ఆకాశవాణి

ఆకాశవాణి 

జెన్‌ గురువు అయిన జెంకో ఒక చోటు నుంచి వెళ్తూంటే అక్కడొక పాడుబడిన
బుధ్ధ్దుని గుడి కనిపించింది. దానిని ఎలాగైనా పునరుధ్ధరించాలనుకున్నాడు. కానీ
ఆయన దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు.
      'ఏం చేయాలా?' అని దీర్ఘంగా ఆలోచించి ఆయన ప్రకటన చేయించాడు.
      "సరిగ్గా మళ్ళీ యిదే వారం నుండు బుధ్ధుని భక్తుడయిన జెంకో అగ్ని ప్రవేశం
చేయబోతున్నాడు. అందుకు అయ్యే ఖర్చు కోసం ఎవరికి తోచిన విరాళం వారు
అందజేయండి" అంటూ.
      ఆ ప్రకటన బాగానే పని చేసింది. చాలామంది యితోధికంగా విరాళాలిచ్చారు.
      నిర్ణయించిన రోజున అందరూ ఆ గుడిముందు గుమిగూడారు. అగ్ని ప్రవేశం ఎలా
వుంటుందో చూద్దామన్న ఆసక్తితో యిసకేస్తే రాలనంత జనం పోగయ్యారు.
      చితిలా పేర్చిన కట్టెల మీద జెంకో కూర్చొని "నేను చెప్పినప్పుడు చితికి నిప్పుపెట్టండి"
అని చెప్పాడు.
      కళ్ళు మూసుకుని ధ్యానంలో నిమగ్నమయ్యాడు. నిమిషాలు గంటలుగా మారినా
ఆయన ఏమీ చెప్పలేదు. ప్రజలు అసహనానికి గురయ్యారు.
      చాలా సేపటి తర్వాత జెంకో కళ్ళు తెరచి ఆకాశంవైపు చూస్తూ "అందరూ వినండి ..
ఆకాశవాణి పలుకుతుంది... అది పుణ్యాత్ములకు మాత్రమే వినిపిస్తుంది... " అని,"...ఏంటీ?
నేను  యిప్పుడే రావద్దా?... ఈ గుడిని పునరుద్ధరించిన తర్వాతే ఎప్పుడు రావాలో చెప్తారా?..
ఆకాశదేవతలారా!... మీరు ఎలా అంటే అలాగే" అన్నాడు.
      అతని మాటలు అందరూ నమ్మారు.
      జనాలు యిచ్చిన చందాలతో ఆ గుడిని బాగుచేయించాడు. కానీ అగ్నిప్రవేశం గురించి
ఎవరూ ప్రశ్నించలేదు.
ఆకాశవాణి ఆకాశవాణి Reviewed by Smartbyte group on July 07, 2016 Rating: 5

No comments: