి ఎండ కాస్తున్న సమయంలో ముసురు పట్టేసింది. సాయంత్రానికి సన్నటి జల్లులు. రాత్రికి వర్షం. 'అకాల వర్షం' అన్నాడు రామ్మూర్తి.. గోణుకున్నట్టుగా. " అంటే ఏంటి మావయ్యా?" అన్నాడు పండు. " ఎండాకాలం ఎండ కాస్తుంది. వర్షాకాలం వర్షం పడుతుంది. చలికాలం చలేస్తుంది. ఇది ఎండాకాలం కదా. అయినాగానీ వర్షం పడిందంటే.. అకాల వర్షం అన్నమాట".. చెప్పాడు రామ్మూర్తి." అకాల వర్షం లాగా అకాల చలి, అకాల ఎండ కూడా ఉంటాయా మావయ్యా?".. మళ్లీ ఇంకో ప్రశ్న వేశాడు పండు. రామ్మూర్తి నవ్వాడు. " తాళం కాని సమయంలో ఏది వచ్చినా అది అకాలమే" అన్నాడు. ఆ మాట పిల్లలిద్దరికీ అర్థం అయి కానట్టుగా ఉంది. దాన్ని వదిలేసి మావయ్యను కథ చెప్పమని అడిగాడు. పండు, వాడి తమ్ముడు ఆ మామయ్య ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా, మళ్లీ ఆయన ఊరు వెళ్లే వరకు ఆయన చుట్టూనే తిరుగుతుంటారు. ఎప్పుడో గాని అక్కను చూడ్డానికి రాడు రామ్మూర్తి. 'వచ్చిపోరా' అని అక్క అడగాల్సిందే కానీ తనకై తాను రాడు. పల్లెలో ఉంటాడు. పల్లె పనుల్లో ఉంటాడు. అక్కంటే అతడికి ప్రాణం.         
    
                    ల్లె నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో ఎన్ని రకాల పళ్ళు, కాయలు అవన్నీ బుట్టలో వేసుకుని వస్తాడు. బరువు అనుకోడు. అక్క, బావ, పిల్లలు తింటారు కదా అనుకుంటాడు. " కదా చెప్పు మామయ్యా" మళ్లీ అడిగారు పిల్లలు. " ఏం కథ చెప్పన్రా?" అన్నాడు రామ్మూర్తి. " మావయ్య మావయ్య.... ఇప్పుడు అకాల వర్షం పడుతుంది కదా. అందుకని అకాల దెయ్యం కథ చెప్పు మావయ్యా.." అన్నాడు పండు తమ్ముడు.. మావయ్య చేతిని పట్టుకొని కుదిపేస్తుా. రామ్మూర్తికి నవ్వొచ్చింది. వాడు కనుక అకాల దెయ్యం అని అనకు పోయుంటే, జీవితంలో తనకు ఏనాటికీ అకాల ధైర్యం అనే మాట స్ఫురించేది కాదు. ఊహకు అందని విధంగా బలే మాట్లాడతారు పిల్లలు అనుకున్నాడు రామ్మూర్తి. " ఒరేయ్.. అకాల దెయ్యాలు ఉండవురా. సమ్మర్లో, రైన్  సీజన్లో, వింటర్ లో.. అన్ని కాలాల్లో దెయ్యాలు ఉంటాయి" అని తమ్ముడు అజ్ఞానానికి పెద్దగా నవ్వి, మామయ్య వైపు చూసి.." కదా మావయ్యా.." అన్నాడు పండు. రామ్మూర్తి మాట్లాడలేదు. గది బయటకు దీక్షగా చేస్తున్నాడు. ఆ చీకట్లో నీడలేవో కదులుతున్నాయి! వీలున్న గదిలో కూడా ఏ మాత్రం వెలుతురు లేదు. ఇప్పుడు వేశారో గాని పిల్లలు మెయిన్ లైట్ ఆఫ్ చేసి, బెడ్ లైట్ వేశారు. ఆమాత్రం ఎఫెక్ట్ ఉంటే గాని దెయ్యం కథకు వాళ్ళు ఎంజాయ్ చేయలేరు! 'చెప్పు మామయ్యా.. " మళ్లీ మావయ్యను పెట్టుకొని ఊపేసాడు పండు, వారి తమ్ముడు. 

                         రామ్మూర్తి అప్పటికప్పుడు దెయ్యం కథలు సృష్టించగలడు కానీ ఆరోజు ఎందుకనో సృష్టించలేక పోయారు. గదిలో ఓ మూల ఊరి నుంచి తెచ్చిన మామిడిపండ్ల బుట్ట కనిపించింది. అక్కే వాటిని మగ్గబెట్టడానికి అక్కడ ఉంచింది. వాటిని చూడగానే ఎక్కడో అని విన్న దెయ్యం కదా గుర్తుకు వచ్చింది రామ్మూర్తికి. చెప్పడం మొదలుపెట్టాడు. ఇద్దరు పిల్లలు తోట లోకి వెళ్లి దొంగతనంగా మామిడి కాయలు కోస్తారు. వాటిని సంచిలో వేసుకుంటారు. మరి వాటిని రహస్యంగా పంచుకోవాలి కదా, ఎక్కడా చోటు దొరకదు. దగ్గరలో ఒక పెద్ద గేటు కనిపిస్తుంది. దాన్నేక్కి అవతలివైపుకు దూకేస్తాడు. అది స్మశానం! దూకేటప్పుడు సంచీలోని రేండు మామిడికాయలు సంచిలోంచి ఇవతలే పడిపోయాయి. వాటిని అలాగే వదిలేసారు. స్మశానంలో ఎవరికి కనిపించిని చోట కూర్చుని..' నీకోకటి, నాకోకటి..నీకోకటి, నాకోకటి..' అని పంచుకుంటున్నారు. అప్పుడే ఓ తాగుబోతు స్మశానం గేటు పక్కన వెళుతూ విళ్ళ మాటలను విని ఆగిపోయాడు. మనుషులు కనబడరు. మాటలు వినబడుతుంటాయి! భయం వేసి వెంటన చర్చి ఫాదర్ దగ్గరికి పరుగులు తీస్తాడు. " ఫాదర్.. స్మశానంలో దెయ్యాలు శవాన్ని పంచుకుంటున్నాయి" అని చెప్తాడు. " నువ్వు చూసావా?" అని అడుగుతాడు ఫాదర్. " ఈ చెవులతో విన్నాను ఫాదర్..  'నీకోకటి, నాకోకటి' అని పంచుకుంటున్నాయి" అని చెబుతాడు తాగుబోతు. ఫాదర్ వెంటనే.. 'సరే.. చూద్దాం పద' అని బయలుదేరుతాడు. 

                     ఇంతవరకు చెప్పి కథను ఆపేసాడు రామ్మూర్తి. పిల్లల నిద్రపోతే రేపటి ఒక కథ మిగిలి ఉంటుందని అతని ఆలోచన. " చెప్పు మావయ్యా.. తర్వాత ఏమైంది?" అన్నారు పిల్లలిద్దరుా. కథను కంటిన్యూ చేయక తప్పలేదు రామ్మూర్తికి. ఫాదర్, తాగుబోతు వెళ్లి స్మశానం గేటు బయట నిలిచి ఉంటారు. లోపల్నుంచి మాటలు వినిపిస్తుంటాయి. 'నీకోకటి, నాకోకటి' అని! ఆ తర్వాత సడన్గా కొన్ని క్షణాలు మాటలు ఆగిపోతాయి. ఆ వెంటనే.." మరి గేటు దగ్గర ఉన్న ఆ రెండింటి సంగతేంటి?" అనే మాట వినిపిస్తోంది. అంతే.. ఫాదర్, తాగుబోతు ఇద్దరు ఒక్కసారిగా భయంతో 'మేమింకా చావలేదు నాయనోయ్' అనుకుంటూ.. అక్కడి నుంచి పరుగు తీస్తారు.. కథను ముగించాడు రామ్మూర్తి. " ఇది దెయ్యం కథ కాదు మావయ్యా. జోక్. నా వాట్సాప్ లో కూడా ఉంది చూడు" అంటూ చెప్పబోయాడు పండు.  " దెయ్యం కథలన్నీ జోకు లేరా" అన్నాడు రామ్మూర్తి. " అయితే నిజంగా దెయ్యాలు లేవా మావయ్య.." అడిగాడు పండు, నిరుత్సాహంగా. వాడిని మరీ అంతగా నిరుత్సాహ పడనివ్వదలుచుకోలేదు రామ్మూర్తి. " ఉన్నాయనుకుంటే ఉన్నట్లు. లేవనుకుంటే లేనట్లు. ఇందాకటి నుంచి ఆ చీకట్లో నాకేదో కనిపిస్తుంది. మీకేమైనా కనిపిస్తుందా?" అన్నాడు రామ్మూర్తి. పిల్లలిద్దరూ గబుక్కున మామయ్య డొక్కల్లో ముఖం దాచుకున్నారు. రామ్మూర్తి నవ్వుకున్నాడు. ఏకాలంలోనైనా మనిషిలోని భయమే అకాల దెయ్యం అని పిల్లలకు చెప్పాలనుకున్నాడు.

అకాల దెయ్యం అకాల దెయ్యం Reviewed by Smartbyte group on August 28, 2018 Rating: 5

No comments: