నిను వీడని కుక్కను నేనే!
అతీతశక్తులు,వింతసంఘటనల గురించి ఎప్పుడూ వినడమేగానీ అవి ఎప్పుడూ
నా అనుభవం లోకి రాలేదు.కొన్నిరోజుల క్రితం మాత్రం కొన్ని వింత అనుభవాలను ఎదుర్కొన్నాను.
ఆరు నెలల క్రితం మా పెంపుడు కుక్క మోతీ అనారోగ్యంతో చనిపోయింది.మోతీ అంటే నాకు చాలా ఇష్టం .నేను ఎటువెళితే అటు వచ్చేది.ఒక విధంగా చెప్పాలంటే నేను లేకుండా ఉండేదికాదు.
మోతీ చనిపోవడంతో నేను బాగా కుంగిపోయాను.
ఎప్పుడూ మూడీగా ఉండేవాడిని.
"కుక్క చచ్చిపోతే ...ఎవరో మనిషి చనిపోయినట్లు ప్రవర్తిస్తావేమిటి?" అని అందరూ
తిట్టడంతో నేను గాడిలో పడ్డాను.మోతీకి సంబంధించిన జ్నాపకాలు మాత్రం నన్ను విడిచిపోలేదు.
ఒక రోజు పొరుగూరు వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడానికి ముందు ఒక వేప చెట్టు దగ్గర మోతీ కనిపించింది. నేను అక్కడికి వెళ్ళేసరికి అది మాయమైపోయింది.మరోరోజు నేను బస్ లో వెళుతున్నాను. విండో సీటులో కూర్చున్నాను.
కొంతసేపటి తరువాత ఒక కుక్క బస్సు వెంట పరుగెత్తుకు రావడం కనిపించింది.నేను జాగ్రత్తగా పరిశీలించి చూశాను. సందేహం లేదు...అది మోతీ!
బస్సు దిగుదామనుకునే లోపు అది కనిపించలేదు.
మోతీ కి సంబంధిచిన రకరకాల వింత అనుభవాలను ఎవరికి చెప్పినా నమ్మడం
లేదు. ఇలాంటి విషయాలు నాకు ఎవరైనా చెప్పినా నేను నమ్మేవాడిని కాదేమో!
"నువ్వు మానసిక భ్రాంతిలో ఉన్నావు" అంటున్నారు బంధువులు. నిజమో
అబద్ధమో నాకైతే తెలియడం లేదు!
Please comment on this post
నిను వీడని కుక్కను నేనే!
Reviewed by Smartbyte group
on
June 06, 2014
Rating:

No comments: