గణపతికి రాజుగారి దివాణంలో రెండు చేతులా ఆర్జించడానికి వీలైన ఉద్యోగం
వచ్చింది. అది గ్రహించి ఒక సంపన్నుడు అతనికి తన కూతురినిచ్చి ఘనంగా పెళ్ళిచేసి,
అంతులేని కట్నాలూ, కానుకలూ ఇచ్చాడు.
అయితే గణపతి భార్య శ్యామల కాపురానికి వస్తూనే తన భర్త లంచాలు
పట్టడని తెలుసుకున్నది. ఆమె ఎంత పోరినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ప్రాణం
విసిగి ఆమె తన పుట్టింటికి ప్రయాణమయింది. గణపతి ఆమెతో,"నేను లంచాలు తీసుకుంటే
నాతో కాపురం చేస్తావా?" అన్నాడు.
చేస్తానన్నది శ్యామల.
"అయితే నువు మీ పుట్టింటినుంచి వచ్చేటప్పుడు మీ నాన్న తినే బంగారు
కంచం తీసుకురా!" అన్నాడు గణపతి.
"ఎందుకు? నేను తెచ్చిన సారె చాల్లేదా? అయినా వాళ్ళు ఎందుకిస్తారు?
ఇయ్య్రు!" అన్నది శ్యామల.
"అయితే దొంగిలించుకురా!" అన్నాడు గణపతి.
"నా తండ్రి సొత్తు నేను దొంగిలించనా! మీకు మతిపోయిందా?" అన్నది శ్యామల.
"లంచం తీసుకోవడం అంటే నాకు అలాంటిదే. రాజు నా తండ్రి లాంటివాడు. ఆయనకు
తెలియకుండా లంచం తీసుకోవడం దొంగతనం అవుతుంది" అన్నాడు గణపతి. శ్యామల ప్రయాణం
మానుకున్నది. మళ్ళీ ఎన్నడూ లంచాలు తీసుకోమని గణపతిని పీడించలేదు శ్యామల.
ఉన్నదాంతో సంతృప్తిగా జీవించసాగారా దంపతులు.

అమ్మ చెప్పిన నీతి కధ
Reviewed by Smartbyte group
on
July 06, 2016
Rating:
Reviewed by Smartbyte group
on
July 06, 2016
Rating:

No comments: