అర్ధరాత్రి పూట ఆ నవ్వులు ఎక్కడివి?



అర్ధరాత్రి పూట ఆ నవ్వులు ఎక్కడివి?

           కాలం తో పాటు అన్నీ మారుతాయంటారు. కానీ ఒక ఇల్లు నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. ఆ ఇంటి చుట్టుప్రక్కల పెద్దపెద్ద బిల్డింగులు , అందమైన ఇళ్ళు .
 ఆ ఇళ్ళు మాత్రం శ్మశానకళ ఉట్టిపడుతూ అలాగే ఉంది. ఆఇంటి చుట్టుప్రక్కల స్థలం  ఖరీదు కళ్ళు బైర్లు కమ్మే స్థాయిలో ఉంది. ఆ ఇంటిని మాత్రం కొనే దిక్కు లేదు.
ఎందుకంటే ఆ ఇల్లంటే అందరికీ భయం.
ఎందుకు భయం?

నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు ఇవి. ఆ ఇంట్లో భార్య భర్తలు ,వారి కొడుకు శ్రీను ఉండేవాడు .ఇతడి మానసిక స్థితి బాగుందేది కాదు .
తల్లిదండ్రులకు అతనంటే విపరీతమైన ప్రేమ. ఏమైందో ఏమో గానీ ఒక రోజు రాత్రి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంటే 
ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది. 

వాళ్ళ ఇంటి ముందు పెద్ద వేపచెట్టు ఉంది. ఆ చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. " పిచ్చిపిల్లాడు ఉరి వేసుకుని చనిపోయడట" అని 
ఊరంతా సంఘటన స్థలానికి పరుగులు తీసింది. ఊరి వాళ్ళంతా ఆ దంపతులను ఓదార్చారు. ధైర్యం చెప్పారు. కానీ ఇదేమీ వారి మీద ప్రభావం చూపలేకపోయింది.

వారం రోజుల తరువాత శ్రీను వాళ్ళమ్మ అదే చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయింది. ఆమె భర్త గుండెలు పగిలిపోయాయి. కొడుకు , భార్య ఆత్మహత్య చేసుకోవడంతో శ్రీను వాళ్ళ నాన్న తట్టుకోలేకపోయాడు. పిచిపట్టింది. ఇక అప్పటి నుంచి ఎక్కడ తింటున్నాడో , ఎక్కడ పడుకుంటున్నాడో తెలియదు.
ఆ ఇంట్లోకి మాత్రం వెళ్ళేవాడు కాదు. కొంతకాలం తరువాత ఆయన కూడా అదే చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు! ఊరి పెద్దలు ఇంటికి తాళం వేశారు.

వేసవికాలం లో ఆరుబయట పడుకోవడం ఊరివాళ్ళ అలవాటు. ఆ వేసవి కూడా అందరూ బయట మంచాలు వేసుకుని పడుకున్నారు.

ఒక అర్ధరాత్రి పూట ఆ ఇంటి నుంచి నవ్వులు , ఏడుపులు వినిపించాయి. అది విని నిద్రలో నుంచి మేల్కొన్నవాళ్ళు నిద్రపోతున్న వాళ్ళను లేపారు. 

" నిజమా?" అని వాళ్ళు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే ఆ విచిత్రమైన నవ్వులు , ఏడుపులు మళ్ళీ వినిపించాయి. అలా ఆ రాత్రి మొత్తం అందరూ భయం భయంగానే గడిపారు. మరుసటి రోజు ఆ నవ్వులు , ఏడుపుల సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే మట్లాడుకోవడం.

        ఆ " తాళాలు పగలగొట్టి లోపల ఏం ఉందో చూద్దాం " అన్నారు కొందరు. " అలాచేస్తే....లోపల ఉన్న దుష్టశక్తులు బయటకి వస్తాయి. ఊరివాళ్ళను వేధిస్తాయి " 
అన్నారు మరికొందరు. చివరికి గది తలుపులు తెరవద్దనే నిర్ణయం జరిగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ ఇంటి తాళాలు తెరవనేలేదు.


అర్ధరాత్రి పూట ఆ నవ్వులు ఎక్కడివి? అర్ధరాత్రి పూట ఆ నవ్వులు ఎక్కడివి? Reviewed by Smartbyte group on June 02, 2014 Rating: 5

No comments: