మా అమ్మమ్మ మళ్ళీ వచ్చింది


మా అమ్మమ్మ మళ్ళీ వచ్చింది :-
           ప్రస్తుతం నా వయస్సు 14 సంవత్సరాలు .గత సంవత్సరం13 సంవత్సరం లో మా అమ్మమ్మ చనిపోయింది . సమయం లో నేను చాలా బాధపడ్డాను.దేవుని మీద చాలా కోపం వచ్చింది కూడా .మా అమ్మమ్మ దహన క్రియ ముగిసిన రెండు వారాల తరువాత ఒక రోజు నా రూం లో కూర్చొని నా హోం వర్క్ చేసుకుంటున్నాను. దాని మీద మనసు లగ్నం చేయలేకపోతున్నాను. చాలా చిరాగ్గా అనిపించింది. సమయం లో నేను ఒక స్వరం విన్నాను.
           నేను ముందుగా మా అమ్మ అనుకుని బదులు పలికి తను ఏం చెబుతుందా అని చూస్తున్నాను .కాని నాకు ఇంతకు ముందే మా అమ్మ మార్కెట్ కి వెళ్ళిన విషయం గుర్తొచ్చింది .ఒకవేళ మా చెల్లి గాని పిలిచిందేమో అనుకుని తనతో చెప్పాను నన్ను భయపెట్టొద్దని.ఆమె తన బుక్స్ తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెల్లిపోయింది . తరువాత 5 నిముషాల వరకూ అంతా ప్రసాంతంగా ఉంది .తర్వాత మళ్ళీ స్వరం వినిపించింది సారి కనిపించింది .  అక్కడ మా అమ్మమ్మ నించొని ఉంది .తన దహనక్రియలో వేసుకున్న బట్టలు ఆభరణాలతో ,అది నా కలేమోననుకొని కళ్ళు రెండూ రుద్దుకుని మళ్ళీ  చూసాను
            ఆమె మా గది తలుపు దగ్గర నించొని నవ్వుతూ రెండు చేతులు చాచి నా దగ్గర గా వస్తూ ఉంది .నాకు చాలా భయం వేసింది .నేను ఏమీ చేయలేకపోయాను .కాని అక్కడే భయంతో కూర్చున్నాను తరువాత ఆమె కనిపించకుండా వెళ్ళిపోయిందిు.నేను వెంటనే లేచి పరుగున వెళ్ళి రూం తలుపు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడే కూర్చొని  ఉండిపోయాను. నేను ఒక గంట వరకూ భయం తో అలానే కూర్చొని ఉండిపోయాను. మా అమ్మ వాళ్ళు వచ్చి నన్ను వెతికి లైట్స్ అన్నీ వేసి నన్ను చూసే వరకూ .
                తరువాత మళ్ళీ నేను నా బెడ్ దగ్గరికి వెల్తున్నాను ముందు జరిగిన సంఘటన గురించి మొత్త్తం మర్చిపోయాను.నేను నా బెడ్ మీద కు వెల్లి పడుకుని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్నాను .అప్పుడే నా డ్రెస్సింగ్ టేబుల్ మీద నుంచి ఏదో పడినట్టు అనిపించి అక్కడకు వెళ్ళాను.నా ద్రాయింగ్ షీట్ తీసి పైన పెట్టబోయాను కానీ ఖాలీ పేపర్ లో వాటంతట అవే కొన్ని అక్షరాలు వస్తూ కనిపించాయి  మా అమ్మమ్మ చేతి వ్రాతతో.బైబుల్ లోని ఒక వాక్యం అక్కడ ప్రత్యక్షమైంది ." భయం తో కూడిన జీవితం బ్రతకకూడదు" అనే వాక్యం కనిపించింది.
                2 తిమోతికి 1:7
                 దేవుడు మనకు శక్తియు ,ప్రేమయు ,ఇంద్రియ నిగ్రహము గల అత్మతో యిచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు
                అప్పటి నుంచి నాకు నచ్చిన వాక్యం అదే .Please comment on this post
మా అమ్మమ్మ మళ్ళీ వచ్చింది మా అమ్మమ్మ మళ్ళీ వచ్చింది Reviewed by Smartbyte group on June 02, 2014 Rating: 5

No comments: