అది మన దేశంలోనే ఒక మారుమూలన ఉన్న ఓ కుగ్రామం. అప్పటికి ఆ వూళ్ళో యింకా 'అద్దం'అనేది తెలియదు. ఇలా ఉండగా ఆ వూరికి బాగా నాగరికత గల ఒక వూరి నుంచి ఒక వ్యక్తి ఏదో పని మీద వచ్చాడు.పొరపాటున అతడు ఉపయోగించే అద్దం అక్కడే పడిపోయింది.
ఆ దారంట వెళ్తున్న ఒక రైతు ఎండలో తళతళ మెరుస్తున్న ఆ అద్దాన్ని ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకున్నాడు. అప్రయత్నంగా అతని ముఖం ఆ అద్దంలో కనిపించింది. అతడు ఎంతో సంతోషించి, 'ఇది మా
తండ్రిగారి చిత్రంలా ఉంది. ఆయన చనిపోయి ఎంతో కాలమైనా యింకా నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే తన బొమ్మను నా కోసం యిక్కడ జారవిడిచాడు. దీన్ని ప్రాణప్రదంగా పదిలపరచుకుంటా' అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక ఆ రైతు ఆ అద్దం సంగతి తన భార్యకు చెప్పకుండా దాన్ని రహస్యంగా దాచి పెట్టాడు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తనకు వీలు చిక్కినప్పుడల్లా ఆ అద్దాన్ని చూసి, అందులోని ప్రతిబింబాన్ని భక్తిగా ముద్దు పెట్టుకునేవాడు.
ఒకసారి అతని భార్య అనుకోకుండా ఆ అద్దాన్ని చూడనే చూసింది. అందులో ఆమె తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అందులో ఒక స్త్రీ ముఖం కనిపించడంతో ఆమె అగ్గిమీద గుగ్గిలంలా మండిపడింది.'అబద్దాల కోరు, మోసగాడా! నువ్వీప్పుడూ నన్నే ప్రేమిస్తున్నావని చెప్తావు. కానీ రహస్యంగా మరొక అందవికారమైన స్త్రీని ప్రేమిస్తున్నావు' అంటూ నానా రభస చేసింది.
"నువ్వనేది తప్పు ,అది స్త్రీ బొమ్మ కాదు, అది చనిపోయిన మా నాయన గారి బొమ్మ. మూర్ఖంగా అబద్దాలాడకు" అంటూ తానూ గట్టిగా అరిచాడు.
అదే సమయానికి అటుగా వెళ్తున్నా ఒక ఆలయ పూజారి ఆ గొడవ విని 'ఏం జరిగిందో
తెలుసుకుందామని' లోపలికి వచ్చాడు. ఆ రైతు, అతని భార్య ఆ పూజారికి నమస్కారం చేసి ఆ అద్దం గురించి చెప్పారు. ఆ పూజారి ఆ దర్పణాన్ని చేతిలోకి తీసుకుని అందులో తన ప్రతిబింబాన్ని చూశాడు. చిరునవ్వు నవ్వి "మీ ఇద్దరూ చెప్పేది తప్పే, ఇది ఆయన తండ్రి బొమ్మ గానీ, మరొక స్త్రీ బొమ్మ గానీ కాదు. ఇది మా వంశానికి చెందిన పూర్వకాలపు పూజారి చిత్రం. దీన్ని తీసుకెళ్ళి మా యింట్లో గోడకు తగిలించి రోజూ పూజలు చేస్తా" అంటూ ఆ అద్దాన్ని తీసుకుని చక్కా వెళ్ళిపోయాడు.
ఆ దారంట వెళ్తున్న ఒక రైతు ఎండలో తళతళ మెరుస్తున్న ఆ అద్దాన్ని ఆశ్చర్యంగా చేతిలోకి తీసుకున్నాడు. అప్రయత్నంగా అతని ముఖం ఆ అద్దంలో కనిపించింది. అతడు ఎంతో సంతోషించి, 'ఇది మా

ఒకసారి అతని భార్య అనుకోకుండా ఆ అద్దాన్ని చూడనే చూసింది. అందులో ఆమె తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అందులో ఒక స్త్రీ ముఖం కనిపించడంతో ఆమె అగ్గిమీద గుగ్గిలంలా మండిపడింది.'అబద్దాల కోరు, మోసగాడా! నువ్వీప్పుడూ నన్నే ప్రేమిస్తున్నావని చెప్తావు. కానీ రహస్యంగా మరొక అందవికారమైన స్త్రీని ప్రేమిస్తున్నావు' అంటూ నానా రభస చేసింది.
"నువ్వనేది తప్పు ,అది స్త్రీ బొమ్మ కాదు, అది చనిపోయిన మా నాయన గారి బొమ్మ. మూర్ఖంగా అబద్దాలాడకు" అంటూ తానూ గట్టిగా అరిచాడు.
అదే సమయానికి అటుగా వెళ్తున్నా ఒక ఆలయ పూజారి ఆ గొడవ విని 'ఏం జరిగిందో
తెలుసుకుందామని' లోపలికి వచ్చాడు. ఆ రైతు, అతని భార్య ఆ పూజారికి నమస్కారం చేసి ఆ అద్దం గురించి చెప్పారు. ఆ పూజారి ఆ దర్పణాన్ని చేతిలోకి తీసుకుని అందులో తన ప్రతిబింబాన్ని చూశాడు. చిరునవ్వు నవ్వి "మీ ఇద్దరూ చెప్పేది తప్పే, ఇది ఆయన తండ్రి బొమ్మ గానీ, మరొక స్త్రీ బొమ్మ గానీ కాదు. ఇది మా వంశానికి చెందిన పూర్వకాలపు పూజారి చిత్రం. దీన్ని తీసుకెళ్ళి మా యింట్లో గోడకు తగిలించి రోజూ పూజలు చేస్తా" అంటూ ఆ అద్దాన్ని తీసుకుని చక్కా వెళ్ళిపోయాడు.
అద్దం కధ
Reviewed by Smartbyte group
on
July 06, 2016
Rating:

No comments: