ఏంటమ్మా.. ఇది!


                          " బాస్ పిలుస్తున్నారు". సెక్షన్ లోకి రాగానే.. అజయ్ తో చెప్పింది పూజ. వాల్ క్లాక్ లో టైం చూశాడు అజయ్. పదకోండు దాటి తొమ్మిది నిమిషాలయింది. 'చచ్చాన్రా.. దేవుడా' అనుకున్నాడు. తొమ్మిది నిమిషాలు ఆలస్యం అయినందుకు బాస్ ఏమి అనడు. నిన్న ఆఫీస్ టైం అయిపోయాక కూడా తను ఆఫీసులోనే ఉన్నాను. అందుకు అంటాడు. ఇది అతడి భయం. ఆఫీస్ అవర్స్ ముగిశాక ఆఫీసులో ఎందుకు ఉండవలసి వచ్చిందో ఎక్స్ ప్లనేషన్ ఇవ్వాలి. క్రితం రోజు స్టాఫ్ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ పంచ్ స్టేట్ మెంట్ రోజు బాస్ కన్నా ముందే అతడి టేబుల్ మీదకు వచ్చి ఉంటుంది. దాన్ని చూసి లోపలికి పిలుస్తాడు బాస్. ఔట్ గోయింగ్ లో 'ఓవర్ స్టే' అని ఉంటుంది. అందుకే తనను పిలిచి ఉంటాడు అనుకున్నాడు. బాస్ క్యాబిన్ తలుపు మూసి ఉంది! సాధారణంగా అది ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఎవరికైనా అక్షింతలు పడిపోతున్నప్పుడు మాత్రం అవి మూసుకుని ఉంటాయి. అది ఆయన అలవాటు. మూసి తిడతాడు. అదొక్కటే కాదు. ఇంకా కొన్ని రూల్స్ ఫాలో అవుతాడు బాస్. అవి ఆ బాస్ కన్నా పై వాళ్ళు పెట్టిన రూల్స్ కావు. తనకు తను పెట్టుకున్నవి. ఆయనేప్పుడుా ఉమెన్ స్టాఫ్ నీ తిట్టడు. బాగా కోపం వస్తే మెల్లగా మందలిస్తాడు. 'ఏంటమ్మా.. ఇది!' అని. దాన్నే తీవ్రస్థాయి అనుకోవాలి! వాళ్లని తిట్టే ఆ మాత్రపు తిట్టిను కూడా మగవాళ్ళను తిప్పినట్లుగా తలుపు మూసి తిట్టరు ఆయన. తలుపు తెరిచి ఉన్నప్పుడే లోపలికి పిలిపిస్తాడు. మృదువుగా.. "ఏంటమ్మా.. ఇది!" అంటాడు. పూజ దగ్గరికి వచ్చి మెల్లగా చెవి దగ్గర అడిగాడు అజయ్.." ఎంతసేపైంది వచ్చి?" అని. " నేనా.. ఇప్పుడే" అంది పూజ నవ్వుతూ. అజయ్ కోపంగా చూశాడు. " నువ్వేప్పుడోస్తే ఏంటి? బాస్ వచ్చి ఎంతసేపైందో చెప్పు?" అన్నాడు. " లోపలికి వెళ్తావుగా.. చెప్తాడులే.. వచ్చి ఎంతసేపైందో" అంది పూజ నవ్వుతూ. కొరకొర చూశాడు అజయ్. " వెళ్ళు.. ఇప్పటికే రెండుసార్లు బెల్ కొట్టాడు.. నీకోసం".. అంది. 

                            పూజ కూర్చునే వరుసకు రెండు వరసల అవతల సరిగ్గా ఆమెకు ఎదురుబొదురుగా ఉంటుంది అజయ్ సీటు. అక్కడికి వెళ్లబోతుంటే.." ముందు బాస్ ను కలువు. మళ్లీ బెల్ కడతారేమో" అంది పూజ. నేరుగా బాస్ క్యాబిన్ కి వెళ్లి, మూసి ఉన్న తలుపు పై వేళ్ళతో తట్టాడు అజయ్.. 'మే ఐ కమిన్ సార్' అన్నట్లు! 'కమిన్' అని అటు వైపు నుంచి ఏమి అనిపించలేదు. బాస్ మెల్లగా 'కమిన్' అన్నాడేమో, తనకు వినిపించి ఉండదని కొని డోర్ నాబ్ ని కిందకి తిప్పి తలుపును కొద్దిగా లోపలికి తోసి.. మళ్లీ 'మే ఐ కమిన్' సార్ అనుకుంటుా తల లోపలికి పెట్టి చూసి.. నివ్వెరపోయాడు అజయ్. పగలబడి నవ్వుతుంది పూజ. పూజ నవ్వు ఆగట్లేదు. అజయ్ నే చూస్తూ పడి పడి నవ్వుతోంది. తనని ఫుల్ ని చేశానన్న ఆనందం అది. అమ్మాయిలు చిన్న చిన్న విషయాలను ఇంతగా ఎందుకు సంతోషపడతారు అతడికి అర్థం కాదు. వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. లాంగ్ షాట్ లో అతడినే చూస్తూ నవ్వుతుంది పూజ. ఆమె ముఖానికి, తన ముఖానికి మధ్య సిస్టం మానిటర్ అడ్డు వచ్చేలా తన కుర్చీని కాస్త కిందకి అడ్జస్ట్ చేసుకున్నాడు అజయ్. అతడెలా కూర్చున్న కొద్దిసేపటికే బాస్ క్యాబిన్ నుంచి బెల్ మోగింది! వచ్చినట్లున్నాడు! సీట్లోంచి పైకి లేపబోయాడు అజయ్. " పూజా.." పెద్దగా పిలిచాడు బాస్. తిట్టేందుకు పిలవకపోయినా, తిట్టినట్లు పిలవడం బాస్ అలవాటు. " కూర్చోమ్మా.." అన్నాడు బాస్, పూజ లోపలికి వెళ్లగానే. ఆయనేప్పుడూ స్టాఫ్ ని కూర్చోమని అనడు. ఆ అవసరమే రాదు. రెండు ముక్కల్లో చెప్పాల్సింది చెప్పి పంపించేస్తాడు. " లుక్.. పూజా.. ఆఫీస్ అవర్స్ అయిపోయాక కూడా ఎవరైనా ఆఫీసులోనే ఉన్నారంటే.. నేననుకోవడం.. సన్ అథర్ ఇంటెన్షన్ ఏదో వాళ్లకు ఉంటుందని.. ఆధార్ దేన్ ఆఫీస్ వర్క్. అది నాకు ఇష్టం లేదు. మార్నింగ్ లేటుగా వచ్చినందుకు ఈవినింగ్ లేట్ అయ్యేంతవరకు పని చేయవలసిన అవసరం, అంత పని ఉంటే సెక్షన్ ఏమీ కాదు మనది. 

                                      జయ్ ఈమధ్య రిపీటెడ్గా.. తన షిఫ్ట్ అయ్యాక కూడా ఆఫీసులోనే ఉంటున్నాడు". అన్నాడు బాస్. ఆమెకు కొంచెం అర్థమైంది. " పనైపోయాక కూడా అజయ్ ఆఫీసులోనే ఉండడం.. నీకోసమేనని నేను అనుకుంటున్నాను పూజా" అన్నాడు బాస్. పూజ మౌనంగా ఉండిపోయింది. ఆయనా ఇంకేమీ మాట్లాడలేదు. కనీసం..' ఏంటమ్మా.. ఇది!' అని కూడా అందించలేదు. 'ఆ మాట చెప్దామనే..' అన్నట్లు మాత్రం చూశాడు. పూజ బయటకి వచ్చింది. బయటకు రాగానే 'ఏంటంటా?' అన్నట్లు చూశాడు అజయ్. 'క్యాంటీన్ లో చెప్తా' అన్నట్లు సైగ చేసింది పూజ. ఇదంతా రెండేళ్ల క్రిందటి మాట. ఇప్పటికీ ఆ క్యాబిన్ లోంచి అప్పుడప్పుడు 'పూజా', 'అజయ్' అనే పిలుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయి! పూజకు, అజయ్ కి మాత్రమే కాదు. మిగతా స్టాఫ్ కూడా. అలా వినిపించినప్పుడు..' నాకు వినిపించింది! నీకు వినిపించిందా?' అన్నట్లు ఒకరివైపు ఒకరు చూసుకుంటారు. బాస్ ఆత్మ ఇక్కడే తిరుగుతోందని అనుకుంటూ ఉంటారు. కొత్తగా వచ్చిన లేడీ బాస్ కూడా ఒకరోజు స్టాఫ్ ని అడిగింది.. 'ఎవరో ఎవర్నో పిలిచినట్లు నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందా' అని. అలాంటప్పుడు పూజ, అజయ్ బాధగా ఒకర్నొకరు చూసుకుంటారు. వాళ్ళిద్దరు అంటే పాత బాస్కు వాత్సల్యం. వాళ్లకు కూడా ఆయనంటే ఇష్టం.  " వాయిస్ గా కాకుండా, బాస్ గా ఎదురైతే.. ఆయన్ని నేనోకటి అడుగుతాను" అన్నాడు ఓ రోజు అజయ్ ఎమోషనల్గా. అంతక్రితమే సెక్షన్ లో అందరికీ మళ్లీ ఒకసారి బాస్ గొంతు వినిపించింది! 'ఏమని అడుగుతావ్?' అన్నట్లు అజయ్ వైపు చూసింది పూజ. " ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాక కూడా మీరు ఎందుకు ఆఫీస్ లోనే ఉంటున్నారు సార్ అని అడుగుతాను" అని.. కురుస్తున్న కళ్ళపై వెళ్ళను అదిమీ పెట్టుకున్నాడు అజయ్. పూజ మృదువుగా అజయ్ చేతిని పట్టుకుంది.

ఏంటమ్మా.. ఇది! ఏంటమ్మా.. ఇది! Reviewed by Smartbyte group on August 23, 2018 Rating: 5

No comments: