అనుకోకుండా
వాళ్ళు ఇద్దరు కలుసుకున్నారు! ఒకతను చక్రవర్తిలా ఉన్నాడు చక్రవర్తి కళ లేదు.
ఇంకొకతను చక్రవర్తిలా లేడు. చక్రవర్తి కళ ఉంది! చక్రవర్తి కళ ఉన్న వ్యక్తిలోని
కాంతి.. చక్రవర్తి కళ లేని వ్యక్తి మీద, ఆ చుట్టుపక్కల పడుతుంది. " నిన్నేక్కడో
చూసాను.." చికాగ్గా అన్నాడు చక్రవర్తిలా
ఉన్నతను కళ్ళకు చేతులు పెట్టుకుంటూ. " నాకు అనిపిస్తుంది..
మిమ్మల్నేక్కడో చూసినట్లు.." చిరునవ్వుతో అన్నాడు చక్రవర్తిల లేనతను. "
నేను నీతో చికాగ్గా మాట్లాడుతున్నాను కదా! నాతో ప్రవక్తలా నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావు?"
అన్నాడు చక్రవర్తిలా ఉన్నతను. ప్రవక్త నవ్వు ఆపలేదు. చక్రవర్తి చికాగ్గా చూసాడు.
" నేను నిన్ను 'నువ్వు అంటున్నాను కదా! నువ్వు నన్నేలా 'మీరు'
అనగలుగుతున్నావు? నన్ను 'మీరు' అనడం మానేయ్. అందులో నాకు వ్యంగ్యం కనబడుతుంది.
వ్యంగ్యంగా మాట్లాడేవాడు తనను తను గొప్పవాడినని అనుకుంటాడు. నా కన్నా గొప్పవాడు
ఇంకొకడు ఉండడం నాకు ఇష్టం లేదు." అన్నాడు చక్రవర్తి. మళ్లీ నవ్వాడు ప్రవక్త.
" మీ కన్నా గొప్పవాడు ఇంకొకరు లేరు కానీ, మీ కన్న గొప్పది ఇంకొకటి ఉంది"
అన్నాడు. " ఏంటది?" అన్నాడు చక్రవర్తి. " ప్రేమ" అన్నాడు
ప్రవక్త.
చక్రవర్తి చికాకు ఎక్కువైంది. ప్రవక్త చిరునవ్వు ఎక్కువా కాలేదు, తక్కువా
కాలేదు. ప్రవక్తని అసహ్యంగా చూస్తున్నాడు చక్రవర్తి. చక్రవర్తిని ఆపేక్షగా
చూస్తున్నాడు ప్రవక్త. ఆ చూపు, ఆ మాట, ఆ నవ్వు.. ఈ జన్మలోనీవో గుర్తుకొచ్చింది
చక్రవర్తికి! " నువ్వా!! నిన్ను మళ్ళీ చూడాలని నేను అనుకోలేదు. యుగాల తర్వాత
కూడా నువ్వు అలాగే యవ్వనంతో ఎలా ఉన్నావ్?" అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి తనను
తను చూసుకున్నాడు. కిరీటం ఉంది. వెలుగు లేదు. ఒంటిమీద మణులున్నాయి. మెరుపు లేదు.
ఖడ్గం ఉంది. పదునులేదు. ప్రవక్తను చూశాడు. కిరీటం లేదు. వెలుగొంది. మణుల్లేవు.
మెరుపుంది. ఖడ్గం లేదు.పదును ఉంది. ఆ వెలుగు, మెరుపు, పదును అతడి చిరునవ్వు లోంచి
కిరణాల్లా ప్రసరిస్తున్నాయి. "ఈ చీకటి రాత్రి ఎక్కడివి సూర్యకిరణాలు?"
విస్తుపోయాడు చక్రవర్తి. " సూర్యకిరణాలు కావు. ప్రేమ కిరణాలు. వేల
సూర్యుళ్లనే వెలిగించే ప్రేమ కిరణాలు" నవ్వి, చెప్పాడు ప్రవక్త. "
నువ్వు ఆపి చెప్పు. నువ్వింకా అలాగే ఎలా ఉన్నావ్?" అని అడిగాడు చక్రవర్తి.
" నాలో ప్రేమ ప్రవహిస్తుంది. ప్రేమ ప్రవహించే చోటంతా పచ్చదనం ఉంటుంది. పూల
పరిమళం ఉంటుంది. పక్షుల రాగాలు ఉంటాయి." " నీ బొంద కూడా ఉంటుంది. ఉరి
తీయించినా ఇంకా గాల్లోనే వేలాడుతున్నావా! నీతో పాటు నీ ప్రేమా
చచ్చిపోతుందనుకున్నాను.." కోపంతో ఊగిపోతున్నాడు చక్రవర్తి. " నా ప్రేమ
తనతోపాటు నన్ను బ్రతికించుకుంది." అన్నాడు ప్రవక్త. " నేనొక్కడినేనా..
ఈ
గాలిలో తిరుగుతున్న ప్రేమ దెయ్యాలనన్నింటినీనా?" విసుగ్గా అన్నాడు చక్రవర్తి.
" నేనోకటి చెప్తాను చక్రవర్తి.." అన్నాడు ప్రవక్త. మొదటిసారి అతడు
'చక్రవర్తి' అనడం. " నేనెవరో గుర్తొచ్చానా?" ఆశ్చర్యంగా అడిగాడు
చక్రవర్తి. " ప్రేమ దేన్ని మర్చిపోనివ్వదు. దీన్ని వాడిపోనివ్వదు. దీన్ని
దుఃఖపడనివ్వదు. ఆరోజు జరిగినవన్నీ నాకింకా గుర్తున్నాయి చక్రవర్తి" అన్నాడు
ప్రవక్త. 'ఆరోజు' అంటే.. ఏరోజుో చక్రవర్తి అర్థమైంది. ప్రవక్తను తను ఉరి తీయించిన
రోజు. ఉరితీతకు ముందు.. ప్రవక్తతో చాలాసేపు ఘర్షణ పడ్డాడు చక్రవర్తి. 'నీ ప్రేమ
ప్రవచనాలతో యువతను చెడగొడుతున్నావు ప్రవక్తా! యువకులు యుద్ధానికి, యువతులు పద్ధతులకు
పనికిరాకుండా పోతున్నారు. చచ్చేముందైనా వాళ్లకు చివరిమాటగా చెప్పు. పనికిమాలిన
ప్రేమలకు దూరంగా ఉండమని చెప్పు' అంటున్నాడు చక్రవర్తి. 'ప్రేమ.. ప్రజల్ని,
రాజ్యాల్ని దగ్గరచేస్తుంది చక్రవర్తి. ఒక్క శత్రువైన మీకు మిగలకుండా చేస్తుంది.
అప్పుడిక యుద్ధాలతో, పద్ధతులతో పనేముంది?"
'నీకు అర్థం కాదు ప్రేమెాన్మాది.. రాజనీతిజ్ఞుడేవడుా ప్రేమను అంగీకరించడు.
పోనీలే పాపం అని ప్రేమించు కొనిస్తే.. చిన్న పువ్వుని విసిరి రాజ్యంలోని యువతీ
యువకులు నా తలపై కిరీటాన్ని పడగొట్టేస్తారు.' అన్నాడు చక్రవర్తి.' ప్రేమ కన్నా
గొప్ప రాజ్యం లేదు. గొప్ప కిరీటం లేదు. అంతిమంగా ప్రేమదే సార్వభౌమత్వం' అన్నాడు
ప్రవక్త. చక్రవర్తి నిట్టూర్చాడు. ప్రవక్త వైపు జాలిగా చూస్తూ అక్కడినుంచి
నిష్క్రమించాడు. వెనకే తలుపులు మూసుకున్నాయి. 'ప్రేమ మూర్తులైన ఈ ప్రవక్త గారిని
ప్రేమగా ఉరితీయండి..' అవే చక్రవర్తి చివరి మాటలు. ప్రవక్తవి కూడా అవే చివరి చూపులు
అనుకున్నాడు.
మళ్లీ ఇలా మనిషిలా దాపురించాడు! " రాజ్యాలు అంతరించాయి. రాజుని
నేను అంతరించాను. నువ్వుా, నీ ప్రేమ ఇంకా ఇలానే తగలడ్డాడు. నన్నెందుకిలా
వెంటపడుతున్నావు? నా బతుకన్నా, నీ బతుకే బాగుందని చెప్పడానికా?" అన్నాడు చక్రవర్తి.
" నేను మిమ్మల్ని వెంటాడడం లేదు చక్రవర్తి. లోకంలోనే ప్రేమ వెంటాడుతుంది. ఆ
వెంటాడే ప్రేమకు నేనొక హృదయాన్ని మాత్రమే" అన్నాడు ప్రవక్త. తెలుగు కాసేపు
మాట్లాడుకోలేదు. మాట్లాడుకోని ఆ కాస్త సమయంలో ప్రవక్త చక్రవర్తిని ప్రేమిస్తూ
కూర్చున్నాడు. చక్రవర్తి ప్రవక్తను ద్వేషిస్తూ కూర్చున్నాడు. అయితే ఎక్కువసేపు
అతడలా ద్వేషించలేకపోయాడు. ప్రేమ ద్వేషాన్ని మింగేసింది! " ఈ లోకాన్ని కూడా నీ
ప్రేమకు బంది చేయాలని వచ్చావా వాలెంటైన్?" అని అడిగాడు చక్రవర్తి. "
ప్రేమ బందీని చేయొద్దు క్లాడియస్. బంధనాలనుంచి స్వేచ్ఛనిస్తుంది" అన్నాడు
ప్రవక్త. చక్రవర్తికి ద్వేషమనే బంధనం నుంచి విముక్తి లభించింది. ప్రవక్త వెంట
గాలిలో పైకి లేచాడు.
దెయ్యాల రోజు
Reviewed by Smartbyte group
on
August 28, 2018
Rating:

No comments: