మర్రిచెట్టు కింద కెవ్వ్ కేక !
చదువుల కోసం పట్నం వెళ్ళినా... నా మనసంతా పల్లె మీదే ఉండేది.ఎప్పుడెప్పుడు సెలవలు వస్తాయా? అనే ఆశగా ఎదురుచూసేవాడిని.ఏదో పండగ సందర్భంగాకాలేజీకి సెలవు రావడంతో మా పల్లెకు వెళ్ళాను.
" సరదాగా జొన్న చేనుకు కాపలా వెళతావా?" అని నాన్న అడగడంతో ఎగిరి గంతేశాను.ఎందుకంటే నాకు పంటపొలాలు అంటే విపరీతమైన ఇష్టం. ఆ రాత్రి మాఫ్రెండ్స్ తో కలసి జొన్న చేనుకు కాపలా వెళ్ళాను.
పట్టణపు కాలుష్యానికి విసిగిపోయిన నాకు ఆ ప్రశాంత వాతావరణం తెగ నచ్చేసింది.వెన్నెల వెలుగులో జొన్న చేను చూడడానికి చాలా అందంగా ఉంది. ఫ్రెండ్స్ ,నేను కలసి మంచె ఎక్కాం. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం.పాటలు పాడుకున్నాం.అప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది.
"ష్... వినబడుతోందా?" అన్నాడు ఫ్రెండ్ హఠాత్తుగా. "ఏమిటి? అన్నాను గొంతు తగ్గించి.
"జాగ్రత్తగా విను... ఎవరో భయంకరంగా కేకలు పెడుతున్నారు" అన్నాడు. అవును.నిజమే. కేకలు వినబడుతున్నాయి. 'నాశనమైపోతారు' అని అరుస్తున్నారు.
మేము ధైర్యం తెచ్చుకొని అరుపులు వినిపిస్తున్న వైపు టార్చిలైట్ వేసి చూశాం. ఎవరో పరిగెట్టినట్లు అనిపించింది. ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.రెండోరోజు కూడా ఫ్రెండ్ తో చేను కాపలాకు వెళ్లాను.అర్ధరాత్రి తరువాత మళ్ళీ అవే అరుపులు.ఇలా వరుసగా మూడు రోజులు జరిగింది.
ఆ కేకలు, అరుపులు విని మాకు భయమనిపించలేదు గానీ మిస్టరీగాఅనిపించింది.దాన్ని చేదించాలనిపించింది.
ఆరోజు ఇద్దరం కలిసి పగటి సమయం లో చేను దగ్గరికి వెళ్ళాం.ఆ కేకలు వినిపించిన స్థలం వైపుగా వెళ్ళాం.అక్కడడొక పెద్ద మర్రిచెట్టు ఉంది.చుట్టుపక్కల వెదికాం.ఎవరూ లేరు.మర్రి చెట్టు కింద ఒక వైపు మాత్రం మూడు పుర్రెలు కనిపించాయి! వీటికి, ఆ అరుపులకు ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా??!!
ఉందనిపిస్తే నాకు మెయిల్ చేయండి నా మెయిల్ ఐడి cinelegend2014@gmail.com or comment on this post
మర్రిచెట్టు కింద కెవ్వ్ కేక !
Reviewed by Smartbyte group
on
June 06, 2014
Rating:

No comments: