ఆత్మ ఆవహించిన మంచం



ఆత్మ ఆవహించిన మంచం :-
                6 సంవత్సరాల క్రితం పై చదువుల కోసం మా అత్తయ్య వాళ్ల ఇంట్లో ఉండాల్సివచింది. ఇంట్లో మా అత్తయ్య నేను మాత్రమే ఉండేవాళ్ళం. నేను ఉండడానికి మా అత్తయ్య నా కోసం ఒక రూం చూపించింది.రూం చూడడానికి చాలా అందంగా ఉంది. రంగురంగుల పుస్తకాలతో సర్దిన కబోర్డ్ ,క్రొత్త fan ,T.v . కానీ ఒక పాత మంచం దాన్ని ఎందుకు మార్చలేదో  అర్ధం కాలేదు.
                మొదట రోజు రాత్రి దాని మీద పడుకుని నిద్రపోతున్నాను.నిద్రలో ఉండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఎందుకంటే నేను ఒక ముసలి ఆవిడ ఏడుపు వినిపించింది. నేను అటూ ఇటూ చూసాను. ఎవరూ కనిపించలేదు. గొంతు నాతో" నువ్వు ఎందుకు వచ్చావ్ నువ్వు నా మీద పడుకున్నావ్ నాకు చాలా నొప్పిగా ఉంది" అని అంది. నేను చాలా భయపడ్డాను. నేను రాత్రి అంతా కుర్చీలో కూర్చునే గడిపాను .
                తరువాతి రోజు ఉదయం మా అత్తయ్య నా దగ్గరికి వచ్చి నిద్ర బాగా పట్టిందా నేకు రూం బాగుందా అని అడిగింది. నేను మా అత్తయ్య తో రాత్రి జరిగిన దాని గురించి ఏమీ  చెప్పదలచుకోలేదు. ఎందుకంటే అదేదో పీడకలేమో అనిపించింది. అందుకే మా అత్తయ్య తో అంతా బాగుంది అని చెప్పాను. కానీ నాకు మాత్రం అస్సలు నచ్చలేదు కానీ వేరే అవకాశం లేదు. కొన్ని రోజుల తరువాత మా అత్తయ్య  స్నేహితుడు ఒకాయన మా ఇంటికి వచ్చాడు. ఆయన నాతో నీరూం లో ఉన్న మంచం ఎలా ఉంది. అది మీ అత్తయ్య నేను ఒక ఆశ్రమం  నుండి కొన్నాం  అని చెప్పారు . నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. రోజు రాత్రి మంచం మొత్తాన్ని శుభ్రం చేయాలనుకున్నాను.
                మంచం క్రింద సన్నని వెడల్పాటి మూడు సరుగులు ఉన్నాయి. అవి తీసి చూసేసరికి దాని నిండా చాలా గ్రీటింగ్ కార్డ్స్,ఉత్తరాలు ఉన్నాయి. నేను అశ్చర్యపోయాను. ఆమె చాల రోజుల నుంచి canser  వ్యాధితో బాధపడుతూ చనిపోయింది. ఉత్తరాలు ఆమె పిల్లలకి ఆమె వ్యాధి గురించి,వయస్సు గురించి వ్రాసినవి.
                నేను అవన్నీ మా అత్తయ్య కి చూపించి మొదటి రోజు రాత్రి జరిగిన విషయం అంతా చెప్పాను.తరువాతి రోజు మా అత్తయ్య మంచం తీసి బయట పడేసి నా రూం లోకి  క్రొత్త మంచం తెప్పించింది. నేను మంచాన్ని చూస్తూ ముసలి ఆవిడ యొక్క ఆత్మ ఎక్కడైన మంచి ప్లేస్ వెతుక్కుని వెల్లిపోవాలని మనసులో అనుకున్నా.
                నేను చివరిగా కోరుకునేది ఏంటంటే ఆత్మ నా క్రొత్త మంచాన్ని ఆవహించకూడదని. మీకు తెలిస్తే నాకు మెయిల్  చేయండి నా ఐడి cinelegend2014@gmail.com or comment on this post
ఆత్మ ఆవహించిన మంచం ఆత్మ ఆవహించిన మంచం Reviewed by Smartbyte group on June 02, 2014 Rating: 5

No comments: