అత్యాశ

                 క పేద రైతు పొలం దున్నుతూ.... 'దేవుడా నా కష్టాల్ని తీర్చే మార్గం చుపవా' అని ప్రార్ధన చేశాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్లు అనిపించి చూస్తే ,
చిన్న పెట్టె దొరికింది. అంతలోనే ఆకాశవాణి... 'ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. చేయి పెట్టిన ప్రతీసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది. నీకు కావాల్సినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారెయ్యి. అయితే ఒకటి
గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పడేశాక మాత్రమే నువ్వు డబ్బుని ఖర్చు చేయాలి. అలా కాక మధ్యలో ఖర్చుచేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది' అని చెప్పింది.
             రైతు పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెల్లి ఆ రాత్రల్లా పెట్టెలో నుంచి బంగారు నాణేలు తీసి, ఒక పెద్ద సంచి నింపాడు. ఆ మర్నాడు కూడా తిండీ నిద్రా మానేసిమరీ నాణేలు తీసి మరో పెద్ద గోనె సంచీ నింపాడు. ఏమైనా కూర్చున్నా నిద్రపొయినా సమయం వృధా అవుతుందని అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా తాగకుండా నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపు పది గోనె సంచీల నాణేలు కూడబెట్టాడు.  అప్పటికీ ఆశ తీరలేదు, పని ఆపలేదు. తన అత్యాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు మరణించాడు.
అత్యాశ అత్యాశ Reviewed by Smartbyte group on July 06, 2016 Rating: 5

No comments: