ఆఫీసు నుంచి తిరిగొచ్చిన శ్రీకాంత్ దుస్తులు మార్చుకుంటుండగా
తను తొడుక్కున్న బనియను చాలాచోట్ల చిరిగిపోయి కనిపించింది. పిసినారితనంతో
ఇంతకాలం నెట్టుకొచ్చాడు. ఇప్పుడు కొత్త బనియను కొనాలని నిశ్చయానికొచ్చాడు.
క్లాక్ -టవర్ దగ్గరున్న కొట్టు కెళ్ళి ఇరవై రూపాయల్లో చౌకబారు
బనియను కొన్నాడు. దారిలో చూడాలనిపించి, బనియన్ను కవర్లోంచి తీశాడు. అందులో రెండు కనిపించాయి. షాపువాడు పొరపాటున రెండు బనియన్లు పెట్టేశాడు.శ్రీకాంత్ దీర్ఘాలోచనలో పడ్డాడు. మనసు సంబరపడింది - నయమే, ఒకటికి రెండొచ్చాయి. అంతరాత్మ మాత్రం హెచ్చరించింది. 'ఈ జన్మలో దుకాణదారుని
ఇరవై రూపాయలు ముంచితే, వచ్చే జన్మలో తీర్చుకోవడానికి ఏం పాట్లు పడాల్సి వస్తుందో? ఏదోరూపంగా బదులు తీర్చాల్సిందే' అని.
ఆ భయం కలగ్గానే శ్రీకాంత్ పొరపాటున వచ్చిన రెండో బనియను తిరిగిచ్చేయాలని వెనుదిరిగాడు. అయితే, కొంచెం దూరం వెళ్ళగానే, శ్రీకాంత్ మనసులో
మరో ఆలోచన కలిగింది.
'బహుశా ఆ దుకాణదారే గత జన్మలో నా దగ్గర ఇరవై రూపాయలు ఎలాగో కొట్టేసి ఉంటాడు. ఆ లెక్క సరిపోవడానికి దేవుడు ఇప్పుడు వాడితో ఈ పొరపాటు చేయించినట్టుంది. ఇది పూర్వజన్మ రుణమే కావచ్చు. ఇప్పుడు తీరుంటుంది. ఇందులో
ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆ తలంపు మనసులో మొదలవగానే నిశ్చింతగా
ఇంటికి తిరుగు ముఖం పట్టాడు.
తను తొడుక్కున్న బనియను చాలాచోట్ల చిరిగిపోయి కనిపించింది. పిసినారితనంతో
ఇంతకాలం నెట్టుకొచ్చాడు. ఇప్పుడు కొత్త బనియను కొనాలని నిశ్చయానికొచ్చాడు.
క్లాక్ -టవర్ దగ్గరున్న కొట్టు కెళ్ళి ఇరవై రూపాయల్లో చౌకబారు

ఇరవై రూపాయలు ముంచితే, వచ్చే జన్మలో తీర్చుకోవడానికి ఏం పాట్లు పడాల్సి వస్తుందో? ఏదోరూపంగా బదులు తీర్చాల్సిందే' అని.
ఆ భయం కలగ్గానే శ్రీకాంత్ పొరపాటున వచ్చిన రెండో బనియను తిరిగిచ్చేయాలని వెనుదిరిగాడు. అయితే, కొంచెం దూరం వెళ్ళగానే, శ్రీకాంత్ మనసులో
మరో ఆలోచన కలిగింది.
'బహుశా ఆ దుకాణదారే గత జన్మలో నా దగ్గర ఇరవై రూపాయలు ఎలాగో కొట్టేసి ఉంటాడు. ఆ లెక్క సరిపోవడానికి దేవుడు ఇప్పుడు వాడితో ఈ పొరపాటు చేయించినట్టుంది. ఇది పూర్వజన్మ రుణమే కావచ్చు. ఇప్పుడు తీరుంటుంది. ఇందులో
ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆ తలంపు మనసులో మొదలవగానే నిశ్చింతగా
ఇంటికి తిరుగు ముఖం పట్టాడు.
ఇచ్చి పుచ్చుకోవడం
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:

No comments: