నిజమేనంటారా?
కోల్‌కతా లోని నగేర్ బజార్ జనసమ్మర్ధం ఉండే ప్రాంతం. బైక్ మీద వెళుతున్న
ఒక యువకుడు అక్కడి ఫ్లైవోవర్ మీద ప్రమాదానికి గురికావడంతో ఇప్పుడు ఆ ప్రాంతం రకరకాలుగా వార్తల్లోకి ఎక్కింది.అర్ధరాత్రి తరువాత ఫ్లైవోవర్ మీద బైక్ లు,కార్లు హఠాత్తుగా ఆగిపోతున్నాయట.ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ అర్ధరాత్రి దాటిన తరువాత నగే్ర్ బజార్ ఫ్లైవోవర్ మీది నుంచి వెళ్ళడానికి జనాలు భయపడుతున్నారు.
"ఎవరో ఆకతాయి పుట్టించిన పుకారు అది.అందులో వాస్తవం లేదు." అని ఒకవైపు
డమ్‌డమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రబీర్ చటర్జీ అంటుండగా మరోవైపు స్థానికులు మాత్రం ఫ్లైవోవర్ మీది నుంచి ఎవరో రాత్రివేళల్లో రాళ్ళు రువ్వుతున్నారని చెబుతున్నారు.
"ఇటీవల ఒక యువతికి ఫ్లైవోవర్ మీద యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు ఆమెకు
వైద్య చికిత్స చేయించారు.కోలుకున్న తరువాత ఆమె చెప్పిన విషయాలు ఆశ్చర్య పరిచాయి.యాక్సిడెంట్ జరగడానికి ముందు తాను కొన్ని నీడలను చూశాను అని ఆమె చెప్పింది" తనకు వచ్చిన మెయిల్‌ను ఉటంకిస్తూ పారానార్మల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఅర్‌యస్‌ఐ) వ్యవస్థాపక సభ్యుడు కోటల్ చెప్పారు.
"మోషన్ డిటెక్టర్లు, స్పెషల్ సౌండ్ రికార్డర్ల తో సంఘటన స్థలం లో పరిశోధన
చేయాలనుకుంటున్నాం.అయితే దీనికి ముందు పోలీస్‌లు,లోకల్ కౌనిసిల్ నుంచి అనుమతి
లభించాల్సి ఉంది" అన్నారు శాంతన్ సేన్ అనే పీఅర్‌యస్‌ఐ సభ్యుడు.
"ప్రతి వింత సంఘటన పారానార్మల్ కాదు.తమ నేర కార్యకలాపాలను విస్తృతం
చేసుకోవడానికి కొందరు నేరస్థులు ఇలాంటి పుకార్లను పుట్టించడం,వింత సంఘటనలు జరిగేలా
ప్రయత్నిస్తూ ఉండవచ్చు" అన్నారు కోటల్.
ఏది ఏమైనా నగేర్ బజార్ ఫ్లైవోవర్ కధలు మాత్రం ఆగడం లేదు. రోజుకో
వింత కధ వినిపిస్తూనే ఉంది!
Please comment on this post
నిజమేనంటారా?
Reviewed by Smartbyte group
on
June 13, 2014
Rating:

No comments: