తలుపు చప్పుడు చేసేది ఎవరు?



తలుపు చప్పుడు చేసేది ఎవరు?

సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఎప్పటి నుంచో కల. అది జాబ్ రిటైర్మెంట్
తరువాత గానీ కుదరలేదు.కదిరిపాలెం లో ఉద్యోగం చేస్తున్నప్పుడు రిటైరయ్యాను.ఎవరో
ఒకాయన కాస్త చౌకగా అమ్మడంతో స్థలం కొన్నాను.వెంటనే ఇంటి నిర్మాణం ప్రారంభించాను.
కొద్దికాలానికి నా కల సాకారమైంది.

"సొంత ఇంట్లో ఉంటున్నాను" అనే భావన ఎంతో సంతోషాన్ని ఇచ్చేది.
కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.ఒకసారి టీ కొట్టు దగ్గర నారాయణ అనే వ్యక్తి
పరిచయం అయ్యాడు.

"మీరు ఈ ఊరికి వచ్చి ఎంతకాలం అయింది?" అని ఆదిగాడు.
"మూడు సంవత్సరాలు అవుతుంది " అని చెప్పాను.

"మూడు సంవత్సరాల్లో్ ఊరి గురించి ఏమి తెలుస్తుందిలే"అన్నాడు."అంటే?" అని అడిగాను. "ఈ విషయం మీకు చెప్పాలో లేదో తెలియదు కానీ చెప్పడం నా ధర్మం అనుకుంటున్నాను.ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్న స్థలం ఒకప్పుడు ఊరివాళ్ళు శ్మశానంగా ఉపయోగించేవారు.ఊళ్ళో ఎవరు చనిపోయినా అక్కడే దహనసంస్కారాలు నిర్వహించేవారు" అంటూ ఏదేదో చెబుతున్నాడు.ఆయన చెప్పింది విని నాకు గుండెల్లో రాయిపడినట్లయింది. "నేను విన్నది నిజమేనా?" అని ఒకరిని అడిగాను.

"నిజమేగానీ... ఈ కాలం లో అలాంటివి పట్టించుకోవద్దు" అన్నాడు ఆయన
తేలిగ్గా.మరోసారి నా గుండెల్లో రాయిపడింది!!  ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. "శ్మశానం లో
ఇల్లు కట్టుకున్నాం" అనే విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని నిర్ణయించుకున్నాను.చెబితే
వాళ్ళు ఏవేవో ఊహించుకుని భయపడిపోతారు.ఒకరోజు రాత్రి మా ఆవిడ నన్ను నిద్ర లేపి-

"అప్పటి నుంచి తలుపు చప్పుడవుతుంది.వెళ్ళి ఎవరో చూడు" అన్నది.
నేను నిద్ర నుంచి లేచి గోడ గడియారం వైపు చూశాను.అప్పుడు సమయం ఒకటిన్నర అవుతోంది.
              " ఈ సమయం లో ఎవరూ?" నాకు భయమేసింది. భయంభయం గానే వెళ్ళి తలుపు తీశాను.ఎవరూ లేరు. "తలుపు చప్పుడు చేసింది ఎవరూ?" అని గట్టిగా అరిచాను.
సమాధానం లేదు.వెళ్ళి పడుకున్నాను.

సరిగ్గా పదినిమిషాలకు మళ్ళీ తలుపు చప్పుడైంది.

మళ్ళీ తలుపు తీసి చూశాను.ఎవరూ లేరు.ఇలా ప్రతి పదినిమిషాలకు చప్పుడు కావడం , తలుపు తీస్తే ఎవరూ లేకపోవడం... ఆ రాత్రంతా నిద్రే లేదు.ఊళ్ళో వాళ్ళకు కొందరికి చెబితే 'అంతా మీ భ్రమ' అని విషయాన్ని తేలిగ్గా తీసేశారు.కొందరేమో"కుక్కలు చప్పుడు చేసి ఉంటాయి...అనవసరంగా భయపడుతున్నావ్" అన్నారు.
కొన్ని రోజుల వరకు మామూలుగా ఉంది.ఆ తరువాత మళ్ళీ అదే తంతు.
              ఈసారి మాత్రం సమయం మారింది.తెల్లవారుజామున మూడు గంటలకు తలుపు చప్పుడు అవుతోంది.
నిజంగానే తలుపు చప్పుడు అవుతోందా?
నేను భ్రమ పడుతున్నానా.
ఎవరో చెప్పింది విని ఏదేదో ఊహించుకుంటున్నానా?

                        Please comment on this post

     
తలుపు చప్పుడు చేసేది ఎవరు? తలుపు చప్పుడు చేసేది ఎవరు? Reviewed by Smartbyte group on June 07, 2014 Rating: 5

No comments: