ఎద్దు పాలు

                 అక్బర్ ఆస్థానంలో చతురుడు,సమయస్పూర్తికల బీర్బల్‌ ఉన్నాడు.ఒకసారి బీర్బల్‌ను పిలిచి ఒక వారం రోజుల్లో నాకు ఎద్దుపాలు తెప్పించు,లేనిచో కారాగారం తప్పదు అన్నాడు అక్బర్‌.
                 "ఎద్దుపాలు", అదీ వారం రోజుల్లో ఎలా సాధ్యం. సాహసించి అక్బర్‌తో చెప్పే ధైర్యం లేదు, నీరసంగా ఇంటిముఖం పట్టాడు బీర్బల్‌, ఎండ మండిపోతుంది. గొంతు దాహంతో పిడచ కట్టుక పోతుంది. బీర్బల్‌ ఇల్లు
చేరి మంచి నీళ్ళు తాగి, కూర్చున్నాడు. భార్య వచ్చి ఏమండి, ఏంటి అలా ఉన్నారు అని అడిగింది. ఆలోచనలో ఉన్న! ఎలా చెప్పను అక్బర్ చక్రవర్తి వారం రోజుల్లో "ఎద్దు పాలు" తెమ్మన్నాడు లేనిచో ఖైదు చేస్తానన్నాడు.
అంటూ భార్యతో అసలు విషయం చెప్పాడు అక్బర్.
                  భార్య ఆశ్చర్యపడి ఏంటీ "ఎద్దు పాలు కావాలంటా? అని ఆలోచించింది. బీర్బల్‌ భార్య సమయస్పూర్తిగా, ఆలోచించగలదు, బీర్బల్‌ కూడా ఎలాంటి సమస్యనైనా భార్యతో చెప్పి సలహాలు తీసుకుంటాడు. బీర్బల్‌ భార్య ఆలోచించి, "మీరు బయటకు రాకండి. ధైర్యంగా ఉండండి.ఎద్దు పాలు నేను తెస్తాను" అంటూ బీర్బల్‌తో చెప్పి ఇడిచిన బట్టలు ఓమూట కట్టుకుని బయలుదేరింది. అంతహ్ పురానికి వెళ్ళేదారిలో ఓపెద్ద చెరువు ఉంది ఆ చెరువు దగ్గరకు వెళ్ళి మురికి బట్టలు ఉతుకుతూ ఏడుస్తుంది పెద్ద పెట్టున.
                    అంతహ్ పురానికి వెళ్తున్న రాజభటులు ఆమెను చూసి చెరువు దగ్గరకు వచ్చి "ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు?నీకు ఏమి కష్టం వచ్చింది? మాతో చెప్పు" అని బీర్బల్‌ భార్యను అడిగారు. "అయ్యా మావూరి మునసబు కొడుక్కి మగ పిల్లాడు పుట్టాడు ఆ మైల బట్టలు ఉతుకుతున్నాను, ఎంత ఉతికినా తరగటం లేదు" అంటూ పెద్ద పెట్టున
రోదించింది బీర్బల్‌ భార్య. ఆశ్చర్యంగా చూశారు భటులు. ఆమెను అంతహ్ పురానికి తోడ్కొని పోయ్యారు. మహరాజా! "మునసబు కొడుక్కి మగ పిల్లాడు పుట్టాడట ఆ బట్టలు ఉతకలేక ఏడుస్తున్నానని అంటుందీమె" అని అంటూ ఆమెను రాజుగారి ముందు ప్రవేశపెట్టరు రాజభటులు. రాజు భిన్నుడై ఏమ్మా "మగ వాళ్ళు ఎక్కడైనా పిల్లల్ని కంటారా? ఏంది? ఏమిటి నాటకం" గద్దించారు అక్బర్‌. మహరాజా! ఎద్దు, పాలు ఇవ్వగాలేంది మగాడు పిల్లల్ని కంటే తప్పేంటి అని అక్బర్‌తో అడిగింది బీర్బల్ భార్య గడుసుగా......
                   క్రవర్తి అక్బర్‌కు తన తప్పేంటో తెలిసింది.బీర్బల్‌ విషయంలో తను చేసిన పొరపాటు అర్ధమైంది. వెంటనే భటులతో అక్బర్‌ చక్రవర్తి మీరు వెళ్ళి బీర్బల్‌ని తోడ్కొని రండు అంటూ ఆజ్ణాపించాడు.బీర్బల్‌ భార్య "క్షమించండి నేను బీర్బల్‌ భార్యనే అయితే ఎద్దు పాలు తెమ్మన్నారు. ఆయన బెంగెట్టుకున్నారు.అది చూడలేక మీకు నిజం తెలియజేయాలనే ఇలా వచ్చాను నేను బీర్బల్‌ భార్యను అంటూ తెలియచేసింది. అక్బర్‌
ఆవిడ చతురతకు ముగ్దుడై బీర్బల్‌, అక్బర్‌ దంపతులను మెచ్చుకొని సన్మానించాడు. బీర్బల్‌,ఆయన భార్యా సంతోషంగా ఇంటి ముఖం పట్టారు.
ఎద్దు పాలు ఎద్దు పాలు Reviewed by Smartbyte group on July 07, 2016 Rating: 5

No comments: