గజ్జెల సవ్వడి

గజ్జెల సవ్వడి :

అప్పుడు మేము నెల్లూరులో ఉండేవాళ్ళం.

                     ఓరోజు రాత్రి నిద్దట్లో ఎందుకో మెళకువ వచ్చింది.మళ్ళీ నిద్రపోవాలని
ప్రయత్నిస్తుండగా ఏదో సవ్వడి.ఆ శబ్దం మెల్లగా దగ్గరకు వస్తున్నట్టు అనిపించింది. దుప్పటి
ముఖమ్మీదకంటా కప్పేసుకుని మళ్లీ వినసాగా.అర్ధమయ్యింది....అది గజ్జెల చప్పుడు.ఎవరో నడుస్తున్నారు. కానీ ఇంత అర్ధరాత్రి ఎవరు నడుస్తారు! అదీ మా ఇంట్లో! మేమెవ్వరం
పట్టీలు పెట్టుకోం.మరి ఆ నడుస్తున్నది ఎవరు?

     తెల్లారి లేచి అమ్మానాన్నలకు  చెప్పా.అమ్మ కూడా చాలాసార్లు అలాంటి
 శబ్ధం విన్నదని చెప్పింది.దాంతో ఆ ఇల్లు ఏదో  తేడాగా ఉందని అర్ధమయ్యింది మాకు.
 ఆ రాత్రి నిద్రలో మళ్ళీ ఉలిక్కిపడి  లేచాను.ఎందుకంటే,వంటింటిలో ఏదో  కిందపడిపోయిన శబ్ధం వినిపించింది.భయంతో  గట్టిగా అరిచా.దెబ్బకి అందరూ లేచారు.నాన్న  వంటింట్లోకి వెళ్ళి స్టీలు గ్లాసు కిందపడి గిరగిరా  తిరుగుతోంది.పిల్లేమో అని అంతా  వెతికాం.కాదు.పిల్లి ఎక్కడా లేదు.మరి ఎవరు? ఇంకెవరు దయ్యమే!

            రోజులు ఇలానే గడుస్తున్నాయి. ఓ సారి అమ్మానాన్నలు ఊరెళ్ళారు.
రాత్రి పడుకునేటప్పుడు పక్కన నీళ్ళు పెట్టుకోవడం మర్చిపోయాం. చెల్లెలు మధ్యలో
లేచి నీళ్ళు ్కావాలని అడిగింది.గుండె చిక్కబట్టుకుని నీళ్ళ కోసం వంటింట్లోకి వెళ్ళాను.
గది తలుపు తోయగానే పై ప్రాణాలు పైనే పోయాయి.ఎవరో కుర్చీలో కూర్చుని ఉన్నారు.
అంతే,నీళ్ళూ లేవు,నిప్పులూ లేవు.పరుగే పరుగు. బెడ్ రూం లోకి వచ్చి గడియ పెట్టేశాను.
దాంతో ఇక అక్కడ ఉండడం సేఫ్ కాదనిపించి ఇల్లు మారిపోయాం.అంతా హ్యాపీస్
అనుకున్నా.అంతలో మా బాబాయ్‌ వాళ్ళ ఫ్యామిలీ నెల్లూరుకు షిఫ్టయ్యారు.మాకు కాస్త
దూరం లో ఒక ఇల్లు తీసుకున్నారు. ఓరోజు అక్కడ వాళ్ళతో గడుపుదామని అందరం
వెళ్ళాం. బాబాయ్,పిన్ని ,అమ్మ ,నాన్న కలసి ఎక్కడికో వెళ్ళారు. వచ్చేసరికి లేటవుతుంది,
నిద్రపొమ్మని చెప్పారు.నిజం గానే వాళ్ళు పదకొండవుతున్నా రాలేదు.దాంతో మేం పడకలు
చేరాం.నిద్ర పడుతూండగా బాబాయ్ కూతురు కెవ్వున కేక వేసింది. అది నన్ను పట్టుకుని
గట్టిగా ఏడవడం మొదలెట్టింది. 'నా జుట్టు పీకేస్తుంది , నన్ను చంపేస్తుంది' అంటూ గొడవ
చేయసాగింది.ఎవరు అంటే... దయ్యం, అదిగో అక్కడుంది,తెల్లగా ఉంది,నన్ను చంపేస్తుంది
అంటూ ఒకటే ఏడుపు.దానికి కనిపిస్తుంది,మాకు కనిపించదేం! అందరం ఒకళ్ళనొకళ్ళం
పట్టుకుని వణికిపోతున్నాం.అంతలో పెద్దవాళ్ళు వచ్చేశారు.

         చెమటలు కక్కుతూ వణుకుతున్న మమ్మల్ని చూసి కంగారు
పడిపోయారు.అంతా చెప్పాక బాబాయ్ తీరిగ్గా చెప్పాడు.... వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చినప్పట్నుంచీ
అదే సమస్యట. ఆ పిల్ల నిద్దట్లో లేచి ఏడుస్తుందట. నా జుట్టు పీకేస్తుంది అంటుందట. అదిగో
అక్కడుంది అని చూపిస్తుందట. ఒక్కోసారి జ్వరం కూడా వచ్చేస్తుందట భయం తో .

         నాకు సీన్‌ మొత్తం అర్ధమయ్యింది. మా ఇంట్లో హారర్‌ స్టోరీ ముగిసిందిరా
బాబూ అనుకుంటే, ఇక్కడ మొదలయ్యిందన్నమాట. ఆ రోజు తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి
వెళ్తే ఒట్టు. అయినా విషయం తెలిశాక మళ్ళీ వెళ్తామా! చూస్తూ చూస్తూ దయ్యం నోట్లో
తల పెడతామా!

గజ్జెల సవ్వడి గజ్జెల సవ్వడి Reviewed by Smartbyte group on July 07, 2014 Rating: 5

No comments: