ఆ సంఘటన నన్ను వదలట్లేదు



సంఘటన నన్ను వదలట్లేదు:-

          మేము 2007 సంవత్సరం లో ఒక పాత ఇంట్లో ఉండేవాళ్ళం .అప్పట్లో నేను భయంకరమైన సినిమాలు ఎక్కువగా చుసేవాడిని. ఒక సారి నేను మా తమ్ముడు ఒకే బెడ్ మీద  పడుకున్నాం .అప్పుడు మా తమ్ముడి వయస్సు 5 సంవత్సరాలు .ప్రస్తుతం  అతనికి 13 సంవత్సరాలు .
          నన్ను మొట్టమొదట భయపెట్టిన సంఘటన ఒక రోజు జరిగింది . సంఘటన నిన్నే జరిగినంతగా గుర్తుండిపోయింది. ఒక రోజు నేను ఒంటరిగా నా బెడ్ మీద కూర్చొని ఉండగా ఎవరో నన్ను చూస్తున్న భావన కలిగింది .ముందుగా మా అమ్మ గాని తలుపు దగ్గర నుంచొని నన్ను చూస్తుందేమోనని అనుకున్నాను .నేను వెనక్కు తిరిగి చూడాలని అనుకోలేదు .ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ పుత్రోత్సాహం తో నన్ను చూసి మురిసిపోతూ ఉంటుంది .ఆమె నవ్వడం నేను విని వెనక్కు తిరిగి చూసాను .కాని అక్కడ ఎవరూ లేరు . గదిలో నేనొక్కడినే ఉన్నాను. ముందుగా ఆమె అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ  వెల్లిందేమోనని అనుకుని నేను కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ద్రుశ్యాన్ని చూసి ఒక్క సారిగా షాక్ అయ్యాను .బయట తోట లో మా అమ్మ మా తమ్ముడి తో ఆడుకుంటూ ఉంది. నేను అలాగే చూస్తూ ఉండిపోయాను .కొంత సమయం వరకు మాటలు  కూడా రాలేదు .
          కొన్ని నెలల తరువాత మేము అద్దె ఇంటికి మారిపోయాం . నేను ఇంట్లో మొదటి రాత్రి గడిపే వరకూ కూడా అంతకు ముందు జరిగిన సంఘటన గురించి పూర్తిగా మర్చిపోయాను . గదిలో నాకెందుకో కొంచెం భయం గా ఉంది.నా గది ముదురు మామిడి చిగురు రంగు తో పెయింట్ చేసి ఉంది . నా గది చాలా పెద్దగా ఉంది దానికి ఒక పెద్ద కిటికీ తలుపు కూడా ఉండేది . నా బెడ్  నా గదికి మధ్యలో ఉండేది. నేనెప్పుడూ నాలోని భయాన్ని బయటకు కనిపించకుండా ఉండేవాడిని.నాకెప్పుడూ కిటికీ లోంచి నన్నెవరో చూస్తున్నట్లు అనిపించేది. నేను చాలా ప్రయత్నించాను పడుకోవడానికి కానీ భయం వల్ల నా నిద్ర మొత్తం పోయింది .అప్పుడు జరిగిన సంఘటన మళ్ళీ గుర్తుకువచ్చింది .
          అలా రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు .తరువాతి రోజు నా గదిని మొత్తం మార్చాలని నిశ్చయించుకున్నాను .నేను నా గదిని ఎరుపు మరియు బూడిదరంగు తో పెయింట్ చేసాను. పెద్ద కిటికీకి  ఇప్పుడు తలుపు పెట్టించాను . నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను .నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుని బెడ్ మీద కూర్చొని తింటూ T.V చూస్తున్నాను.కొన్ని రోజులకి నా భయం అంతా పోయింది .కిటికీ లోంచి నన్నెవరో చూస్తున్నట్టు అనిపించింది . కానీ నేను దాన్ని పెద్దగా పట్టించుకునేవాడ్ని కాదు.
          కాని ఒక రోజు రాత్రి అప్పుడు సమయం 3 గంటలు .నేను గాఢ నిద్ర లో  ఉన్నాను ఎవరో నన్ను చేత్తో తట్టి నిద్ర లేపుతున్నారు .నేను లేచి చూసే సరికి గదిలో నేను ఒంటరిగా ఉన్నాను .కాని గదిలో ఒక మూల ఒక మనిషి నుంచొని ఉన్నాడు .చెప్పడానికి కూడా వీలులేనంతగా ఉంది రూపం .నాకు ఒక్కసారిగా గగుర్పాటు పొడిచింది. నేను గట్టిగా అరిచాను .కాని అది వెల్లలేదు.నేను లేచి పరిగెత్తడానికి ప్రయత్నించాను కాని నేను లేవలేకపోతున్నాను. మొత్తం గది అంతా నల్లగా మారిపోయింది.కొన్ని సెకన్ల తరువాత అది అక్కద కనిపించలేదు.నేను పరిగెత్తుకుంటూ వెల్లి మా తమ్ముడి గది తలుపులు గట్టిగా కొడుతున్నాను . మా తమ్ముడు తలుపు తీసాడు నేను వాడితో చెబుతున్నాను అక్కడ ఏదో ఉంది నాకు భయమేస్తింది .అప్పుడు మా తమ్ముడు " అన్నయ్య చూడు ఏమీ లేదు అన్నయ్య నిదానంగా ఉండు ఏదో కల వచ్చి ఉంటుంది " అని చెప్పి నన్ను తన దగ్గరే పడుకోమన్నాడు తరువాత నిద్రపోయాను .
          నాకు ఇప్పటికీ కూడా అర్ధం కావట్లేదు నిజంగా దెయ్యాలు ఉంటాయా లేదా నన్నెవరో ఏడిపించడానికి ఇలా చేసారా ఏమో ! ఏమీ అర్ధం కావట్లేదు .మీకుతెలిస్తే నాకు మెయిల్  చేయండినా ఐడి cinelegend2014@gmail.com or comment on this post
ఆ సంఘటన నన్ను వదలట్లేదు ఆ సంఘటన నన్ను వదలట్లేదు Reviewed by Smartbyte group on June 02, 2014 Rating: 5

No comments: