రాంపాల్,గోపాల్ మంచి మిత్రులు. నిరుద్యోగులైన వారిద్దరూ ఉపాధికోసమని గ్రామం నుంచి పట్నం బయలుదేరారు. తోవలో,'మనకి ఎవరిదైనా డబ్బు దొరికితే ఒక్క రోజులో ధనవంతులం అయిపోతాం
కదా' అన్నాడు గో్పాల్. దానికి రాంపాల్...'మిత్రమా మనం కష్టపడి సంపాదిస్తే డబ్బుతో పాటు అనుభవం వస్తుంది. అది జీవితంలో ఎదగడానికి ఎంతో అవసరం' అని బదులిచ్చాడు.
అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది. తెరచి చూస్తే అందులో వెయ్యి వరహాలున్నాయి.అంత డబ్బు చూడగానే...'మిత్రమా మన కల నిజమైంది' అని ఆనందంగా చెప్పాడు గోపాల్. ఆ సొమ్మును రెండు వాటాలేసి ఒక వాటా తీసుకుని మరో వాటా రాంపాల్‌కు ఇచ్చి, తన వాటా పట్టుకొని గ్రామానికి వెళ్ళి
పోయాడు. రాంపాల్ మాత్రం ఆ సంచి తీసుకొని పట్నంవైపు నడిచాడు.
ఆ తర్వాత గోపాల్ ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు. ఉద్యోగం ప్రసక్తిలేకుండా కాలం గడిపాడు. ఆర్నెల్లలో డబ్బంతా ఖర్చు చేశాడు. అప్పుడు అతడికి మిత్రుడు రాంపాల్ గుర్తొచ్చాడు.
అతడి గురించి ఆరా తీసి పట్నంలో ఉన్నాడని తెలుసుకొని, వెళ్ళి కలిసి డబ్బంతా ఖర్చు
అయిపోయిందని బాధగా చెప్పాడు.'నీ వాటా ఏం చేశావ'ని రాంపాల్‌ను అడిగాడు...'నువ్వు వెళ్ళిపోయాక డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే తోవన వెనక్కు వచ్చాడు. నా దగ్గరున్న సంచిని అందించి ఒక బాటసారి దీన్లో సగం డబ్బు తీసుకొని ఇచ్చాడని చెప్పాను. సగం డబ్బైనా దొరికినందుకు వ్యాపారి సంతోషించి, తన దుకాణంలో పని ఇచ్చాడు. ఇప్పుడెంతో సంతోషంగా జీవిస్తున్నాను' అని బదులిచ్చాడు రాంపాల్. 'కష్టపడి పనిచేస్తే డబ్బుతో పాటు అనుభవమూ వస్తుంది, జీవితంలో ఎదగడానికి ఆ అనుభవం ఎంతో అవసరం' అన్న స్నేహితుడి మాటలలో ఎంత సత్యముందో గ్రహించిన గోపాల్ అతని దగ్గర సహాయకుడిగా చేరాడు.
కదా' అన్నాడు గో్పాల్. దానికి రాంపాల్...'మిత్రమా మనం కష్టపడి సంపాదిస్తే డబ్బుతో పాటు అనుభవం వస్తుంది. అది జీవితంలో ఎదగడానికి ఎంతో అవసరం' అని బదులిచ్చాడు.
అంతలో వారికి దారిలో ఒక మూట కనిపించింది. తెరచి చూస్తే అందులో వెయ్యి వరహాలున్నాయి.అంత డబ్బు చూడగానే...'మిత్రమా మన కల నిజమైంది' అని ఆనందంగా చెప్పాడు గోపాల్. ఆ సొమ్మును రెండు వాటాలేసి ఒక వాటా తీసుకుని మరో వాటా రాంపాల్‌కు ఇచ్చి, తన వాటా పట్టుకొని గ్రామానికి వెళ్ళి
పోయాడు. రాంపాల్ మాత్రం ఆ సంచి తీసుకొని పట్నంవైపు నడిచాడు.
ఆ తర్వాత గోపాల్ ఎన్నో విలాసవంతమైన వస్తువులు కొన్నాడు. ఉద్యోగం ప్రసక్తిలేకుండా కాలం గడిపాడు. ఆర్నెల్లలో డబ్బంతా ఖర్చు చేశాడు. అప్పుడు అతడికి మిత్రుడు రాంపాల్ గుర్తొచ్చాడు.
అతడి గురించి ఆరా తీసి పట్నంలో ఉన్నాడని తెలుసుకొని, వెళ్ళి కలిసి డబ్బంతా ఖర్చుఅయిపోయిందని బాధగా చెప్పాడు.'నీ వాటా ఏం చేశావ'ని రాంపాల్‌ను అడిగాడు...'నువ్వు వెళ్ళిపోయాక డబ్బు పోగొట్టుకున్న వ్యాపారి అదే తోవన వెనక్కు వచ్చాడు. నా దగ్గరున్న సంచిని అందించి ఒక బాటసారి దీన్లో సగం డబ్బు తీసుకొని ఇచ్చాడని చెప్పాను. సగం డబ్బైనా దొరికినందుకు వ్యాపారి సంతోషించి, తన దుకాణంలో పని ఇచ్చాడు. ఇప్పుడెంతో సంతోషంగా జీవిస్తున్నాను' అని బదులిచ్చాడు రాంపాల్. 'కష్టపడి పనిచేస్తే డబ్బుతో పాటు అనుభవమూ వస్తుంది, జీవితంలో ఎదగడానికి ఆ అనుభవం ఎంతో అవసరం' అన్న స్నేహితుడి మాటలలో ఎంత సత్యముందో గ్రహించిన గోపాల్ అతని దగ్గర సహాయకుడిగా చేరాడు.
ఇద్దరుమిత్రులు
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:

No comments: