నీడ ఆకారాలు :-
రెండు మూడు సంవత్స్రరముల క్రితం నేను మా నాన్న గారి ఇంట్లో ఉండేటప్పుడు మొట్ట మొదటిగా చూసా ఈ నీడ ఆకారాన్ని.అప్పుడు సమయం రాత్రి9 అవుతుంది నా పని అంతా ముగించుకుని నా రూం కి వెళ్ళి మా వారి కోసం ఎదురు చూస్తు పడుకుని కళ్ళు మూసుకున్నాను.అప్పుడే నాకు నన్నెవరో చుస్తున్న భావన కలిగింది .నేను నా కళ్ళు తెరచి చుసేసరికి నా ఎదురుగా ఒక మనిషి నీడ ఆకారం ,నాకు తెలుసు నేను చుస్తుంది ఏ వస్తువునో కాదు ఎందుకంటే బయట హాల్ల్ లోని లైట్ వెలుగు నా రూం లోకి వస్తుంది .నేను భయపడి అలా దాన్నిచూస్తూనే ఉండి పోయా ఒక 30 సెకన్ల వరకూ.నేను కనురెప్ప మూసి తెరచే సరికి అది మాయమైపోయింది.
అదే నాకు ఎదురుపడిన మొట్టమొదటి సంఘటన కాని అదే చివరి అనుభవం కాదు .కొన్ని వారాల క్రితం నేను వంట గదిలో గిన్నెలు కడుగుతూ ఉండగా మళ్లీ అదే భావం నన్నెవరో చూస్తున్నట్టూ,గమనిస్తున్నట్టూ... నేను నెమ్మదిగా నా భుజం మీద నుంచి వెనక్కు తలత్రిప్పి చూడగా మళ్ళీ అదే భారీ నీడ నన్ను చూస్తూవుంది.నేను భయపడి వెనక్కు తిరగగానే అది మాయమైపోయింది
నా ఒక్క దానికే అటువంటి అనుభవం కలుగలేదు .నా చెల్లి కి కూడా ఇటువంటి సంఘటన ఎదురైందని నాతో చెప్పింది .మా ఇద్దరికి అలాంటి అనుభవమే కలిగింది .కాని రెండింటికి తేడా ఏమిటంటే తనకెప్పుడూ అలాంటి భావన (ఎవరో తనను వెంబడిస్తున్నట్టు )కలుగుతుంది కాని నాకు ఎప్పుడో ఒకసారి అలాంటి భావన కలుగుతుంది.
కాని నాకు బాగా గుర్తొస్తుంది .ఆ సంఘటనలు జరిగినప్పుడు తన రూం మొత్తం చల్లగా మరియు నా రూం ంప్త్తం వేడిగా అయిపోతుంది బయట వాతావరణం ఎలా ఉన్నా,AC ఆన్ లో వున్నా సరే.
నేను నీడ ఆకారాల మీద కొంచెం పరిశోధన చేసాను.కాని నాకు వీటి గురించి కావలసినంత సమాచారం దొరకలేదు.
నేను చాలా పుస్తకాల్లో చూసాను అలాగే చాలా మందిని అడిగాను ఇటు వంటి సంఘటనల గురించి నాకు తెలిసింది ఏమిటంటే ఈ నీడ ఆకారాలు ఒక్కొక్కరికీ కనిపిస్తాయట.ఇంతకంటే ఏమీ వాటి గురించి తెలియలేదు.మీకు దీని గురించి తెలిసినా మీకు ఇటువంటి సంఘటనలు ఎదురైనా నాకు రాసి పంపండి .
నా మెయిల్ చేయండి నా ఐడి cinelegend2014@gmail.com or comment on this post
నీడ ఆకారాలు
Reviewed by Smartbyte group
on
June 02, 2014
Rating:
Reviewed by Smartbyte group
on
June 02, 2014
Rating:

.gif)
No comments: