మండు వేసవి. మిట్ట మధ్యాహ్నం. పచ్చదనం మచ్చుకైనా లేదు.కూలీ నాలీ చేసుకునే పడుచు దంపతులు చంద్రయ్య, చంద్రమ్మ. కాలినడకన ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు. ఒళ్ళంతా చెమటలు కారుతున్నాయి. నాలుకలు పిడుచగట్టుకుపోతున్నయి. ఎండ మావులే తప్ప ఎక్కడా చుక్క నీరు లేదు.ఎండిన వాగు ఒకటి వారికి అడ్డువచ్చింది. ఎండుటిసుకలో నిలబడితే కాళ్ళు చర్రుమన్నాయి. వాగు గట్టున ఓ చోట పచ్చగా కానగ చెట్లు కనిపించాయి. ఇద్దరూ ఆ నీడళ్ళోకి వెళ్ళి నిలబడ్డారు. 'ఇక్కడ చెలమ తీద్దాం నీళ్ళు రావచ్చు' అంది చంద్రమ్మ. చంద్రయ్య సరేనన్నాడు. ఇద్దరూ పనిలో పడ్డారు.చంద్రయ్య మూరెడు లోతు చెలమ తీశాడు. నీటి జాడ లేదు.అతడు దాన్ని వదలి పెట్టి, బారెడు దూరం ముందుకు వెళ్ళాడు. అక్కడ
మరో చెలమ తవ్వాడు. నీరు పడలేదు. చంద్రయ్య దాన్ని వదిలేసి మరికొంత ముందుకెళ్ళి , మరో చెలమ తీశాడు. తేమ చేతికి తగలలేదు. ఇలా అరకొరగా
ఓ పది చెలమలు తీశాడు. అరగంట గడిచింది. కానగ చెట్ల నీడల్లోంచి చంద్రమ్మపిలుపు వినిపించింది. 'నా చెలమలో నీరు పడింది రామా!

ఒక్కటి చాలు
Reviewed by Smartbyte group
on
July 08, 2016
Rating:

No comments: