అత్యాశ - నిరాశ

                         డాలీ అనే ఓ కుక్క పిల్ల తెల్లగా, బొద్దుగా ఉండేది. చూడటానికి ముద్దుగానూ ఉంటుంది. దానికి మాసం అంటే చాలా ఇష్టం. ఓసారి అది ఆహారం కోసం వెతుకుతుండగా ఒక మాంసం ముక్క దొరికింది. డాలి ఆనందపడి నోటితో దానిని పట్టుకుని పరుగుపెట్టింది. ఎక్కడో ప్రశాంతంగా కూర్చొని తినొచ్చని అనుకున్నది. మధ్యలో నీటి కాలువ ఎదురైంది.  
దాన్ని దాటుతుండగా దాని నీడ అందులో కనబడింది. దాని నోట్లో కూడా మాంసం ముక్క ఉన్నట్లు కనిపించింది. డాలీకి ఆ రెండో మాంసం ముక్కను కూడా తినాలనిపించింది. దాన్ని అందుకుందామని నీళ్ళలోకి మూతి పెట్టి నోరు తెరిచింది. కానీ, అక్కడ వేరే మాంసం ముక్క లేదు. పైగా నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీళ్ళలో పడి కొట్టుకు పోయింది. దాంతో డాలికి ఉన్నది పడిపోయింది,ఉంచుకున్నదీ పోయింది.

నీతి : పిల్లలూ! మనం కూడా ఉన్న దానితో సంతృప్తి పడాలి. అత్యాశకు పోకూడదు.
అత్యాశ - నిరాశ అత్యాశ - నిరాశ Reviewed by Smartbyte group on July 06, 2016 Rating: 5

No comments: