రంగయ్య ట్రైన్లో కునుకుతున్నాడు. వేలం పాట వాళ్ళొచ్చారు. 'అయిదొందల' దుప్పటికి 'యాభై సర్కారు పాట' అన్నారు. రంగయ్య వందన్నాడు. పాట నూటెనభై దగ్గర ఆగింది. వేలం పాట వాడు గిట్టదని దుప్పటి మడిచి లోపల పెట్టి అందరికీ 'అద్దాలు' గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ తరువాత కాశ్మీరు శాలువా, విమల్ షర్టింగ్, బొంబే డైయింగ్ సూట్ , అలా పది వస్తువులకు పది గిఫ్ట్లందుకున్నాడు రంగయ్య. చివరకు
ఓ డూప్లికేట్ పట్టుచీర మూడొందలకు వేలంపాడి ఊరుకున్నాడు. 'వేలంపాట' ఆసామి చీర రంగయ్య మీదకు విసిరి డబ్బులిమ్మన్నాడు. రంగయ్య తెల్లముఖం వేశాడు. "నా దగ్గర డబ్బుల్లేవు" అని తాను దిగవలసిన స్టేషన్లో దిగిపోదామని లేవబోతే వేలంవాళ్ళు బలవంతంగా రంగయ్యని పట్టుకుని అతని మొల తడిమి 'జాలి'లో అయిదు వందలు తీసుకొని రెండొందలు చేతిలో పెట్టి, రెండు మొత్తి కిందకి తోసేసారు.
మారుమాటాడకుండా రైలు దిగిపోయాడు రంగయ్య. రైలు వెళ్ళిపోయింది. 'హమ్మయ్య' అని
ఊపిరి పేల్చుకున్నాడతను.... వారం రోజులుగా చెల్లని అయిదొందల నోటు ఇప్పుడు చెల్లినందుకు!

మారుమాటాడకుండా రైలు దిగిపోయాడు రంగయ్య. రైలు వెళ్ళిపోయింది. 'హమ్మయ్య' అని
ఊపిరి పేల్చుకున్నాడతను.... వారం రోజులుగా చెల్లని అయిదొందల నోటు ఇప్పుడు చెల్లినందుకు!
హమ్మయ్య
Reviewed by Smartbyte group
on
July 07, 2016
Rating:

No comments: